పదేళ్లు దాటిన డీజిల్ వాహనాలు నగర రోడ్లపై తిరగకుండా చర్యలు తీసుకోవాలని నేషనల్ గ్రీన్ ట్రిబ్యునల్ ఇచ్చిన ఆదేశాలను విరమించుకోవాలని వాహనదారుల సంఘం...
వాహనదారుల డిమాండ్
న్యూఢిల్లీ : పదేళ్లు దాటిన డీజిల్ వాహనాలు నగర రోడ్లపై తిరగకుండా చర్యలు తీసుకోవాలని నేషనల్ గ్రీన్ ట్రిబ్యునల్ ఇచ్చిన ఆదేశాలను విరమించుకోవాలని వాహనదారుల సంఘం ఏఐటీఎమ్‌టీసీ అధ్యక్షుడు భీం వాధ్వా శుక్రవారం డిమాండ్ చేశారు. ఆదేశాలను వెనక్కి తీసుకోకపోతే మార్చి 13 (సోమవారం) అర్ధరాత్రి నుంచి అన్ని వాణిజ్య వాహనాలు నగరంలోకి రాకుండా అడ్డుకుంటామని ఆయన తెలిపారు. వాహనదారుల సంఘం శుక్రవారం సమావేశమై ఈ మేరకు నిర్ణయం తీసుకుంది.
కొందరి ఒత్తిడి కారణంగానే నేషనల్ గ్రీన్‌ట్రిబ్యునల్ ఈ ఆదేశాలు ఇచ్చిందని, ఇది ఎంత మాత్రం ఆమోదయోగ్యం కాదని ఆయన తెలిపారు. ఈ నిర్ణయం వల్ల లక్షల సంఖ్యలో ఉన్న ట్రక్కు డ్రైవర్లు, వారి కుటుంబాలు తీవ్ర ఇబ్బందులు పడవలసి వస్తుందని పేర్కొన్నారు. ఇప్పటికే ఢిల్లీ ట్రాఫిక్ పోలీసులు 250 వాహనాలను నగరంలో తిరగకుండా చేశారని చెప్పారు.