పదేళ్లు వాడి.. పడేయండి
న్యూఢిల్లీ: ఢిల్లీలోని పదేళ్ల కిందటి డీజిల్ వాహనాలన్నింటిని పక్కన పెట్టేయాలని నేషనల్ గ్రీన్ ట్రిబ్యునల్ సూచించింది. అలా చేయడం వల్ల విపరీతంగా పెరిగిపోయి ప్రమాదకరంగా మారిన వాతావరణ కాలుష్యం నుంచి ఢిల్లీ ప్రజలను బయటపడేసినట్లవుతుందని పేర్కొంది. ఇతర రాష్ట్రాలనుంచి వచ్చే అలాంటి వాహనాలను కూడా నగరంలోకి అనుమతించకూడదని సూచించింది. ఈ సందర్భంగా ఐదుగురు న్యాయమూర్తులతో ఉన్న ట్రిబ్యునల్ కోర్టు ఢిల్లీ, ఉత్తరప్రదేశ్, హర్యానా ప్రభుత్వాలను తీవ్రంగా తప్పుబట్టింది. కాలుష్యాన్ని నియంత్రించడంలో ఆ రాష్ట్రాలు విఫలమయ్యాయని పేర్కొంది.