![దేశ రాజధానిలో పాత వాహనాలకు గ్రీన్ సిగ్నల్ - Sakshi](/styles/webp/s3/article_images/2017/09/3/71425000767_625x300_1.jpg.webp?itok=4EGpMINK)
దేశ రాజధానిలో పాత వాహనాలకు గ్రీన్ సిగ్నల్
ఢిల్లీ: దేశ రాజధానిలో 10 ఏళ్ల దాటిన డీజిల్ వాహనాలను నిషేధిస్తూ ఢిల్లీ సర్కారు గతంలో ఇచ్చిన ఉత్తర్వులను సుప్రీంకోర్టు తాజాగా కొట్టివేసింది. ఢిల్లీలో పర్యావరణాన్ని రక్షించి స్వచ్ఛమైన గాలిని అందించేందుకు 10 ఏళ్ల పై బడిన డీజిల్ వాహనాలను నిషేధించాలంటూ నేషనల్ గ్రీన్ ట్రిబ్యునల్ జారీ చేసిన ఆదేశాలను సుప్రీం కొట్టివేసింది. ఆ వాహనాలపై నిషేధం విధించి వారిని నిరుత్సాహ పరచడం సమంజసం కాదంటూ ధర్మాసనం పేర్కొంది.
గత డిసెంబర్ నెలలో 10 ఏళ్ల పై బడిన డీజిల్ వాహనాలతో పాటు, 15 ఏళ్లకు పైగా రోడ్లుపై తిరుగుతున్నపెట్రోల్ వాహనాల నిషేధంపై నిర్ణయం తీసుకున్నా.. ఆ ఉత్తర్వులను ఏప్రిల్ 8 నుంచి అమలు చేసింది. అయితే సుప్రీం తీర్పుతో మరోసారి పాత వాహనాలు దేశ రాజధానిలో చక్కర్లుకొట్టనున్నాయి.