దేశంలోని అతిపెద్ద కార్ల తయారీ సంస్థ 'మారుతి సుజుకి ఇండియా' జనవరి 2025లో తమ కార్ల ధరలను 4 శాతం వరకు పెంచనున్నట్లు ప్రకటించింది. పెరుగుతున్న ఇన్‌పుట్ ఖర్చులు.. నిర్వహణ ఖర్చుల కారణంగా కంపెనీ ఈ నిర్ణయం తీసుకుంది. అయితే మోడల్ వారీగా ధర పెరుగుదలకు సంబంధించిన అధికారిక వివరాలు వెల్లడి కాలేదు.
మారుతి తన కొత్త కార్లను నెక్సా & అరేనా అవుట్లెట్ల ద్వారా విక్రయిస్తుంది. నెక్సా అవుట్‌లెట్‌లలో ఇగ్నీస్, బాలెనొ, సియాజ్, గ్రాండ్ విటారా, జిమ్నీ, ఎక్స్ఎల్6, ఇన్విక్టో కార్లను విక్రయిస్తోంది. అరేనా అవుట్లెట్ల ద్వారా ఆల్టో కే10, ఎస్ ప్రెస్సో, సెలెరియో, ఈకో, వ్యాగన్ ఆర్, స్విఫ్ట్, బ్రెజ్జా, ఎర్టిగా కార్లను విక్రయిస్తోంది.
మారుతి సుజుకి కొత్త ధరలను 2025 జనవరి నుంచే ప్రారంభించనుంది. ధరల పెరుగుదల.. కస్టమర్ల మీద ప్రభావం చూపే అవకాశం ఉంది. కాబట్టి కంపెనీ సేల్స్ వచ్చే ఏడాదిలో ఎలా ఉండనున్నాయనే విషయాలు కూడా తెలియాల్సి ఉంది.
వాహనాల ధరలను పెంచిన సంస్థల జాబితాలో ఇప్పటికే హ్యుందాయ్, మెర్సిడెస్ బెంజ్, బీఎండబ్ల్యూ, ఆడి, నిస్సాన్ మోటార్ వంటి కంపెనీలు చేరాయి. ఇప్పుడు తాజాగా మారుతి సుజుకి కూడా ఈ జాబితాలోకి చేరింది.
Comments
Please login to add a commentAdd a comment