సిప్‌కాట్: తండ్రి మందలించాడని యువకుడు ఉరివేసుకొని ఆత్మహత్య చేసుకున్న సంఘటన మంగళవారం సాయంత్రం హోసూరు సమీపంలోని మత్తిగిరి పోలీస్ స్టేషన్ పరిదిలో జరిగింది. మత్తిగిరి పోలీస్ స్టేషన్ సమీపంలోని కళుకొండపల్లి గ్రామానికి చెందిన లింగప్ప కుమారుడు ప్రసాద్(24). ఇంజనీరింగ్ వరకు చదువుకొని ఉద్యోగానికి వెళ్లక ఇంట్లోనే ఉన్నాడు.
మంగళవారం ఏదైన కంపెనీకి వెళ్లి, ఉద్యోగం వెతుక్కోమని తండ్రి లింగప్ప, ప్రసాద్‌కు సూచించాడు. ప్రసాద్ తండ్రి మాటను పట్టించుకోక పోవడంతో లింగప్ప అతనిని మందలించాడు. దీంతో మనస్తాపం చెందిన ప్రసాద్ గదిలో ఉరివేసుకొని ఆత్మహత్య చేసుకున్నాడు. ఈ సంఘటనపై మత్తిగిరి పోలీసులకు సమాచారమందడంతో పోలీసులు సంఘటనా స్థలానికి చేరుకొని శవాన్ని స్వాధీనపరచుకొని హŸసూరు ప్రభుత్వాస్పత్రికి తరలించి కేసు దర్యాప్తు జరుపుతున్నారు.
తండ్రి మందలించాడని యువకుడి ఆత్మహత్య
Published Thu, Oct 20 2016 6:13 AM | Last Updated on Mon, Sep 4 2017 5:48 PM
Advertisement
Advertisement