Petrol version
-
పెట్రోల్ వాహనాలతో సమానంగా ఈవీల రేట్లు
న్యూఢిల్లీ: ఏడాది వ్యవధిలోగా ఎలక్ట్రిక్ వాహనాల (ఈవీ) ధరలు పెట్రోల్ వాహనాల రేట్లతో సమాన స్థాయికి తగ్గేలా ప్రయత్నాలు చేస్తున్నామని కేంద్ర రోడ్డు రవాణా, జాతీయ రహదారుల శాఖ మంత్రి నితిన్ గడ్కరీ చెప్పారు. పెట్రోల్, డీజిల్ స్థానంలో పంటల వ్యర్ధాల నుంచి ఉత్పత్తి చేసే ఇథనాల్‌ను వాడకాన్ని ప్రోత్సహిస్తున్నట్లు ఆయన తెలిపారు. తద్వారా శిలాజ ఇంధనాల దిగుమతుల భారాన్ని తగ్గించుకోవచ్చని గడ్కరీ పేర్కొన్నారు. ప్రస్తుతం బ్యాటరీల వ్యయాలు భారీగా ఉండటంతో ఎలక్ట్రిక్ వాహనాల రేట్లు చాలా అధిక స్థాయిలో ఉంటున్నాయి. వాహనం ధరలో బ్యాటరీల వాటా 35–40 శాతం మేర ఉంటుంది. ప్రస్తుతం ప్యాసింజర్ వాహనాల విభాగంలో సంప్రదాయ ఇంధనాల వాహనాలతో పోలిస్తే ఎంట్రీ స్థాయి ఈవీ రేటు దాదాపు రెండు రెట్లు ఎక్కువగా ఉంటోంది. ఇక ద్విచక్ర వాహనాల విభాగంలోనూ పెట్రోల్ మోడల్స్‌తో పోలిస్తే ఎలక్ట్రిక్ వెర్షన్ల రేటు 1.5 రెట్లు ఎక్కువగా ఉంటోంది. కాలుష్యకారక ఇంధనాల వినియోగాన్ని తగ్గించుకునే దిశగా పర్యావరణహిత విధానాలను ప్రోత్సహిస్తున్నట్లు గడ్కరీ చెప్పారు. -
వాహనదారులకు భారీషాక్ , 43 లక్షల వాహనాల లైసెన్స్ రద్దు!
ఢిల్లీ కేజ్రీవాల్ ప్రభుత్వం వాహనదారులకు భారీషాకిచ్చింది. 15 ఏళ్లకు పైబడిన వాహనాల లైసెన్స్‌లను రద్దు చేస్తున్నట్లు ప్రకటించింది. దీంతో మొత్తం 43 లక్షల వాహనాలు మూలన పడనున్నాయి. అందులో 32 లక్షల బైక్స్, 11లక్షల కార్లు ఉన్నాయని ఢిల్లీ ఆర్టీవో అధికారులు తెలిపారు. ఒకవేళ 10ఏళ్లకు పైబడిన డీజీల్ వాహనాలు, లేదంటే 15 ఏళ్లకు పైబడిన పెట్రోల్ వాహనాల లైసెన్స్‌లు రద్దు చేసినా రోడ్ల మీద తిరుగుతున్నట్లు గుర్తిస్తే వెంటనే ఆ వాహనాల్ని స్క్రాప్‌గా మార్చేస్తామని ఆర్టీఐ అధికారులు హెచ్చరించారు. దీంతో ఆ వాహనాల్ని ఏం చేయాలో అర్ధంగాక పలువురు వాహనదారులు ప్రత్యామ్నాయ మార్గాల్ని అన్వేషిస్తున్నారు. 10ఏళ్లు పైబడిన డీజిల్ బండి ఉందా 10ఏళ్లు పైబడిన డీజిల్ వెహికల్ ఉంటే..ఆ వెహికల్స్‌ను స్క్రాప్‌గా మార్చకుండా ఆదాయాన్ని గడించే మార్గాలు ఉన్నాయి. 10ఏళ్లు నిండిన డీజిల్ వాహనాల్ని ఎలక్ట్రిక్ కిట్ల సాయంతో ఎలక్ట్రిక్ వెహికల్స్‌గా మార్చేసి, నో- అబ్జెక్షన్ సర్టిఫికెట్ ను తీసుకోవచ్చు. ఆ ఎన్ఓసీ సర్టిఫికెట్ సాయంతో వాటిని ఇతర రాష్ట్రాల్లో విక్రయించుకోవచ్చని ఢిల్లీ ఆర్టీఓ అధికారులు తెలిపారు. Delhi govt in a bid to provide relief to the Delhiites affected by the NGT order mandating de-registration of Petrol & Diesel Vehicles above 15 & 10 yrs resp., has allowed ✅Provision of NOC for registering in other states ✅Retrofitment to Electric & continue plying in Delhi pic.twitter.com/ZaqnoS0f0M — Transport for Delhi (@TransportDelhi) December 17, 2021 స్క్రాప్‌గా మార్చకుండా లైసెన్స్ రద్దు చేసిన వాహనాల్ని ఎలక్ట్రిక్ వాహనాలుగా మార్చుకోవచ్చని ఢిల్లీ ఆర్టీవో అధికారులు తెలిపారు. ఢిల్లీ ట్రాన్స్పోర్ట్ విభాగం గుర్తించిన ఆరు మ్యానుఫ్యాక్చరింగ్ ఏజెన్సీల్లో మాత్రమే ఎలక్ట్రిక్ వాహనాలుగా మార్చుకోవచ్చని, ఆ వాహనాల్ని మళ్లీ వినియోగించుకోవచ్చని చెప్పింది. ఏజెన్సీలతో ప్రభుత్వం సంప్రదింపులు ఓల్డ్ వెహికల్స్‌ను ఎలక్ట్రిక్ వెహికల్స్ గా మార్చే ఏజెన్సీలతో ఢిల్లీ ప్రభుత్వం సంప్రదింపులు జరుపుతోంది. అందులో ఆరు ఏజెన్సీలకు ఢిల్లీ ఆర్టీఓ విభాగం- ప్రముఖ టెస్టింగ్ సర్టిఫికేషన్, రీసెర్చ్ అండ్ డెవలప్మెంట్ ఏజెన్సీ ఇంటర్నేషన్ సెంటర్ ఫర్ ఆటోమోటీవ్ టెక్నాలజీ(ఐసీఏటీ)లు ఆమోదం తెలిపాయి. వాటిలో ఎట్రియో ఆటోమొబైల్, 3ఈవీ ఇండస్ట్రీస్, బూమా ఇన్నోవేటివ్ ట్రాన్స్పోర్ట్ సొల్యూషన్స్ రెన్యూవబుల్, జీరో 21 రెన్యూవబుల్ ఎనర్జీ సొల్యూషన్స్, వీఈఎల్ఈవీ మోటార్స్ ఇండియా ప్రైవేట్ లిమిటెడ్ కంపెనీలు ఉన్నాయి. ఆ కంపెనీల్లో మీ పాత వెహికల్స్‌ను ఎలక్ట్రిక్ వెహికల్స్‌గా మార్చుకొని వినియోగించుకోవచ్చు. లేదంటే అమ్ముకోవచ్చు. చదవండి: ఎలన్ మస్క్ మరో రికార్డ్, కారు ఏదైనా..టెస్లాకు దాసోహం అవ్వాల్సిందే -
వోల్వో నుంచి 7 సీటర్ వెహికల్.. భద్రతకు భరోసా
హైదరాబాద్, బిజినెస్‌బ్యూరో: వాహన తయారీలో ఉన్న వోల్వో కార్ ఇండియా ఎస్యూవీ ఎక్స్‌సీ90 కొత్త వెర్షన్ విడుదల చేసింది. ధర ఎక్స్‌షోరూంలో రూ.89.9 లక్షలు.ఏడు సీట్ల సామర్థ్యంతో 1,969 సీసీ పెట్రోల్ మైల్డ్–హైబ్రిడ్ ఇంజన్, ఇన్ట్యూటివ్ టచ్ స్క్రీన్ ఇంటర్ఫేస్, అత్యాధునిక ఎయిర్ క్లీనర్, అడాప్టివ్ క్రూయిజ్ కంట్రోల్, పైలట్ అసిస్ట్, లేన్ కీపింగ్ ఎయిడ్, క్రాస్ ట్రాఫిక్ అలర్ట్‌తో బ్లైండ్ స్పాట్ ఇన్ఫర్మేషన్ వంటి ఫీచర్లు ఉన్నాయి. మందువైపు కొలీషన్ మిటిగేషన్ సపోర్ట్, వెనుకవైపు కొలీషన్ వార్నింగ్, మిటిగేషన్ సపోర్ట్ వంటి హంగులు ఉన్నాయి. డీజిల్ నుంచి పెట్రోల్ వైపు మళ్లేందుకే ఈ కొత్త వెర్షన్‌ను రూపొందించినట్టు కంపెనీ తెలిపింది. -
మారుతి ఎస్-క్రాస్ పెట్రోల్.. ధర ఎంతంటే
సాక్షి, ముంబై: దేశీయకార్ల తయారీ సంస్థ మారుతి సుజుకి కొత్త కాంపాక్ట్ ఎస్యూవీ వెర్షన్ ఆవిష్కరించింది. కరోనా వైరస్ సంక్షోభం నుంచి తేరుకున్న ఆటో మేజర్ మారుతి ఎస్-క్రాస్ పెట్రోల్ కారును దేశంలో లాంచ్ చేసింది. దీని 8.39 లక్షల రూపాయల (ఎక్స్-షోరూమ్, ఢిల్లీ) నుండి ప్రారంభమవుతాయి. మారుతి సుజుకి ఎస్-క్రాస్‌లోని 1.5-లీటర్ పెట్రోల్ ఇంజన్ 103 బిహెచ్పీ, 138 ఎన్ఎమ్ పీక్ టార్క్‌ను అందిస్తుంది. మాన్యువల్, ఆటోమేటిక్ ఆప్షన్లలో, నాలుగు వేరియంట్లలో లభ్యం. ఈ మోడల్‌ను కంపెనీ నెక్సా డీలర్‌షిప్‌ల ద్వారా మాత్రమే కాకుండా ఆన్లైన్లో కూడా బుక్ చేసుకోవచ్చు. బుకింగ్‌లు ఇప్పటికే మొదలు కాగా డెలివరీలు మరికొద్ది రోజుల్లో ప్రారంభమవుతాయి. మారుతి సుజుకి ఎస్-క్రాస్ పెట్రోల్ ధరలు ఎస్-క్రాస్ పెట్రోల్ సిగ్మా 8.39 లక్షల రూపాయలు ఎస్-క్రాస్ పెట్రోల్ డెల్టా మాన్యువల్ ధర 9.60 లక్షల రూపాయలు, ఆటోమేటిక్ వెర్షన్ ధర 10.84 లక్షలు ఎస్-క్రాస్ పెట్రోల్ జీటా మాన్యువల్ 9.95 లక్షల రూపాయలు, ఆటోమేటిక్ వెర్షన్ ధర 11.19 లక్షలు ఎస్-క్రాస్ పెట్రోల్ ఆల్ఫా మాన్యువల్ 11.16 లక్షల రూపాయలు , ఆటోమేటిక్ వెర్షన్ ధర 12.39 లక్షలు -
పెట్రోల్, డీజిల్ వాహనాల నిషేధం అక్కర్లేదు
న్యూఢిల్లీ: పెట్రోల్, డీజిల్ వాహనాలను నిషేధించాల్సిన అవసరం లేదన్నారు కేంద్ర ఉపరితల రవాణా మంత్రి నితిన్ గడ్కరీ. ఎలక్ట్రిక్ వాహన (ఈవీ)విక్రయాలు సమజంగానే ఊపందుకుంటున్నాయని చెప్పారు. వచ్చే రెండేళ్లలో అన్ని బస్సులు ఎలక్ట్రిక్ రూపంలోనే ఉంటాయన్నారు. 2030 తర్వాత దేశంలో ఈవీ విక్రయాలనే అనుమతించాలన్నది నీతి ఆయోగ్ సిఫారసు. 150సీసీలోపు ద్విచక్ర, త్రిచక్ర వాహనాలను 2025 తర్వాత ఈవీ రూపంలో అనుమతించాలని కూడా సిఫారసు చేసింది. కాకపోతే మంత్రులు గడ్కరీ, ధర్మేంద ప్రధాన్ వంటి వారు తర్వాత ఈ ప్రతిపాదనలను ఖండించారు. ఎంఎస్ఎంఈల్లో ఇంధన సామర్థ్యం అనే అంశంపై ఢిల్లీలో నిర్వహించిన జాతీయ సదస్సులో సోమవారం పాల్గొన్న సందర్భంగా మంత్రి గడ్కరీ ఈ అంశాన్ని ప్రస్తావనకు తీసుకొచ్చారు. ‘‘ఎలక్ట్రిక్ కార్లు, బైక్‌లు, బస్సుల అమ్మకాలు సహజంగానే పెరుగుతున్నాయి. వాటి అమ్మకాలను తప్పనిసరి చేయాల్సిన అవసరం లేదు. అలాగే, పెట్రోల్, డీజిల్ వాహనాలను నిషేధించాల్సిన అవసరం కూడా లేదు. రెండేళ్లలో అన్ని బస్సులు ఎలక్ట్రిక్, బయో ఎథనాల్, సీఎన్జీతో తిరిగేవే ఉంటాయి’’ అని గడ్కరీ వివరించారు. వ్యవసాయ వ్యర్థాలు (వరిగడ్డి వంటివి) వంటి వాటితో విద్యుత్తును తయారు చేసుకోవాల్సిన అవసరాన్ని వివరించారు. ఆ విద్యుత్తును వాహనాలకు వినియోగించుకోవడం ద్వారా, రైతుల ఆదాయం పెంచుకోవచ్చన్నారు. ప్రస్తుతం ఈ గడ్డిని రైతులు వృథాగా కాల్చేస్తున్నారని, దీనివల్ల వాయు, భూ కాలుష్యం పెరుగుతున్నట్టు చెప్పారు. ఎన్టీపీసీ సంస్థ ద్వారా ఇప్పటికే ఈ తరహా వ్యర్థాల సమీకరణను ప్రారంభించినట్టు తెలిపారు. ఎంస్ఎంఈలకు తక్కువ రేటుకు రుణాలు సూక్ష్మ, చిన్న, మధ్య తరహా సంస్థలకు (ఎంఎస్ఎంఈలు) తక్కువ రేటుకే రుణాలు అందించేందుకు గాను ప్రపంచ బ్యాంకు, ఆసియా అభివృద్ధి బ్యాంకులతో ఒప్పందాలు చేసుకున్నట్టు నితిన్ గడ్కరీ తెలిపారు. ‘‘అధిక మూలధన వ్యయ సమస్య ఉంది. ప్రపంచవ్యాప్తంగా వడ్డీ రేట్లు 2–3 శాతంగా ఉన్నాయి. కొన్ని దేశాల్లో అయితే ఒక్క శాతమే. కానీ, మన దేశంలో ఎంఎస్ఎంఈ రుణాలపై 11–14 శాతం వరకు వడ్డీ రేట్లు అమలవుతున్నాయి. నిధుల వ్యవయాలను తగ్గించాల్సిన అవసరం ఉంది’’ అని వివరించారు. రవాణా వ్యయాలను తగ్గించగలిగితే ఎగుమతులు ప్రస్తుత స్థాయికి రెట్టింపునకు పైగా పెరుగుతాయన్నారు. -
ఎం అండ్ ఎం ఎక్స్‌యూవీ500 పెట్రోల్ వెర్షన్ లాంచ్
సాక్షి, న్యూఢిల్లీ: మహీంద్ర అండ్‌మహీంద్ర కొత్ వెర్షన్ ఎస్‌యూవీలాంచ్ చేసింది. పెట్రోల్ వెర్షన్లో ఎస్యూవీ ఎక్స్ యూవీని 500 ను విడుదల చేసింది. దీని రూ. 15.49 లక్షలు (ఎక్స్-షోరూమ్ ఢిల్లీ) గా నిర్ణయించింది. తాజా నివేదిక ప్రకారం 6స్పీడ్ ఆటోమేటిక్ ట్రాన్స్‌మిషన్‌తో కొత్త వెహికల్ లభించనుంది. 2.2 లీటర్ mHawk పెట్రోల్ ఇంజిన్‌తో, 140 హెచ్‌పీ పవర్‌ను ఉత్పత్తి చేస్తుంది. అలాగే స్టాటిక్ బెండింగ్ హెడ్ లైట్లు, , క్రూయిస్ కంట్రోల్, పుష్ బటన్ స్టార్ట్ లాంటి ఇతర ప్రధాన ఫీచర్లతో ఈ ఎస్యూవీ లభ్యం. పెట్రోల్ వేరియంట్ కోసం ఆసక్తిగా ఎదురు చూస్తున్న కస్టమర్లకు ఎక్స్‌యూవీ500 అందుబాటులోకి తీసుకురావడం సంతోషంగా ఉందని ఎంఅండ్ ఎం చీఫ్ సేల్స్ & మార్కెటింగ్ ఆఫ్ రామ్ నక్రా ఒక ప్రకటనలో తెలిపారు. -
ఇన్నోవా క్రిస్టాలో.. పెట్రోల్ వేరియంట్
న్యూఢిల్లీ : ‘టయోటా’ తన మల్టీపర్పస్ వెహికల్ ‘ఇన్నోవా క్రిస్టా’లో తాజాగా పెట్రోల్ వెర్షన్‌ను మార్కెట్లోకి తీసుకువచ్చింది. దీని ధర శ్రేణి రూ.13.73 లక్షలు-రూ.19.63 లక్షల (ఎక్స్‌షోరూమ్ ఢిల్లీ) శ్రేణిలో ఉంది. ఢిల్లీ-ఎన్సీఆర్ ప్రాం తంలో విక్రయాలను దృష్టిలో ఉంచుకొని కంపెనీ ఈ వెర్షన్ ను అందుబాటులోకి తెచ్చింది. ఇక్కడ డీజిల్ 2.0 లీటర్, అంతకన్నా ఎక్కువ ఇంజిన్ సామర్థ్యమున్న వెహికల్స్‌పై నిషేధం విధించిన సంగతి తెలిసిందే. 2.7 లీటర్ ఇంజిన్ సామర్థ్యం కలిగిన ‘ఇన్నోవా క్రిస్టా’ పెట్రోల్ వెర్షన్ బుకింగ్స్‌ను నేటి నుంచి ప్రారంభించామని, వీటి డెలివరీ నెలాఖరు నుంచి ఉంటుందని కంపెనీ వివరించింది. మాన్యువల్ ట్రాన్స్మిషన్ వేరి యంట్ లీటరుకు 9.89 కిలోమీటర్లు, ఇక ఆటోమేటిక్ వేరియంట్ లీటరుకు 10.83 కిలోమీటర్ల మైలేజ్‌ను ఇస్తాయని పేర్కొం ది. ఇక డీజిల్ వేరియంట్ 2.4 లీటర్ (5 స్పీడ్ మాన్యువల్ ట్రాన్స్మిషన్), 2.8 లీటర్ (6 స్పీడ్ మాన్యువల్ ట్రాన్స్మిషన్) అనే రెండు ఇంజిన్ ఆప్షన్లలో లభిస్తోంది. దీని ధర రూ.13.84 లక్షలు-రూ.20.78 లక్షల (ఎక్స్‌షోరూమ్ ముంబై) శ్రేణిలో ఉంది. -
వోల్వో వీ40 క్రాస్ కంట్రీ.. పెట్రోల్ వెర్షన్
ధర రూ. 27 లక్షలు ముంబై: స్వీడన్‌కు చెందిన లగ్జరీ కార్ల కంపెనీ వోల్వో ఆటో ఇండియా(వీఏఐ) సోమవారం వీ40 క్రాస్ కంట్రీ పెట్రోల్ వేరియంట్‌ను మార్కెట్లోకి తెచ్చింది. ధర రూ.27 లక్షలు(ఎక్స్ షోరూమ్, ముంబై) అని వోల్వో ఇండియా ఎండీ థామస్ ఎర్న్బెర్గ్ చెప్పారు. టీ4 ఇంజిన్, 1.6 జీడీటీఐ(గ్యాసోలిన్ టర్బోచార్జ్డ్ డెరైక్ట్ ఇంజెక్షన్) 4 సిలిండర్‌తో రూపొందిన ఈ కారులో 6 స్పీడ్ ఆటోమాటిక్ ట్రాన్స్మిషన్ తదితర ఫీచర్లున్నాయని వివరించారు. సోమవారం నుంచే ఈ కార్ల విక్రయాలను దేశవ్యాప్తంగా ఉన్న తమ వోల్వో డీలర్‌షిప్‌ల ద్వారా ప్రారంభించామని పేర్కొన్నారు. 2013 జూన్‌లో వీ40 క్రాస్ కంట్రీలో డీజిల్ వేరియంట్‌ను భారత్‌లోకి తెచ్చామని, మంచి స్పందన లభించిందని, ఆ ఉత్సాహంతోనే ఇప్పుడు పెట్రోల్ వేరియంట్‌ను అందిస్తున్నామని తెలిపారు. అధిక అమ్మకాల కోసం ధరను ఆకర్షణీయంగా నిర్ణయించామని పేర్కొన్నారు. భారత్‌లో పెట్రోల్, డీజిల్ వేరియంట్లలో లభిస్తున్న ఏకైక వోల్వో కారు ఇదే కావడం గమనార్హం.