మారుతి సుజుకి దేశీయ మార్కెట్లో తన 14వ సీఎన్‌జీ కారుగా 'స్విఫ్ట్'ను లాంచ్ చేసింది. దీంతో స్విఫ్ట్ ఇప్పుడు సీఎన్‌జీ రూపంలో కూడా అందుబాటులోకి వచ్చేసింది. ఈ మోడల్ ప్రారంభ ధరలు రూ. 8.20 లక్షలు. ఈ ధర పెట్రోల్ వేరియంట్ కంటే కూడా రూ. 90వేలు ఎక్కువ కావడం గమనార్హం.
మారుతి స్విఫ్ట్ సీఎన్‌జీ కారు 1.2 లీటర్ ఇంజిన్ పొందుతుంది. ఇది సీఎన్‌జీలో ప్రయాణించేటప్పుడు 69 బీహెచ్‌పీ, 102 ఎన్ఎమ్ టార్క్ అందిస్తుంది. పెట్రోలుతో నడిచేటప్పుడు 80.4 బీహెచ్‌పీ, 112 ఎన్ఎమ్ టార్క్ ప్రొడ్యూస్ చేస్తుంది.ఇది ఫైవ్ స్పీడ్ మాన్యువల్ గేర్‌బాక్స్ మాత్రమే పొందుతుంది.
ఇదీ చదవండి: ఒక్కసారిగా పెరిగిన బంగారం, వెండి.. చుక్కలు తాకిన కొత్త ధరలు!
చూడటానికి సాధారణ స్విఫ్ట్ మాదిరిగా కనిపించే ఈ కొత్త సీఎన్‌జీ కారు లేటెస్ట్ ఫీచర్స్ పొందుతుంది. ఇవి వాహన వినియోగదారులకు చాలా అనుకూలంగా ఉంటాయి. ఈ కారులో 60:10 స్ప్లిట్ రియర్ సీటు ఉంటుంది. కాబట్టి లగేజ్ కొంత ఎక్కువగా తీసుకెళ్లడానికి అనుమతిస్తుంది.
Comments
Please login to add a commentAdd a comment