పదేళ్లు దాటిన వాహనాలకు శరాఘతం | Diesel Vehicles Over 10 Years Old Banned In Delhi: Green Court | Sakshi
Sakshi News home page

పదేళ్లు దాటిన వాహనాలకు శరాఘతం

Published Mon, Jul 18 2016 1:01 PM | Last Updated on Wed, Oct 17 2018 3:46 PM

పదేళ్లు దాటిన వాహనాలకు శరాఘతం - Sakshi

పదేళ్లు దాటిన వాహనాలకు శరాఘతం

న్యూఢిల్లీ: పదేళ్లు దాటిన డీజిల్ వాహనాలను వెంటనే నిషేధించాలని నేసనల్ గ్రీన్ ట్రిబ్యునల్ కోర్టు తీర్పును వెలువరించింది. ఈ ఆదేశాలు ఉన్నపలంగా సత్వరమే అమల్లోకి తీసుకురావాలని స్పష్టం చేసింది. పదేళ్లు దాటిన డీజిల్ వాహనాలు రోడ్లపై ఇక కనిపించవద్దని కూడా చెప్పింది. ఇలాంటి వాహనాల విషయంలో కఠినంగా వ్యవహరించాలని చెప్పింది. పర్యావరణ సమస్యపై ఈ సందర్భంగా తీవ్ర ఆందోళన వ్యక్తం చేసింది.

దేశంలోనే అత్యధిక వాయుకాలుష్య నగరంగా ఢిల్లీ నిలిచిన విషయం తెలిసిందే. ఇప్పటికే ఢిల్లీలో కాలుష్యం తగ్గించేందుకు రకరకాల చర్యలను తీసుకుంటున్నారు. సరి-భేసి విధానం ప్రయోగాత్మకంగా రెండుసార్లు అమలు చేసింది కూడా ఈ కారణంతోనే. గ్రీన్ ట్రిబ్యునల్ తీర్పుతో వాహనదారులు ఆందోళనకు గురయ్యే అవకాశం ఉంది.

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement