మహబూబ్ నగర్ జిల్లాలో రోడ్డు ప్రమాదం చోటుచేసుకుంది. ఇటిక్యాల మండలం కొల్లేరు స్టేజీ వద్ద కేశినేని ట్రావెల్స్ బస్సు(KO01AA3594) బోల్తా పడింది. దీంతో 20 మందికి గాయాలయ్యాయి. ఆరుగురి పరిస్థితి విషమంగా ఉంది. గాయపడినవారిని సమీప ఆస్పత్రికి, కర్నూలుకు తరలించారు. బస్సు వేగంలో ఉండి ఎదురుగా ఉన్న వాహనాన్ని క్రాస్ చేసే సమయంలో డివైడర్ ను ఢీకొట్టి అదుపుతప్పి బోల్తా పడినట్లు ఓ ప్రత్యక్ష సాక్షి వెల్లడించారు. కాగా, ఒక రాయిని ఎక్కడం వల్ల బస్సు బోల్తా పడిందని కొందరు చెప్తున్నారు. బెంగళూరు నుంచి హైదరాబాద్ వస్తుండగా ఈ ఘటన చోటుచేసుకుంది. గాయపడిన వారిలో చంద్రశేఖర్, మంజునాథ్, నాగస్వామి, రమాకాంతరెడ్డి, విశాల్‌రాజ్, రామన్న, భరత్‌కుమార్, విష్ణుమూర్తి, ప్రత్యూష, కిరణ్ తదితరులు ఉన్నారు. ట్రావెల్స్ యాజమాన్యం ఇప్పటి వరకు స్పందించకపోవడం గమనార్హం.