అత్తతో గొడవలు.. కొత్త కోడలు ఆత్మహత్య | Newly Wed Woman Ends Her Life In Hosur Karnataka | Sakshi
Sakshi News home page

8 నెలల క్రితమే పెళ్లి.. అంతలోనే

Published Thu, Apr 29 2021 8:13 AM | Last Updated on Thu, Apr 29 2021 9:47 AM

Newly Wed Woman Ends Her Life In Hosur Karnataka - Sakshi

ప్రతీకాత్మక చిత్రం

హోసూరు: ఎన్నో ఆశలతో కాపురానికి వచ్చిన కొత్త కోడలు అత్తతో గొడవలను తట్టుకోలేక ఆత్మహత్య చేసుకున్న ఘటన హోసూరు పట్టణ పోలీస్‌స్టేషన్‌ పరిధిలో జరిగింది. హోసూరు– తళి రోడ్డులోని అప్పావు నగర్‌కు చెందిన ముత్తు భార్య దేవయాని (25). 8 నెలల క్రితమే వీరికి పెళ్లి జరిగింది. అత్తా కోడళ్ల మధ్య తరచూ గొడవ జరుగుతుండేది. బుధవారం రాత్రి కూడా రగడ పడడంతో దేవయాని ఉరివేసుకొని ప్రాణాలు తీసుకుంది. హోసూరు డీఎస్పీ మురళి కేసు విచారణ చేపట్టారు.  

తల్లి మందలించడంతో బాలుడు.. 
మత్తిగిరి పోలీస్‌స్టేషన్‌ పరిధిలోని బేళగొండపల్లికి చెందిన ప్రజాపతి కొడుకు రితీష్‌కుమార్‌ (16) 10వ తరగతి చదువుతున్నాడు. బుధవారం మిత్రులతో కలిసి బయటకెళ్లి ఇంటికి ఆలస్యంగా వెళ్లాడు. దీంతో తల్లి నిలదీయడంతో ఇంట్లో నుంచి వెళ్లిపోయి పూనపల్లి సమీపంలోని రోడ్డు పక్కన చెట్టుకు ఉరివేసుకొని ఆత్మహత్య చేసుకొన్నాడు.  

8వ తరగతికే మద్యానికి బానిసై  
8వ తరగతికే మద్యం తాగుతున్న కొడుకును తల్లితండ్రులు మందలించడంతో ప్రాణాలు తీసుకున్నాడు. హోసూరు సున్నపువీధికి చెందిన వాసు కొడుకు కుమార్‌ (13) 8వ తరగతి విద్యార్థి. ఏం జరిగిందో కానీ మద్యపానానికి అలవాటు పడ్డాడు. ఈ అలవాటు మానుకుని బుద్ధిగా చదువుకోవాలని తల్లిదండ్రులు అతనిని మందలించారు. దీంతో ఇంట్లో ఎవరూ లేని సమయంలో ఉరివేసుకొని ఆత్మహత్య చేసుకొన్నాడు. 

No comments yet. Be the first to comment!
Add a comment
Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
 
Advertisement