ఇన్నోవా క్రిస్టాలో.. పెట్రోల్ వేరియంట్ | Toyota Innova Crysta Petrol Launched In India; Prices Start At Rs. 13.73 Lakh | Sakshi
Sakshi News home page

ఇన్నోవా క్రిస్టాలో.. పెట్రోల్ వేరియంట్

Published Tue, Aug 9 2016 12:29 AM | Last Updated on Mon, Sep 4 2017 8:25 AM

ఇన్నోవా క్రిస్టాలో.. పెట్రోల్ వేరియంట్

ఇన్నోవా క్రిస్టాలో.. పెట్రోల్ వేరియంట్

న్యూఢిల్లీ : ‘టయోటా’ తన మల్టీపర్పస్ వెహికల్ ‘ఇన్నోవా క్రిస్టా’లో తాజాగా పెట్రోల్ వెర్షన్‌ను మార్కెట్‌లోకి తీసుకువచ్చింది. దీని ధర శ్రేణి రూ.13.73 లక్షలు-రూ.19.63 లక్షల (ఎక్స్‌షోరూమ్ ఢిల్లీ) శ్రేణిలో ఉంది. ఢిల్లీ-ఎన్‌సీఆర్ ప్రాం తంలో విక్రయాలను దృష్టిలో ఉంచుకొని కంపెనీ ఈ వెర్షన్ ను అందుబాటులోకి తెచ్చింది. ఇక్కడ డీజిల్ 2.0 లీటర్, అంతకన్నా ఎక్కువ ఇంజిన్ సామర్థ్యమున్న వెహికల్స్‌పై నిషేధం విధించిన సంగతి తెలిసిందే. 2.7 లీటర్ ఇంజిన్ సామర్థ్యం కలిగిన ‘ఇన్నోవా క్రిస్టా’ పెట్రోల్ వెర్షన్ బుకింగ్స్‌ను నేటి నుంచి ప్రారంభించామని, వీటి డెలివరీ నెలాఖరు నుంచి ఉంటుందని కంపెనీ వివరించింది.

మాన్యువల్ ట్రాన్స్‌మిషన్ వేరి యంట్ లీటరుకు 9.89 కిలోమీటర్లు, ఇక ఆటోమేటిక్ వేరియంట్ లీటరుకు 10.83 కిలోమీటర్ల మైలేజ్‌ను ఇస్తాయని పేర్కొం ది. ఇక డీజిల్ వేరియంట్ 2.4 లీటర్ (5 స్పీడ్ మాన్యువల్ ట్రాన్స్‌మిషన్), 2.8 లీటర్ (6 స్పీడ్ మాన్యువల్ ట్రాన్స్‌మిషన్) అనే రెండు ఇంజిన్ ఆప్షన్లలో లభిస్తోంది. దీని ధర రూ.13.84 లక్షలు-రూ.20.78 లక్షల (ఎక్స్‌షోరూమ్ ముంబై) శ్రేణిలో ఉంది.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement