సినిమాలో పెట్టుబడి.. కుటుంబం మొత్తం మర్డర్‌ కేసులో | Karnataka: Police Arrested 6 Members On Murder Case | Sakshi
Sakshi News home page

సినిమాలో పెట్టుబడి.. కుటుంబం మొత్తం మర్డర్‌ కేసులో

Published Sun, Aug 13 2023 11:16 AM | Last Updated on Sun, Aug 13 2023 12:24 PM

Karnataka: Police Arrested 6 Members On Murder Case - Sakshi

శివాజీనగర: నాలుగు రోజుల క్రితం హాసన్‌ గ్రామీణ పోలీస్‌ స్టేషన్‌ వ్యాప్తిలో గురువారం జేడీఎస్‌ నాయకుడు కృష్ణగౌడ (53)ను దుండగులు మారణాయుధాలతో కిరాతకంగా హత్య చేశారు. ఈ కేసులో పోలీసులు 6 మంది నిందితులను అరెస్ట్‌ చేశారు. ఈయన గ్రానైట్‌, రియాల్టీ వ్యాపారాలు చేయడంతో పాటు జేడీఎస్‌ నేత హెచ్‌డీ రేవణ్ణకు అనుచరుడు కావడంతో సంచలనం కలిగించింది.

వివరాలు.. గతంలో యోగానంద అనేవ్యక్తి కృష్ణేగౌడతో పరిచయమై వాహిని సినిమాకు పెట్టుబడి పెట్టారు. ఇందులో తనను మోసగించారని యోగానందతో కృష్ణగౌడ గొడవపడ్డాడు, ఆపై 2022 నవంబర్‌లో యోగానందను కొందరు కిడ్నాప్‌ చేసి దాడి చేయడంతో అతడు హాసన్‌ గ్రామీణ పోలీస్‌ స్టేషన్‌లో కేసు పెట్టాడు. మరోవైపు యోగానందపై కృష్ణగౌడ చీటింగ్‌ కేసు పెట్టారు. ఇలా ఇద్దరి మధ్య వైషమ్యాలు పెరిగాయి. అప్పటినుంచి కృష్ణగౌడను అంతమొందించాలని కుట్ర మొదలైంది.

కారులో వెళ్తుండగా నరికి చంపి
ఈ నెల 9న మధ్యాహ్నం కృష్ణగౌడ నగర శివార్లలో కారులో వెళ్తుండగా, కారులో వచ్చిన దుండగులు అడ్డుకుని నరికి చంపి పరారయ్యారు. పోలీసులు అన్ని కోణాల్లో దర్యాప్తు జరిపి యోగానంద కుటుంబీకుల పాత్ర ఉందని గుర్తించారు. యోగానంద, అతని భార్య సుధారాణి, అతని స్నేహితురాలు, మామ కృష్ణకుమార్‌, బంధువు విజయ్‌–చైత్ర దంపతులు, అలాగే స్థానిక టీవీ చానెల్‌ భాగస్వామి సురేశ్‌ అనేవారిని హాసన్‌ పోలీసులు అరెస్ట్‌ చేశారు.

No comments yet. Be the first to comment!
Add a comment
Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
 
Advertisement