
న్యూఢిల్లీ: మారుతీ సుజుకీ కంపెనీ బాలెనో మోడల్‌లో కొత్త వేరియంట్‌ను సోమవారం మార్కెట్లోకి తెచ్చింది. ఈ కొత్త వేరియంట్ ధరలు రూ.5.4 లక్షల నుంచి రూ.8.77 లక్షల రేంజ్‌లో ఉంటాయని మారుతీ తెలిపింది. కొత్త బాలెనోలో రియర్ పార్కింగ్ కెమెరాతో కొత్త ఇన్ఫోటైన్మెంట్ సిస్టమ్, టూ టోన్ 16 అంగుళాల అలాయ్ వీల్స్, కారు డ్రైవింగ్ మరింత సౌకర్యవంతంగా ఉండేలా నావిగేషన్ విత్ లైవ్ ట్రాఫిక్, వెహికల్ ఇన్ఫర్మేషన్, స్క్రీన్‌పై ఎప్పటికప్పుడు అలర్ట్స్ అందటం వంటి ప్రత్యేకతలున్నాయని కంపెనీ సీనియర్ ఎగ్జిక్యూటివ్ డైరెక్టర్ (మార్కెటింగ్ అండ్ సేల్స్) ఆర్.ఎస్.కల్సి చెప్పారు.
డ్యుయల్ ఎయిర్‌బ్యాగ్స్, ఈబీడీతో కూడిన యాంటీలాక్ బ్రేకింగ్ సిస్టమ్, బ్రేక్ అసిస్ట్, ఐసోఫిక్స్ చైల్డ్ రిస్ట్రెయింట్ సిస్టమ్, స్పీడ్ అలర్ట్ సిస్టమ్ వంటి భద్రత ఫీచర్లు ఉన్నాయని వివరించారు. 1.2 లీటర్ పెట్రోల్ వేరియంట్ (మాన్యువల్ ట్రాన్సిమిషన్) ధరలు రూ.5.4–7.45 లక్షల రేంజ్‌లో, ఆటోమేటిక్ ట్రాన్సిమిషన్ ధరలు రూ.7.48–8.77 లక్షల రేంజ్‌లో ఉన్నాయని తెలిపారు. 1.3 లీటర్ డీజిల్ వేరియంట్‌లో మాన్యువల్ ట్రాన్సిమిషన్ మోడల్ మాత్రమే లభిస్తుందని, దీని ధరలు రూ.6.6–8.6 లక్షల రేంజ్‌లో ఉన్నాయని వివరించారు. బాలెనో మోడల్ మైలేజీ ఒక్కో లీటర్‌కు పెట్రోల్ వేరియంట్‌కు 21.4 కి.మీ. డీజిల్ వేరియంట్ 27.4 కి.మీ. వస్తుందని అంచనా.
Comments
Please login to add a commentAdd a comment