over turned
-
హర్యానాలో బస్సు బోల్తా.. నలభై మంది పిల్లలకు గాయాలు
చండీగఢ్: హర్యానాలోని పంచకుల జిల్లా పింజోర్‌లో ఆర్టీసీ బస్సు బోల్తా పడింది. ఈ ఘటనలో 40 మంది స్కూలు పిల్లలు, ఇతరులకు గాయాలయ్యాయి. గాయపడ్డవారిని పంచకులలోని ఆస్పత్రికి తరలించి చికిత్సఅందిస్తున్నారు. తీవ్రంగా గాయపడ్డ ఓ మహిళను మాత్రం చండీగఢ్‌లోని పీజీఐ ఆస్పత్రికి తరలించారు. డ్రైవర్ అతివేగంగా బస్సు నడపడం వల్లే ప్రమాదం జరిగినట్లు తెలుస్తోంది. ప్రమాదస్థలికి వెంటనే చేరుకున్న పోలీసులు కేసు నమోదు చేశారు. రోడ్డు సరిగా లేకపోవడం కూడా ప్రమాదానికి కారణమని పోలీసులు ప్రాథమికంగా భావిస్తున్నారు. -
మృత్యు మలుపు
స్పందించని హైవే సిబ్బంది.. హైవేపై ప్రమాదాలు జరిగిన వెంటనే స్పందించాల్సిన హైవే సిబ్బంది నిర్లక్ష్యం వహిస్తున్నారనే విమర్శలు వ్యక్తమవుతున్నాయి. బుధవారం ఘటనలో కూడా మరోసారి వారి నిర్లక్ష్యం కనిపించింది. సంఘటన స్థలానికి చేరుకుని ఎంతకూ హైవే సిబ్బంది రాకపోవడంతో పోలీసులే రోడ్డుకు ఇరువైపులా కోన్లు ఏర్పాటు చేయాల్సి వచ్చింది. రోడ్డు డివైడర్‌పై పడిన బస్సును తొలగించడానికి హైవేకు చెందిన క్రేన్స్ కూడా సకాలంలో రాలేదు. దీంతో ప్రైవేట్ క్రేన్ ద్వారా పోలీసులు తొలగిస్తుండగా ఉదయం 8 గంటల ప్రాంతంలో హైవేకు చెందిన క్రేన్ అక్కడకు చేరుకుంది. ప్యాపిలి: పట్టణ సమీపంలోని స్థానిక చిరుతలగుట్ట మలుపు వద్ద బుధవారం ప్రైవేట్ ట్రావెల్స్ బస్సు అదుపు తప్పి బోల్తా పడటంతో ఒకరు మృతిచెందగా మరో పదిమంది గాయాలపాలయ్యారు. బాధితులు తెలిపిన వివరాలు.. ఏఆర్ 01టీ 5445 నంబర్ గోటూర్ ట్రావెల్స్ బస్సు గత రాత్రి 30 మంది ప్రయాణికులతో హైదరాబాద్ నుంచి బెంగళూరుకు బయలుదేరింది. తెల్లవారుజామున 4 గంటల ప్రాంతంలో స్థానిక చిరుతలగుట్ట మలుపు వద్ద అదుపు తప్పింది. డ్రైవర్ తమిళ్ అర్సన్ చాకచక్యంగా వ్యవహరించి బస్సును కుడివైపునకు మరల్చడంతో రోడ్డుకు మధ్యలో ఉన్న డివైడర్‌పై బోల్తా పడింది. ప్రమాదంలో డ్రైవర్ తమిళ్ అర్సన్, పసుపులేటి ఆదిత్య (27), శ్రీనివాసరెడ్డి, క్రిష్ణ, సత్యవతి, శృతి చౌదరి, మురళీక్రిష్ణ, చంద్రశేఖర్‌రెడ్డి, నరేశ్‌రెడ్డి, భాస్కర్‌తో పాటు మరొకరు గాయపడ్డారు. సీఐ రామక్రిష్ణ సంఘటనా స్థలానికి చేరుకుని క్షతగాత్రులను గుత్తి, కర్నూలు ప్రభుత్వాసుపత్రులకు తరలించారు. మృతుడు హైదరాబాద్ వాసి.. తీవ్రంగా గాయపడిన పసుపులేటి ఆదిత్యను కర్నూలు ప్రభుత్వాసుపత్రికి తరలిస్తుండగా మార్గమధ్యంలోనే మృతి చెందాడు. ఇతడు హైదరాబాదులోని కొండాపూర్‌కు చెందినవాడిగా పోలీసులు గుర్తించారు. బెంగుళూరులో బయో డిజైన్ ఇన్నోవేషన్ ల్యాబ్‌లో పని చేస్తున్నట్లు సమాచారం. కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేస్తున్నట్లు పోలీసులు తెలిపారు. సంఘటనా స్థలాన్ని పరిశీలించిన ఎస్పీ ప్రైవేట్ ట్రావెల్స్ బస్సు బోల్తా పడిన విషయం తెలుసుకున్న ఎస్పీ గోపీనాథ్‌జట్టి సంఘటనా స్థలాన్ని పరిశీలించారు. ప్రమాదం జరిగిన తీరును అడిగి తెలుసుకున్నారు. ఆయన వెంట డోన్ డీఎస్పీ బాబా ఫకృద్దీన్ ఉన్నారు. -
ట్రాక్టర్ బోల్తా .. ఇద్దరికి గాయాలు
ఒంగోలు : వేగంగా వెళ్తున్న ట్రాక్టర్ అదుపుతప్పి వాగులో పడింది. ఈ ఘటనలో ఇద్దరు తీవ్రంగా గాయపడ్డారు. ఈ సంఘటన ప్రకాశం జిల్లా ముండ్లమూరు మండలం పులిపాడు వద్ద బుధవారం చోటు చేసుకుంది. ముండ్లమూరు గ్రామానికి చెందిన రైతు లింగం వెంకటేశ్వరరెడ్డి వ్యవసాయ పనుల నిమిత్తం కుటుంబసభ్యులతో కలసి ట్రాక్టర్‌పై బావి వద్దకు వెళ్తుండగా.. గ్రామ శివారులోని వాగు వద్దకు చేరుకోగానే ట్రాక్టర్ అదుపుతప్పి వాగులో పడింది. స్థానికులు వెంటనే స్పందించి క్షతగాత్రులను సమీపంలోని ఆస్పత్రికి తరలించారు. కాగా.. వాగుపై కల్వర్టు లేకపోవడంతోనే ఈ ప్రమాదం జరిగిందని.. స్థానికులు ఆరోపిస్తున్నారు. -
ఓవర్ టేక్ చేయబోయి..
కేశినేని ట్రావెల్స్ బస్సు బోల్తా.. 23 మందికి గాయాలు ఇటిక్యాల: బెంగళూరు నుంచి హైదరాబాద్‌కు వస్తున్న కేశినేని ట్రావెల్స్‌కు చెందిన బస్సు శుక్రవారం తెల్లవారుజామున మహబూబ్‌నగర్ జిల్లా ఇటిక్యాల మండలం కొండేరు వద్ద జాతీయ రహదారిపై బోల్తా పడింది. దీంతో 23 మంది ప్రయాణికులకు గాయాలయ్యాయి. బస్సు డ్రైవర్ కాశీ లింగం, ప్రయాణికుడు చేతన్ పరిస్థితి విషమంగా ఉంది. బాధితులు తెలిపిన వివరాల ప్రకారం.. కేశినేని ట్రావెల్స్‌కు చెందిన బస్సు బెంగళూరు నుంచి హైదరాబాద్‌కు బయలుదేరింది. తెల్లవారుజామున 5.10 నిమిషాలకు ఇటిక్యాల మండలం కొండేరు గ్రామం వద్దకు చేరుకుంది. బస్సు డ్రైవర్ ముందున్న వాహనాన్ని ఓవర్టేక్ చేయబోతుండగా రోడ్డు డివైడర్‌ను ఢీకొట్టింది. అతి వేగంగా ఉండడంతో బస్సు డివైడర్‌ను తాకుకుంటూ కొంతదూరం వెళ్లి మూడు పల్టీలు కొట్టి బోల్తా పడింది. ఆ సమయంలో ప్రయాణికులంతా గాఢ నిద్రలో ఉండడంతో ఏం జరిగిందో తెలియలేదు. వారు తేరుకునేలోపే బస్సు తలకిందులుగా పడిపోయి ఉంది. కొంతమంది ప్రయాణికులు బస్సు అద్దాలు పగులగొట్టి బయటకు వచ్చారు. గద్వాల డీఎస్పీ బాలకోటి ఆధ్వర్యంలో కోదండాపురం ఎస్ఐ మహేశ్వర్‌రావు, ఇటిక్యాల ఏఎస్ఐ ఆనంద్‌లు ప్రమాద స్థలానికి వెళ్లి సహాయక చర్యలు చేపట్టారు. క్షతగాత్రులను కర్నూలులోని ప్రభుత్వ ఆస్పత్రికి తరలించారు. -
కేశినేని బస్సు బోల్తా.20 మందికి గాయాలు.