పెట్రోల్, డీజిల్ కార్లపై కీలక నిర్ణయం | Limit registration of petrol, diesel cars: Niti Aayog report | Sakshi
Sakshi News home page

పెట్రోల్, డీజిల్ కార్లపై కీలక నిర్ణయం

Published Fri, May 12 2017 12:21 PM | Last Updated on Fri, Sep 28 2018 3:18 PM

పెట్రోల్, డీజిల్ కార్లపై కీలక నిర్ణయం - Sakshi

పెట్రోల్, డీజిల్ కార్లపై కీలక నిర్ణయం

న్యూఢిల్లీ : ఖర్చుల్లో అత్యధిక భారమైన ఇంధన వ్యయాలను తగ్గించుకోవడానికి ప్రభుత్వం శతవిధాలా ప్రయత్నిస్తోంది. 2030 కల్లా ఇంధన వ్యయాల్లో 60 బిలియన్ డాలర్లను పొదుపు చేసుకోవాలని ప్రభుత్వం మార్గ నిర్దేశం చేసుకుంది. ఈ నేపథ్యంలో నీతి ఆయోగ్ కీలక నిర్ణయం తీసుకున్నట్టు తెలిసింది. ఎలక్ట్రిక్, షేర్డ్ వాహనాల శాతాన్ని మరింత పెంచడానికి, పెట్రోల్, డీజిల్ కార్లపై వేటు వేయనుందని శుక్రవారం విడుదల చేసిన రిపోర్టులో వెల్లడైంది. పెట్రోల్, డీజిల్ కార్లకు పరిమితంగా రిజిస్ట్రేషన్ చేపట్టాలని నీతి ఆయోగ్ రిపోర్టు ప్రతిపాదించింది.
 
పబ్లిక్ లాటరీల ద్వారా ఈ కార్ల రిజిస్ట్రేషన్ ప్రక్రియ పరిమితంగా చేపట్టనున్నట్టు తెలిసింది. ప్రధానమంత్రి నరేంద్రమోదీ నేతృత్వంలోని నీతి ఆయోగ్ ఇండియా ట్రాన్స్ ఫర్మేటివ్ మొబిలిటీ సొల్యుషన్స్ పేరుతో ఈ రిపోర్టును విడుదల చేసింది. అదేవిధంగా ఎలక్ట్రిక్ వాహనాల విక్రయాలను పెంచడానికి సబ్సిడీలను, ప్రోత్సహకాలను అందించాలని చూస్తోంది. న్యూ గ్రీన్ కారు పాలసీ ఇన్ ఇండియా బేసిస్ తో ఈ రిపోర్టు రూపొందించిందని సంబంధిత వర్గాలు చెబుతున్నాయి.   

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement