సాక్షి, న్యూఢిల్లీ : దేశీయ అతిపెద్ద వాహన తయారీ దారు మారుతి సుజుకి ఇండియా (ఎంఎస్ఐఎల్) సోమవారం కొత్త కారును భారత మార్కెట్‌లో విడుదల చేసింది. భారత్ స్టేజ్ (బీఎస్) 6 నిబంధనలకు అనుగుణంగా దీన్ని తీసుకొచ్చింది. స్మార్ట్ హైబ్రిడ్ టెక్నాలజీతో బిఎస్ -6 ఇంజనతో కొత్త బాలెనో వాహనాన్ని పరిచయం చేసింది. 1.2 లీటర్ డ్యూయల్ జెట్ (పెట్రోల్) ఇంజీన్ బాలెనో కారు ధర రూ. 5.58 లక్షలు -8.90 లక్షలు (ఎక్స్-షోరూమ్, ఢిల్లీ) మధ్య ఉండనున్నాయి. త్వరలో దేశవ్యాప్తంగా నెక్సా దుకాణాల ద్వారా అందుబాటులో ఉంటుందని కంపెనీ ఒక ప్రకటనలో తెలిపింది.
2015లో లాంచ్ అయినప్పటినుంచి బాలెనో బ్లాక్ బ్లస్టర్‌గా నిలిచిందనీ, 5.5 లక్షల బాలెనో వినియోగదారులున్నారనీ మార్కెటింగ్ అండ్ సేల్స్ సీనియర్ ఎగ్జిక్యూటివ్ డైరెక్టర్ ఆర్ఎస్ కల్సి పేర్కొన్నారు. గత ఆర్థిక సంవత్సరంలో రెండు లక్షల యూనిట్లు విక్రయించించినట్టు తెలిపారు. ఇటీవలే బాలెనోను తాజా డిజైన్, టెక్నాలజీతో అప్‌గ్రేడ్ చేశామన్నారు.
లిథియం-అయాన్ బ్యాటరీ లాంగ్‌లైఫ్ సర్వీసు అందిస్తుందనీ, స్మార్ట్ హైబ్రిడ్ టెక్నాలజీతో, వాహన ఉద్గారాలను తగ్గించే మెరుగైన ఇంధన సామర్థ్యంలో వినియోగదారులను ఉత్సాహానిస్తుందని తెలిపారు.
Comments
Please login to add a commentAdd a comment