
స్పైస్‌జెట్ దీపావళి ఆఫర్
న్యూఢిల్లీ: చౌక చార్జీల విమానయాన సంస్థ స్పైస్‌జెట్ మంగళవారం దీపావళి సేల్ ధమాకా పేరిట పరిమిత కాల ఆఫర్ ప్రకటించింది. దీని కింద దేశీ రూట్లలో ప్రయాణాలకు బేస్ చార్జీలు రూ. 749 నుంచి ప్రారంభమవుతాయి (పన్నులు అదనం). అలాగే విదేశీ ప్రయాణాలకు సంబంధించి చార్జీలు రూ. 3,999 నుంచి ప్రారంభమవుతాయి. అక్టోబర్ 29 దాకా ఈ ఆఫర్ కింద టికెట్లు బుక్ చేసుకోవచ్చు. వచ్చే ఏడాది ఫిబ్రవరి 1 నుంచి అక్టోబర్ 29 దాకా చేసే ప్రయాణాలకు ఈ ఆఫర్ వర్తిస్తుంది. కస్టమర్లకు మరింత చేరువయ్యేందుకు ఇది ఉపయోగపడగలదని స్పైస్‌జెట్ వర్గాలు పేర్కొన్నాయి.