ఫేస్‌బుక్‌ ప్రియునితో కలిసి కాబోయే భర్తను.. | Woman Attack Man With The Help Of FB Lover In Hosur | Sakshi
Sakshi News home page

ఫేస్‌బుక్‌ ప్రియునితో కలిసి కాబోయే భర్తను..

Published Thu, May 30 2019 7:29 AM | Last Updated on Thu, May 30 2019 7:29 AM

Woman Attack Man With The Help Of FB Lover In Hosur - Sakshi

హొసూరు : కాబోయే భార్యను చూడడానికి వెళ్తే అతన్ని చంపడానికి యత్నించిన కేసులో మిస్టరీ వీడింది. అమ్మాయి జాన్సీరాణి జూస్‌లో మత్తుమందు కలిపి ఇచ్చి ఏకాంత ప్రదేశానికి తీసుకెళ్లి ఆమె ఫేస్‌బుక్‌ ప్రియుడు, అతని అనుచరులతో కలిసి దాడి చేయించినట్లు పోలీసుల విచారణలో తెలిసింది. పోలీసులు కేసు నమోదు చేసుకొని జాన్సీరాణిని అరెస్టు చేసి, ప్రియుడు, అనుచరుల కోసం తిరుచ్చికి బయలుదేరారు. ఊత్తంగేరి సమీపంలోని గొల్లనూరు గ్రామానికి చెందిన చిన్నకణ్ణన్‌ కొడుకు శరవణన్‌ (27) ప్రైవేట్‌ కంపెనీలో ఇంజనీర్‌గా పనిచేస్తున్నాడు. ఇతనికి బంధువులైన చెన్నప్పనాయకనూరు గ్రామానికి చెందిన జాన్సీరాణితో  పెళ్లి నిశ్చయించారు.

గత  ఆదివారం అమ్మాయిని చూసేందుకెళ్లిన శరవణన్‌కు ఆమె జూస్‌లో మత్తుమంది ఇచ్చి ఇచ్చి ఏకాంతంగా మాట్లాడాలని తీసుకెళ్లి ఫేస్‌బుక్‌ ప్రియుడు తిరుచ్చికి చెందిన కార్తీక్‌ (32)తో పాటు అతడి అనుచరులతో కలిసి దాడి చేయించింది. రోడ్డుపక్కన శరవణన్‌ తీవ్ర గాయాలతో రక్తం కారుతూ స్థానికుల కంటబడగా, స్థానికులు ఊత్తంగేరి ప్రభుత్వ ఆస్పత్రికి తరలించారు. అనంతరం సేలం ప్రభుత్వ ఆస్పత్రికి తీసుకెళ్లారు. ఈ సంఘటనపై ఊత్తంగేరి పోలీసులు కేసు నమోదు చేసుకొని విచారణ జరిపి జాన్సీరాణిని అరెస్టు చేశారు.

No comments yet. Be the first to comment!
Add a comment
Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement