ఢిల్లీ కేజ్రీవాల్ ప్రభుత్వం వాహనదారులకు భారీషాకిచ్చింది. 15 ఏళ్లకు పైబడిన వాహనాల లైసెన్స్‌లను రద్దు చేస్తున్నట్లు ప్రకటించింది. దీంతో మొత్తం 43 లక్షల వాహనాలు మూలన పడనున్నాయి. అందులో 32 లక్షల బైక్స్, 11లక్షల కార్లు ఉన్నాయని ఢిల్లీ ఆర్టీవో అధికారులు తెలిపారు.
ఒకవేళ 10ఏళ్లకు పైబడిన డీజీల్ వాహనాలు, లేదంటే 15 ఏళ్లకు పైబడిన పెట్రోల్ వాహనాల లైసెన్స్‌లు రద్దు చేసినా రోడ్ల మీద తిరుగుతున్నట్లు గుర్తిస్తే వెంటనే ఆ వాహనాల్ని స్క్రాప్‌గా మార్చేస్తామని ఆర్టీఐ అధికారులు హెచ్చరించారు. దీంతో ఆ వాహనాల్ని ఏం చేయాలో అర్ధంగాక పలువురు వాహనదారులు ప్రత్యామ్నాయ మార్గాల్ని అన్వేషిస్తున్నారు.
10ఏళ్లు పైబడిన డీజిల్ బండి ఉందా
10ఏళ్లు పైబడిన డీజిల్ వెహికల్ ఉంటే..ఆ వెహికల్స్‌ను స్క్రాప్‌గా మార్చకుండా ఆదాయాన్ని గడించే మార్గాలు ఉన్నాయి. 10ఏళ్లు నిండిన డీజిల్ వాహనాల్ని ఎలక్ట్రిక్ కిట్ల సాయంతో ఎలక్ట్రిక్ వెహికల్స్‌గా మార్చేసి, నో- అబ్జెక్షన్ సర్టిఫికెట్ ను తీసుకోవచ్చు. ఆ ఎన్‌ఓసీ సర్టిఫికెట్ సాయంతో వాటిని ఇతర రాష్ట్రాల్లో విక్రయించుకోవచ్చని ఢిల్లీ ఆర్టీఓ అధికారులు తెలిపారు.
Delhi govt in a bid to provide relief to the Delhiites affected by the NGT order mandating de-registration of Petrol & Diesel Vehicles above 15 & 10 yrs resp., has allowed
— Transport for Delhi (@TransportDelhi) December 17, 2021
✅Provision of NOC for registering in other states
✅Retrofitment to Electric & continue plying in Delhi pic.twitter.com/ZaqnoS0f0M
స్క్రాప్‌గా మార్చకుండా
లైసెన్స్ రద్దు చేసిన వాహనాల్ని ఎలక్ట్రిక్ వాహనాలుగా మార్చుకోవచ్చని ఢిల్లీ ఆర్టీవో అధికారులు తెలిపారు. ఢిల్లీ ట్రాన్స్‌పోర్ట్ విభాగం గుర్తించిన ఆరు మ్యానుఫ్యాక్చరింగ్ ఏజెన్సీల్లో మాత్రమే ఎలక్ట్రిక్ వాహనాలుగా మార్చుకోవచ్చని, ఆ వాహనాల్ని మళ్లీ వినియోగించుకోవచ్చని చెప్పింది.
ఏజెన్సీలతో ప్రభుత్వం సంప‍్రదింపులు
ఓల్డ్ వెహికల్స్‌ను ఎలక్ట్రిక్ వెహికల్స్ గా మార్చే ఏజెన్సీలతో ఢిల్లీ ప్రభుత్వం సంప‍్రదింపులు జరుపుతోంది. అందులో ఆరు ఏజెన్సీలకు ఢిల్లీ ఆర్టీఓ విభాగం- ప్రముఖ టెస్టింగ్ సర్టిఫికేషన్, రీసెర్చ్ అండ్ డెవలప్‌మెంట్ ఏజెన్సీ ఇంటర్నేషన్ సెంటర్ ఫర్ ఆటోమోటీవ్ టెక్నాలజీ(ఐసీఏటీ)లు ఆమోదం తెలిపాయి. వాటిలో ఎట్రియో ఆటోమొబైల్, 3ఈవీ ఇండస్ట్రీస్, బూమా ఇన్నోవేటివ్ ట్రాన్స్‌పోర్ట్ సొల్యూషన్స్ రెన్యూవబుల్, జీరో 21 రెన్యూవబుల్ ఎనర్జీ సొల్యూషన్స్, వీఈఎల్‌ఈవీ మోటార్స్ ఇండియా ప్రైవేట్ లిమిటెడ్ కంపెనీలు ఉన్నాయి. ఆ కంపెనీల్లో మీ పాత వెహికల్స్‌ను ఎలక్ట్రిక్ వెహికల్స్‌గా మార్చుకొని వినియోగించుకోవచ్చు. లేదంటే అమ్ముకోవచ్చు.
చదవండి: ఎలన్ మస్క్ మరో రికార్డ్, కారు ఏదైనా..టెస్లాకు దాసోహం అవ్వాల్సిందే
Comments
Please login to add a commentAdd a comment