మారుతి ఎస్-క్రాస్ పెట్రోల్.. ధర ఎంతంటే   | Maruti Suzuki SCross Petrol Launched In India | Sakshi
Sakshi News home page

మారుతి ఎస్-క్రాస్ పెట్రోల్.. ధర ఎంతంటే  

Published Wed, Aug 5 2020 2:21 PM | Last Updated on Wed, Aug 5 2020 2:26 PM

Maruti Suzuki SCross Petrol Launched In India - Sakshi

సాక్షి, ముంబై:  దేశీయకార్ల తయారీ సంస్థ మారుతి సుజుకి కొత్త కాంపాక్ట్ ఎస్‌యూవీ వెర్షన్ ఆవిష్కరించింది. కరోనా వైరస్ సంక్షోభం నుంచి తేరుకున్న ఆటో మేజర్ మారుతి ఎస్-క్రాస్ పెట్రోల్ కారును దేశంలో లాంచ్ చేసింది. దీని 8.39 లక్షల రూపాయల (ఎక్స్-షోరూమ్, ఢిల్లీ) నుండి ప్రారంభమవుతాయి. మారుతి సుజుకి ఎస్-క్రాస్‌లోని 1.5-లీటర్ పెట్రోల్ ఇంజన్ 103 బిహెచ్‌పీ, 138 ఎన్ఎమ్ పీక్ టార్క్‌ను అందిస్తుంది. మాన్యువల్, ఆటోమేటిక్ ఆప్షన్లలో, నాలుగు వేరియంట్లలో లభ్యం. ఈ మోడల్‌ను కంపెనీ నెక్సా డీలర్‌షిప్‌ల ద్వారా మాత్రమే కాకుండా ఆన్‌లైన్‌లో కూడా బుక్ చేసుకోవచ్చు. బుకింగ్‌లు ఇప్పటికే మొదలు కాగా డెలివరీలు మరికొద్ది రోజుల్లో ప్రారంభమవుతాయి.

మారుతి సుజుకి ఎస్-క్రాస్ పెట్రోల్ ధరలు
ఎస్-క్రాస్ పెట్రోల్  సిగ్మా 8.39 లక్షల  రూపాయలు
ఎస్-క్రాస్ పెట్రోల్  డెల్టా  మాన్యువల్ ధర  9.60 లక్షల రూపాయలు, ఆటోమేటిక్ వెర్షన్ ధర 10.84 లక్షలు
ఎస్-క్రాస్ పెట్రోల్  జీటా మాన్యువల్  9.95 లక్షల రూపాయలు,  ఆటోమేటిక్ వెర్షన్ ధర 11.19 లక్షలు
ఎస్-క్రాస్ పెట్రోల్  ఆల్ఫా మాన్యువల్  11.16 లక్షల రూపాయలు ,  ఆటోమేటిక్ వెర్షన్ ధర 12.39 లక్షలు

No comments yet. Be the first to comment!
Add a comment
Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
 
Advertisement