న్యూఢిల్లీ: కఠిన ఉద్గార నిబంధనల కారణంగా ప్యాసింజర్ వాహనాల విక్రయాల్లో డీజిల్ కార్ల శాతం తగ్గుతుందని మారుతీ సుజుకీ ఇండియా, హ్యుందాయ్ మోటార్ ఇండియా అంచనా వేస్తున్నాయి. వాహనం ఖరీదు కావడమే ఇందుకు కారణమని చెబుతున్నాయి. ఇప్పటికే డీజిల్ వాహన అమ్మకాలు క్షీణిస్తున్నట్టు తెలిపాయి.
నిబంధనలు కఠినతరం అయితే సహజంగానే ధర పెరుగుతుందని.. రాబోయే రోజుల్లో డీజిల్ వాహనాల విక్రయాల తగ్గుదల శాతం వేగంగా ఉంటుందని మారుతీ సుజుకీ ఇండియా మార్కెటింగ్, సేల్స్ సీనియర్ ఎగ్జిక్యూటివ్ ఆఫీసర్ శశాంక్ శ్రీవాస్తవ వెల్లడించారు. డీజిల్ మోడళ్లకు స్వస్తి పలుకుతున్నట్టు ఇప్పటికే చాలా కంపెనీలు స్పష్టం చేశాయన్నారు.
ప్యాసింజర్ వెహికిల్స్ పరిశ్రమలో 2013–14లో డీజిల్ మోడళ్ల వాటా 53.2 శాతం. ఈ ఏడాది ఏప్రిల్–ఆగస్ట్‌లో ఇది 18.2 శాతానికి వచ్చి చేరిందన్నారు. డీజిల్–పెట్రోల్ మోడళ్ల మధ్య ధర వ్యత్యాసం తగ్గింది. డీజిల్ వాహనాలతో లభించే వ్యయ ప్రయోజనాలు తగ్గాయన్నారు. హ్యుందాయ్ మోటార్ ఇండియా సీవోవో తరుణ్ గర్గ్ మాట్లాడుతూ తమ కంపెనీ అమ్మకాల్లో డీజిల్ విభాగం వాటా 18 శాతానికి వచ్చి చేరిందన్నారు.
Comments
Please login to add a commentAdd a comment