kesineni travels
-
మాకు జీతాలు ఇవ్వకుండా వేధిస్తారా?
-
మా కష్టాన్ని దోచుకోవద్దు
ఎంపీ కేశినేని ట్రావెల్స్ కార్యాలయం వద్ద 500 మంది కార్మికుల ధర్నా సాక్షి, అమరావతి బ్యూరో: ‘మీరు టీడీపీ ఎంపీ... రాష్ట్రంలో మీ ప్రభుత్వం అధికారంలో ఉంది. అంత మాత్రాన అంతా మీ ఇష్టమా? పేదల కష్టాన్ని దోచుకుంటారా? మాకు జీతాలు ఇవ్వకుండా వేధి స్తారా? చెప్పాపెట్టకుండా ట్రావెల్స్‌ను మూసివేసి మా జీతాలు చెల్లించకుండా ముఖం చాటేశారు. బ్యాంకులను మోసం చేసేందుకే ఇలా చేశారు. ఏడాదిగా జీతాల్లేక అప్పులపాలయ్యాం. ఇంకా మాకు అన్యాయం చేయొద్దు’ అంటూ కేశినేని ట్రావె ల్స్ కార్మికులు ఆవేదన వ్యక్తం చేశారు. కేశినేని ట్రావెల్స్ డ్రైవర్లు, సిబ్బంది ప్రత్యక్ష పోరాటా నికి దిగారు. బకాయిలతోసహా జీతాలు చెల్లించాలని డిమాండ్ చేస్తూ సోమవారం విజయవాడలోని ఎంపీ కేశినేని నాని కార్యాలయాన్ని ముట్టడించారు. ఏపీ, తెలంగాణల్లోని వివిధ ప్రాంతాల నుంచి దాదాపు 500 మంది కార్మికులు విజయవాడలోని ఎంపీ కేశినేని కార్యాలయం వద్దకు తరలివచ్చారు. జీతాలు అందక తమ బాధలను చెప్పుకునేందుకు వచ్చిన కార్మికులను ఎంపీ కేశినేని కార్యాలయంలోకి అనుమతించ లేదు. ఆ సమయంలో కేశినేని నాని తన కార్యాలయంలో లేరు. ఆయన ప్రతినిధులు అప్పటికే పోలీసులను పిలిపించారు. డ్రైవర్లు, సిబ్బందిని ఎంపీ కార్యాలయానికి వెళ్లనీయకుండా పోలీసులు బారికేడ్లు ఏర్పాటు చేసి అడ్డుకున్నారు. -
కేశినేని ట్రావెల్స్ సిబ్బంది ధర్నా
-
కేశినేని ట్రావెల్స్ సిబ్బంది ధర్నా
-
తెలుగు రాష్ట్రాలలో కేశినేని ట్రావెల్స్ తిప్పను
-
తెలుగు రాష్ట్రాలలో కేశినేని ట్రావెల్స్ తిప్పను
విజయవాడ: రెండేళ్లుగా కేశినేని ట్రావెల్స్ నష్టాల్లో ఉందని, మరో పదేళ్లు నష్టాలు వచ్చినా నడపగలిగే శక్తి తనకు ఉందని ట్రావెల్స్ యజమాని, విజయవాడ టీడీపీ ఎంపీ కేశినేని నాని చెప్పారు. వ్యవస్థను మార్చలేకే తన ట్రావెల్స్ వ్యాపారాన్ని మానుకున్నానని తెలిపారు. తెలుగు రాష్ట్రాలు ఆంధ్రప్రదేశ్, తెలంగాణలలో తన ట్రావెల్స్ బస్సులను తిప్పనని నాని చెప్పారు. ఇతర రాష్ట్రాలలో ట్రావెల్స్ నడపాలంటూ ఆహ్వానాలు వస్తున్నాయని తెలిపారు. పదవిని అడ్డుపెట్టుకుని తాను ఏనాడూ సంపాదనకు ప్రయత్నించలేదని నాని అన్నారు. ఇటీవల రవాణ శాఖ కార్యాలయం వద్ద కమీషనర్ బాలసుబ్రహ్మణ్యం పట్ల నాని, టీడీపీ ఎమ్మెల్యే బోండా ఉమా మహేశ్వర రావు దౌర్జన్యంగా ప్రవర్తించిన సంగతి తెలిసిందే. ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు ఈ విషయంలో జోక్యం చేసుకుని నానితో క్షమాపణలు చెప్పించారు. ఆ తర్వాత కేశినేని ట్రావెల్స్‌ను మూసివేయాలని నాని నిర్ణయించారు. -
ఆర్టీసీలో ‘కేశినేని’ పాగా!?
-
ఆర్టీసీలో ‘కేశినేని’ పాగా!?
అమరావతి: మూలిగే నక్క మీద తాటి కాయ పడడమంటే ఇదేనేమో. అసలే నష్టాలతో కునారిల్లుతున్న ఆర్టీసీపై కేశినేని ట్రావెల్స్ అదనపు భారాన్ని మోపాలని ప్రభుత్వం భావిస్తోంది. విజయవాడ ఎంపీ కేశినేని శ్రీనివాస్(నాని)కు చెందిన కేశినేని ట్రావెల్స్‌ను ఇటీవల వివాదాస్పద రీతిలో మూసివేసిన విషయం విదితమే. ఈ నేపథ్యంలో ఆయన అద్దె బస్సుల రూపంలో ఆర్టీసీలో పాగా వేసేందుకు వ్యూహరచన చేస్తున్నారు. నాని బ్లాక్ మెయిల్ రాజకీయాల ఒత్తిడికి తలొగ్గిన సీఎం చంద్రబాబు ఇందుకు సానుకూలంగా స్పందించినట్లు సమాచారం. దీనిపై ఆర్టీసీ కార్మిక సంఘాలు తీవ్ర ఆందోళన వ్యక్తం చేస్తున్నాయి. ప్రస్తుతం కేశినేని ట్రావెల్స్ వద్ద దాదాపు 170 బస్సులు ఉన్నాయి. కండిషన్లో ఉన్న ఏసీ బస్సులు సుమారు 100 వరకు ఆర్టీసీకి అద్దె ప్రాతిపదికన ఇవ్వాలని ఆయన ప్రతిపాదించినట్లు సమాచారం. అందుకు ఆయన వ్యూహాత్మకంగా ఆరు నెలల కిందట నుంచే పావులు కదుపుతున్నారు. వాస్తవానికి ఆర్టీసీ కొత్తగా అద్దె బస్సులను భరించే స్థితిలో లేదు. ఇప్పటికే రాష్ట్రంలో ఆర్టీసీకి 11,865 బస్సులు ఉన్నాయి. అందులో ఏసీ బస్సులు 2,700, స్లీపర్ 5, డీలక్స్ 613, సూపర్ లగ్జరీ 752, ఎక్స్‌ప్రెస్‌లు 2,117, మిగిలినవి 5,678 మామూలు బస్సులు. ఏసీ బస్సులు ప్రధానంగా విజయవాడ, బెంగళూరు, హైదరాబాద్, విశాఖపట్నం రూట్లలో నడుపుతున్నారు. వాస్తవానికి ఆరు నెలల క్రితం వరకు ఆర్టీసీలో ఏసీ అద్దె బస్సులు లేవు. తొలిసారిగా 21 ఇంద్ర ఏసీ బస్సులను ఆరు నెలల కిందటే అద్దెకు తీసుకున్నారు. కేవలం కేశినేని ట్రావెల్స్ బస్సులకు మార్గం సుగమం చేసేందుకే ఈ నిర్ణయం తీసుకున్నారని విశ్వసనీయవర్గాలు ‘సాక్షి’కి తెలిపాయి. తద్వారా ఓసారి ఏసీ బస్సులను అద్దెకు తీసుకునే విధానానికి ఆమోద ముద్ర వేశారు. అదే అంశాన్ని ప్రాతిపదికగా తీసుకుని ప్రస్తుతం కేశినేని ట్రావెల్స్‌కు చెందిన 100 ఏసీ బస్సులను ఆర్టీసీకి కట్టబెట్టాలని పావులు కదుపుతున్నారు. త్వరలో టెండర్లు.. కేశినేని ట్రావెల్స్‌కు మార్గం సుగమం చేసేందుకు ఆర్టీసీ పెద్దలు ఇప్పటికే కార్యాచరణకు దిగారు. వేసవి సీజన్ కావడంతో ఆర్టీసీకి బస్సుల కొరత తీవ్రంగా ఉందనే ప్రచారాన్ని వ్యూహాత్మకంగా తెరపైకి తెచ్చారు. ప్రైవేట్ ట్రావెల్స్ బస్సులను ఆర్టీసీ అద్దెకు తీసుకుంటే తప్ప సమస్య పరిష్కారం కాదనే వాదనను టీడీపీ అనుకూల కార్మిక సంఘాల నేతలు బలంగా వినిపిస్తున్నారు. అద్దె బస్సులు తీసుకునేందుకు త్వరలో టెండర్లను ఆహ్వానించేలా ఎంపీ కేశినేని నాని పావులు కదుపుతున్నారు. ఇందుకు సీఎం కార్యాలయ ఉన్నతాధికారుల ద్వారా ఆర్టీసీ యాజమాన్యంపై ఒత్తిడి తెస్తున్నారు. ఇటీవల రవాణా శాఖ కమిషనర్ బాలసుబ్రహ్మణ్యంపై దాడి.. ఆ తర్వాతి పరిణామాలను నాని తనకు అనుకూలంగా మలచుకుంటున్నారు. నష్టాల్లో ఉన్న తమ సంస్థను ఆర్టీసీ ద్వారా ఆదుకుంటానని సీఎం చంద్రబాబు వద్ద హామీ తీసుకున్న అనంతరమే ఆయన క్షమాపణలు చెప్పినట్లు తెలుస్తోంది. ఇందులో భాగంగానే త్వరలో కేశినేని ట్రావెల్స్ బస్సులు ఆర్టీసీ షెడ్డులోకి చేరతాయని అధికారులే వ్యాఖ్యానిస్తుండడం గమనార్హం. ఆందోళనకు కార్మిక సంఘాలు సన్నద్ధం ఆర్టీసీని నిర్వీర్యం చేసేందుకు ప్రభుత్వం వేస్తున్న ఎత్తుగడల పట్ల కార్మిక సంఘాలు తీవ్ర ఆందోళన చెందుతున్నాయి. అద్దె బస్సుల భారంతో ఆర్టీసీ మరింతగా నష్టాల్లో కూరుకుపోతుందని కార్మికులు చెబుతున్నారు. అది చివరగా ఆర్టీసీ ప్రైవేటీకరణకు దారితీసే ప్రమాదం ఉందని కలవరపడుతున్నారు. కేశినేని ట్రావెల్స్ బస్సులను అద్దె ప్రాతిపదికన తీసుకునే నిర్ణయాన్ని గట్టిగా వ్యతిరేకించాలని నిర్ణయించారు. దీనిపై త్వరలోనే కార్మిక సంఘాలు సమావేశమై కార్యాచరణను నిర్ణయిస్తాయని ఓ కార్మిక సంఘం నేత ‘సాక్షి’కి తెలిపారు. -
ఏడాదిగా జీతాలివ్వని కేశినేని..!
-
‘అందుకే కేశినేని ట్రావెల్స్ మూసివేశారు’
తిరుపతి : టీడీపీ ఎంపీ కేశినేని నానికి చెందిన కేశినేని ట్రావెల్స్ మూసివేత వెనుక పెద్ద మతలబే జరిగిందని వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ఎమ్మెల్యే చెవిరెడ్డి భాస్కర్‌రెడ్డి వ్యాఖ్యానించారు. ఆయన సోమవారమిక్కడ మాట్లాడుతూ బ్యాంకుల వద్ద నుంచి వందలకోట్ల అప్పు చేసిన టీడీపీ ఎంపీ కేశినేని నాని ఆ నిధులను ఇతర అవసరాలకు మళ్లించారని అన్నారు. బ్యాంకులకు అప్పులు చెల్లించకుండా ఎగనామం పెట్టారని, కేశినేని నాని మరో విజయ్ మాల్యా అవతారం ఎత్తారని చెవిరెడ్డి విమర్శించారు. ఏపీ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు సూచనల మేరకే ఆయన ట్రావెల్స్‌ను మూసివేస్తున్నట్లు ప్రకటించారన్నారు. బస్సుల పేరుతో బ్యాంకుల నుంచి తీసుకున్న డబ్బులతో విజయవాడలో స్టార్ హోటల్ కడుతున్నారని, కేశినేని బస్సులను ఆర్టీసీ స్వాధీనం చేసుకోవాలని ఆయన డిమాండ్ చేశారు. కాగా శుక్రవారం అర్ధరాత్రి నుంచి దేశ వ్యాప్తంగా కేశినేని ట్రావెల్స్ బస్ సర్వీసులను ఆపివేశారు. ఇటీవల రవాణ శాఖ కార్యాలయం వద్ద కమీషనర్ బాలసుబ్రహ్మణ్యం పట్ల నాని, టీడీపీ ఎమ్మెల్యే బోండా ఉమా మహేశ్వరరావు దౌర్జన్యంగా ప్రవర్తించిన సంగతి తెలిసిందే.ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు ఈ విషయంలో జోక్యం చేసుకుని నానితో క్షమాపణలు చెప్పించారు. చంద్రబాబు తనతో బలవంతంగా క్షమాపణలు చెప్పించడంతో అసంతృప్తిగా ఉన్న నాని అలకబూనారు. కాగా ఎన్నికలకు ముందు టీడీపీ అధినేత చంద్రబాబు నాయుడు పాదయాత్ర సందర్భంగా కేశినేని నాని నిధులు సమకూర్చారు. అంతేకాకుండా టీడీపీ తరఫున ఎంపీకా ఎన్నిక కావడానికి పెద్ద ఎత్తున ఖర్చు పెట్టారు. ఈ నేపథ్యంలో నిర్వహణ భారంతో పాటు పోటీ పెరగడంతో నష్టాలు పెరిగాయి. దీంతో సుమారు 80 ఏళ్లుగా నిర్వహిస్తున్న కేశినేని ట్రావెల్స్‌ను మూసివేయాలని నిర్ణయించారు. 170 కేశినేని ట్రావెల్స్ బస్సులను ఇతర ట్రావెల్స్ కు అమ్మేశారు. మరోవైపు కేశినేని నాని కార్గో వ్యాపారం వైపు దృష్టి సారించినట్లు తెలుస్తోంది. -
కేశినేని నిర్ణయం అభినందనీయం: ఆర్టీసీ ఈయూ
అమరావతి: కేశినేని ట్రావెల్స్‌ను నిలుపుదల చేస్తూ ఆ సంస్థ యాజమాన్యం తీసుకున్న నిర్ణయాన్ని ఆర్టీసీ ఈయూ అభినందించింది. రాష్ట్రంలో ఇంకా మిగిలి ఉన్న ట్రావెల్స్ యాజమాన్యాలు కూడా ఇదే మాదిరి నిర్ణయాన్ని ప్రకటించాలని కోరింది. అలా కాని పక్షంలో ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వమే చొరవ తీసుకొని అక్రమంగా నడుపుతున్న ప్రైవేట్ ట్రావెల్స్ ఆటకట్టించే చర్యలు తీసుకోవాలని డిమాండ్ చేసింది. మూతబడిన కేశినేని ట్రావెల్స్ బస్సులను ఆర్టీసీకి ఇచ్చేలా ప్రభుత్వం సహకరించాలని యూనియన్ నేతలు కె. పద్మాకర్, పలిశెట్టి దామోదరరావు తదితరులు కోరారు. -
కేశినేని ట్రావెల్స్ మూసివేత
విజయవాడ: టీడీపీ ఎంపీ కేశినేని నానికి చెందిన కేశినేని ట్రావెల్స్‌ను మూసివేశారు. గత వారం నుంచి అడ్వాన్స్డ్ రిజర్వేషన్లను నిలిపివేయగా, శుక్రవారం అర్ధరాత్రి నుంచి దేశ వ్యాప్తంగా బస్ సర్వీసులను ఆపివేశారు. సిబ్బందికి జీతాలు ఇవ్వకపోవడంతో పలుచోట్ల ఆందోళనకు దిగారు. ఇటీవల రవాణ శాఖ కార్యాలయం వద్ద కమీషనర్ బాలసుబ్రహ్మణ్యం పట్ల నాని, టీడీపీ ఎమ్మెల్యే బోండా ఉమా మహేశ్వర రావు దౌర్జన్యంగా ప్రవర్తించిన సంగతి తెలిసిందే. ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు ఈ విషయంలో జోక్యం చేసుకుని నానితో క్షమాపణలు చెప్పించారు. చంద్రబాబు తనతో బలవంతంగా క్షమాపణలు చెప్పించడంతో అసంతృప్తిగా ఉన్న నాని అలకబూనారు. కేశినేని ట్రావెల్స్‌ను మూసివేయాలని నిర్ణయించిన నాని.. కార్గో వ్యాపారం వైపు దృష్టిసారించారు. -
కేశినేని ట్రావెల్స్ మూసివేత
-
కేశినేని నానికి సీఎం ఫోన్, ప్రెస్ మీట్ రద్దు
-
కేశినేని నానికి సీఎం ఫోన్, ప్రెస్ మీట్ రద్దు
విజయవాడ: బెజవాడలో కేశినేని ట్రావెల్స్ వద్ద శుక్రవారం హైడ్రామా నడిచింది. టీడీపీ ఎంపీ కేశినేని నాని మీడియా సమావేశాన్ని అర్థాంతరంగా రద్దు చేసుకున్నారు. మీడియా సమావేశానికి విలేకరులను పిలిచిన ఆయనకు ప్రెస్‌మీట్ ప్రారంభానికి ముందే ముఖ్యమంత్రి చంద్రబాబు నుంచి ఫోన్ కాల్ వచ్చింది. దీంతో కేశినేని నాని ప్రెస్ మీట్‌ను రద్దు చేసుకుని సీఎం నివాసానికి వెళ్లారు. కాగా ఆర్టీఏ కార్యాలయంలో జరిగిన వ్యవహారంపై కేశినేని నాని కొంత అసంతృప్తిగా ఉన్నారు. దీంతో కేశినేని ట్రావెల్స్‌ను మూసివేసేందుకు నాని సిద్ధపడ్డారని ప్రచారం జరుగుతున్న విషయం తెలిసిందే. అదే విషయాన్ని మీడియాకు చెబుతారని ఊహాగానాలు వినిపించాయి. అయితే దీనిపై కేశినేని నాని ఏమీ చెప్పకుండానే వెళ్లిపోయారు. సీఎం దగ్గరకు వెళ్లినప్పటికీ తన నిర్ణయంలో ఎలాంటి మార్పు ఉండదని ఆయన చెప్పినట్లు సమాచారం. ఇందుకు సంబంధించి పూర్తి వివరాలు తెలియాల్సి ఉంది. -
కేశినేని ట్రావెల్స్ నిర్లక్ష్యం...
-
కేశినేని ట్రావెల్స్ నిర్లక్ష్యం...
నల్లగొండ: కేశినేని ట్రావెల్స్ యాజమాన్య నిర్లక్ష్యంతో ప్రయాణికులు తీవ్ర ఇబ్బందులు పడుతున్నారు. హైదరాబాద్ నుంచి నెల్లూరుకు వెళ్తున్న బస్సు ఆదివారం అర్థరాత్రి నల్లగొండ జిల్లా మాడ్గులపల్లి టోల్‌ప్లాజా వద్ద సాంకేతిక లోపంతో నిలిచిపోయింది. దీంతో అర్థరాత్రి నుంచి ప్రయాణికులు నడిరోడ్డుపై పడిగాపులు కాస్తున్నారు. బస్సులో మహిళలు, వృద్ధులు, చిన్నపిల్లలు, షుగర్ వ్యాధిగ్రస్థులతో పాటు మొత్తం 29 మంది ప్రయాణికులు ఉన్నారు. ప్రయాణికులను నెల్లూరు చేర్చేందుకు ప్రత్యామ్నాయ బస్సు ఏర్పాటుచేయకపోవడంతో కేశినేని ట్రావెల్స్ యాజమాన్యంపై వారు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. -
ఆటోను ఢీకొట్టిన బస్సు: ముగ్గురి మృతి
నల్లగొండ : వేగంగా వెళ్తున్న బస్సు ముందు వెళ్తున్న ఆటోను ఢీకొట్టింది. ఈ ఘటనలో ఆటోలో ప్రయాణిస్తున్న ముగ్గురు మహిళలు మృతి చెందారు. మరో నలుగురు తీవ్ర గాయాపడ్డారు. ఈ సంఘటన నల్లగొండ జిల్లా చివ్వెంల మండలం గుంజలూరు సమీపంలో మంగళవారం తెల్లవారుజామున చోటు చేసుకుంది. పెన్‌పహాడ్ మండలం చీదెల గ్రామస్థులు సూర్యాపేటలో జరుగుతున్న సువార్త మహాసభలకు హాజరయ్యారు. ఆ మహాసభలు ముగించుకుని... తిరిగి ఆటోలో స్వగ్రామానికి ప్రయాణమయ్యారు. ఆ క్రమంలో హైదరాబాద్ నుంచి విజయవాడ వైపు వెళ్తున్న కేశినేని ట్రావెల్స్‌కు చెందిన బస్సు... ఆ ఆటోను ఢీకొట్టింది. అదే రహదారిపై వెళ్తున్న వాహనదారులు వెంటనే స్పందించి.. పోలీసులకు సమాచారం అందించారు. పోలీసులు ఘటన స్థలానికి చేరుకుని... క్షతగాత్రులను సూర్యాపేట ఏరియా ఆసుపత్రికి తరలించారు. అలాగే మృతదేహాలను పోలీసులు స్వాధీనం చేసుకున్నారు. పోస్ట్ మార్టం నిమిత్తం మృతదేహాలను నల్గొండ ప్రభుత్వాసుపత్రికి తరలించారు. ఈ ప్రమాదంపై పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు. -
ఓవర్ టేక్ చేయబోయి..
కేశినేని ట్రావెల్స్ బస్సు బోల్తా.. 23 మందికి గాయాలు ఇటిక్యాల: బెంగళూరు నుంచి హైదరాబాద్‌కు వస్తున్న కేశినేని ట్రావెల్స్‌కు చెందిన బస్సు శుక్రవారం తెల్లవారుజామున మహబూబ్‌నగర్ జిల్లా ఇటిక్యాల మండలం కొండేరు వద్ద జాతీయ రహదారిపై బోల్తా పడింది. దీంతో 23 మంది ప్రయాణికులకు గాయాలయ్యాయి. బస్సు డ్రైవర్ కాశీ లింగం, ప్రయాణికుడు చేతన్ పరిస్థితి విషమంగా ఉంది. బాధితులు తెలిపిన వివరాల ప్రకారం.. కేశినేని ట్రావెల్స్‌కు చెందిన బస్సు బెంగళూరు నుంచి హైదరాబాద్‌కు బయలుదేరింది. తెల్లవారుజామున 5.10 నిమిషాలకు ఇటిక్యాల మండలం కొండేరు గ్రామం వద్దకు చేరుకుంది. బస్సు డ్రైవర్ ముందున్న వాహనాన్ని ఓవర్టేక్ చేయబోతుండగా రోడ్డు డివైడర్‌ను ఢీకొట్టింది. అతి వేగంగా ఉండడంతో బస్సు డివైడర్‌ను తాకుకుంటూ కొంతదూరం వెళ్లి మూడు పల్టీలు కొట్టి బోల్తా పడింది. ఆ సమయంలో ప్రయాణికులంతా గాఢ నిద్రలో ఉండడంతో ఏం జరిగిందో తెలియలేదు. వారు తేరుకునేలోపే బస్సు తలకిందులుగా పడిపోయి ఉంది. కొంతమంది ప్రయాణికులు బస్సు అద్దాలు పగులగొట్టి బయటకు వచ్చారు. గద్వాల డీఎస్పీ బాలకోటి ఆధ్వర్యంలో కోదండాపురం ఎస్ఐ మహేశ్వర్‌రావు, ఇటిక్యాల ఏఎస్ఐ ఆనంద్‌లు ప్రమాద స్థలానికి వెళ్లి సహాయక చర్యలు చేపట్టారు. క్షతగాత్రులను కర్నూలులోని ప్రభుత్వ ఆస్పత్రికి తరలించారు. -
కేశినేని బస్సు బోల్తా.20 మందికి గాయాలు.
-
కేశినేని బస్సు బోల్తా: 15 మందికి గాయాలు
-
కేశినేని బస్సు బోల్తా: 15 మందికి గాయాలు
నల్లగొండ: కేశినేని ట్రావెల్స్ బస్సు శనివారం తెల్లవారుజామున బోల్తా పడింది. ఈ ప్రమాదంలో 15 మంది ప్రయాణికులు గాయపడ్డారు. ఈ సంఘటన నల్లగొండ జిల్లా చివ్వెంల మండలం గుంపుల తిరుమలగిరి వద్ద జరిగింది. హైదరాబాద్ నుంచి విజయవాడ వెళ్తున్న బస్సు అదే దారిలో వెళ్తున్న లారీని ఓవర్ టేక్ చేయబోతూ ప్రమాదానికి గురైంది. డ్రైవర్ నిర్లక్ష్యమే కారణం అని ప్రయాణికులు ఆరోపిస్తున్నారు. క్షతగాత్రులను హుటాహుటిన సూర్యాపేట ప్రభుత్వాసుపత్రికి తరలించారు. -
'కేశినేని' బస్సు బోల్తా:20 మందికి తీవ్రగాయాలు
గుత్తి/గుత్తి రూరల్ : ఓల్వో బస్సు రోడ్డు పక్కన గుంతలో బోల్తా పడింది. సుమారు 30 మంది ప్రయాణికులు తీవ్రంగా గాయపడిన ఘటన గుత్తి సమీపంలోని కొత్తపేట శివారులో సోమవారం తెల్లవారుజామున జరిగింది. వివరాల్లోకెళితే... విజయవాడకు చెందిన కేశినేని ట్రావెల్స్ ఓల్వో బస్సు ఆదివారం అర్ధరాత్రి హైదరాబాద్ నుంచి బెంగుళూరుకు బయలుదేరింది. 44వ జాతీయ రహదారిపై తెల్లవారుజామున గుత్తి సమీపంలోని కొత్తపేట-ఎస్కేడీ ఇంజినీరింగ్ కాలేజీ మధ్య ప్రమాదవశాత్తు బస్సు రోడ్డు పక్కన ఉన్న గుంతలో బోల్తాపడింది. ఈ ప్రమాదంలో బస్సులో ప్రయాణిస్తున్న సుమారు 30 మంది తీవ్రంగా గాయపడ్డారు. మరో 15 మందికి స్వల్ప గాయాలు అయ్యాయి. ప్రమాదం జరిగినపుడు బస్సులో మొత్తం 47 మంది ప్రయాణికులు ఉన్నారు. బస్సు పల్టీలు కొట్టడంతో బస్సులో ఉన్న హైదరాబాద్‌కు చెందిన రవిచంద్ర, శ్రీనివాసులు, మంజులు, సుమంత్ రెడ్డి, ఉషారాణి, షాజిర్, హర్షలత, ఆదిత్య, రాజేష్,ప్రియాంక, కళ్యాణి, ఎం.కళ్యాణి, సౌమ్య, బ్రహ్మణి, జాన్, ధనిబాబు, శ్రావణ్‌కుమార్, అరవింద్,ప్రవీణ్, శివ శంకర్, రామాంజినేయులు, చంద్రశేఖర్, ఘనిబాబు, మల్లయ్య, ముస్తఫా, రామ్‌రాజు(బస్సు రెండవ డ్రైవర్)తో పాటు మరో నలుగురు తీవ్రంగా గాయపడ్డారు. ప్రమాదాన్ని హైవే పెట్రోలింగ్ టీమ్ గమనించి స్థానిక పోలీసులకు సమాచారం ఇచ్చారు. వెంటనే సీఐ మధుసూదన్ గౌడ్, ఎస్ఐ రామాంజనేయులు తమ సిబ్బందితో ఘటనా స్థలానికి చేరుకున్నారు. సహాయక చర్యలు చేపట్టారు. క్షతగాత్రులను 108 వాహనంలో గుత్తి ప్రభుత్వాస్పత్రికి తరలించారు. సౌమ్య పరిస్థితి విషమంగా ఉండటంతో కర్నూల్ జనరల్ ఆస్పత్రికి తరలించారు. డ్రైవర్ కేశవ్ ప్రమాదం జరిగిన వెంటనే పరారైయ్యాడు. ప్రయాణికుల భద్రత గాలికి ప్రైవేట్ ట్రావెల్స్ బస్సుల యజమానులు ప్రయాణికుల భద్రత గాలికి వదిలేస్తున్నారు. పోటీ అధికం కావడంతో ప్రయాణికులకు త్వరగా గమ్యస్థానాలకు చేర్చాలని అధిక వేగంతో బస్సులు నడుపుతూ ప్రయాణికుల ప్రాణాలపైకి తెస్తున్నారు. అర్ధరాత్రి తర్వాత హైదరాబాద్‌లో బయలుదేరే బస్సులు తెల్లారేసరికి బెంగళూరుకు చేరుకోవాలని 140 కిలోమీటర్ల స్పీడుతో బస్సులను నడుపుతూ నిబంధనలు అతిక్రమిస్తున్నారు. ఇటీవల ఇదే తరహాలోనే గుత్తి శివారులోని టోల్‌ప్లాజా వద్ద బస్సు బోల్తా పడి చిత్తూరుకు చెందిన నవవధువు మృతి చెందింది. అయినా అధికారులు ప్రైవేట్ బస్సులపై చర్యలు తీసుకోవడానికి వెనుకంజ వేస్తున్నారు. డ్రైవర్ కునుకుతోనే.. డ్రైవర్ నిద్రమత్తులో ఉండటం వల్లే ప్రమాదం సంభవించినట్లు తెలుస్తోంది. రెండు కిలో మీటర్లు వెళ్లి ఉంటే (టోల్‌ప్లాజా వద్ద) రెండో డ్రైవర్ రామ్‌రాజు బస్సు నడపాల్సి ఉంది. ఇంతలోనే బస్సు ప్రమాదానికి గురి అయింది. ప్రథమ చికిత్స అనంతరం క్షతగాత్రులందరూ తమ ఊర్లకు వెళ్లిపోయారు. ఎంవీఐ ఉదారత ఓల్వో బస్సు గుత్తి వద్ద ప్రమాదానికి గురైందనే విషయం తెలుసుకున్న గుంతకల్లు ఎంవీఐ(మోటార్ వెహికల్ ఇన్స్పెక్టర్) శివారెడ్డి వెంటనే స్పందించి హుటాహుటిన ఘటనా స్థలానికి చేరుకున్నారు. మూడు వాహనాలను సమకూర్చారు. స్వల్పంగా గాయపడిన వారిని వారి సొంత ఊర్లకు, గమ్యస్థానాలకు వాహనాల్లో తరలించారు. క్షతగాత్రులను అనంతపురం, కర్నూలు తరలించేందుకు కృషి చేశారు. పెరిగిన ఓల్వో ప్రమాదాలు * ఓల్వో బస్సులు తరచూ ప్రమాదాలకు గురవుతున్నాయి. గతంలో ప్రమాదాలు అధికం కావడంతో రోడ్డు రవాణా శాఖ అధికారులు ఓల్వో బస్సులను బ్యాన్ చేయాలని కూడా నిర్ణయించారు. * ఓల్వో బస్సులో ఏదో టెక్నికల్ సమస్య ఉన్నట్లు అప్పట్లో రవాణాశాఖ అధికారులు తేల్చారు. ఇంతలో ప్రభుత్వం మారింది. దీంతో బ్యాన్ విషయం పక్కకు పోయింది. ఓల్వో బస్సుల్లో అధికంగా టీడీపీ నేతలకు చెందినవి కావడంతో వాటి ని బ్యాన్ చేయడానికి రవాణా శాఖ అధికారులు సంకోచిస్తున్నారు. -
'కేశినేని' బస్సు బోల్తా:20 మందికి తీవ్రగాయాలు
-
'కేశినేని' బస్సు బోల్తా:20 మందికి తీవ్రగాయాలు
గుత్తి:కేశినేని ట్రావెల్స్ కు చెందిన ఓ బస్సు సోమవారం తెల్లవారుజామున గుత్తి ఎన్ హెచ్ 44పై బోల్తా పడింది. హైదరాబాద్ నుంచి బెంగళూరు కు వెళ్తున్న సమయంలో బస్సు అదుపు తప్పి బోల్తా పడింది. ఈ ఘటనలో 20 మందికి తీవ్ర గాయాలు అయ్యాయి. వీరిలో ఐదుగురి పరిస్థితి విషమంగా ఉన్నట్లు తెలుస్తోంది. బస్సు ప్రమాదంలో గాయపడిన వారిని స్థానిక ప్రభుత్వాస్పత్రికి తరలించి చికిత్స అందిస్తున్నారు. ఈ ప్రమాదానికి అతి వేగమే ప్రధాన కారణంగా తెలుస్తోంది. దీనికి సంబంధించి కేసు నమోదు చేసుకున్న పోలీసులు దర్యాప్తు చేపట్టారు. అసలు ప్రమాదానికి గల కారణాలను రాబట్టే పనిలో పడ్డారు. బస్సులో ప్రయాణిస్తున్న వారిలో అధికశాతం మంది హైదరాబాద్ కు చెందిన వారే. -
నెల్లూరు జిల్లా వెన్నమాల వద్ద రోడ్డు ప్రమాదం
నెల్లూరు జిల్లా: నాయుడుపేట సమీపంలో వెన్నమాల వద్ద తెల్లవారు జామున రోడ్డు ప్రమాదం జరిగింది. కేశినేని ట్రావెల్స్ కు చెందిన బస్సు (AP16TB7600)బోల్తా పడింది.ఇందులో 20 మంది ప్రయాణికులకు గాయాలయ్యాయి. ప్రయాణికులను వెంటనే దగ్గరిలోని ఆస్పత్రికి తరలించారు. విజయవాడ నుంచి తిరుపతి వెళ్తుండగా ఈ ఘటన జరిగింది. -
టీడీ‘ఫ్రీ’ ఆఫర్
* రూ.100 రుసుముతో రూ.2 లక్షల బీమా సదుపాయం * ‘కేశినేని’లో రాయితీ,కార్పొరేట్ ఆస్పత్రుల్లో తగ్గింపు * సభ్యత్వ నమోదులో అధికార పక్షం సరికొత్త ఎరలు * కరపత్రాలతో గ్రామాల్లో నాయకుల విస్తృత ప్రచారం రాజమండ్రి రూరల్ : ‘ఒకటి కొంటే ఒకటి ఉచితం’, ‘మా వద్ద షాపింగ్ చేయండి.. సింగపూర్ షికారు ఛాన్స్ కొట్టండి’ వంటి ఆఫర్లు.. సరుకులను అమ్ముకునేందుకు వివిధ సంస్థలు అనుసరించే వ్యూహాలే. ఇప్పుడు ఆ బాపతు వ్యూహాన్నే అధికార తెలుగుదేశం ఎంచుకుంది. పార్టీ సభ్యత్వాల నమోదు క్రమంలో జనాన్ని ఆకట్టుకునేందుకు అనేక తాయిలాలనూ, రాయితీలను ఇవ్వజూపుతోంది. రాజకీయ పార్టీలకు సంబంధించి వింత వరవడికి నాంది పలుకుతోంది. టీడీపీ సాధారణ సభ్యత్వానికి రూ.10, క్రియాశీలక సభ్యత్వానికి రూ.100 రుసుముగా నిర్ణయించింది. ఈ ఏడాదిలో సభ్యత్వ నమోదులో ఆన్లైన్ విధానం ప్రవేశపెట్టిన ఆ పార్టీ రోజుకు ఒక గ్రామంలో సభ్యత్వ నమోదు పూర్తి చేయాలని, డిసెంబరు మూడు లోగా ఈ ప్రక్రియను పూర్తి చేయాలని పార్టీ శ్రేణులను నిర్దేశించింది. నియోజకవర్గ స్థాయి సమావేశాలు ఏర్పాటు చేసి పార్టీ నాయకులు, కార్యకర్తల్లో చైతన్యం కలిగించాలని సూచించింది. ఆ మేరకు నాయకులు క్రియాశీలక సభ్యులుగా చేరే వారికి కలిగే ప్రయోజనాలను విస్తృతంగా ప్రచారం చేస్తున్నారు. ఇవీ నజరానాలు.. ఎవరైనా రూ.100 పెట్టి క్రియాశీలక సభ్యత్వం తీసుకుంటే రూ.రెండు లక్షల ప్రమాద బీమా, కేశినేని ట్రావెల్స్‌లో ప్రయాణిస్తే టిక్కెట్ చార్జీలో పది శాతం రాయి తీ, వివిధ కార్పొరేట్ ఆస్పత్రుల్లో చికిత్స పొందితే 15 నుంచి 20 శాతం బిల్లు తగ్గింపు వంటి సౌకర్యాలు సొంతమవుతాయని ఊరిస్తున్నారు. ఒకవేళ ఆ కార్యకర్త ప్రమాదవశాత్తు చనిపోతే అతని పిల్లల్లో ఇద్దరికి విద్యాసంక్షేమ నిధి నుంచి చదువు నిమిత్తం రూ.10 వేల చొప్పున అందజేస్తామని ప్రచారం చేస్తున్నారు. క్రియాశీలక సభ్యులుగా చేరితే దక్కే ఇలాంటి ప్రయోజనాలను ముఖతహ చెప్పడమే కాక.. కరపత్రాలు ముద్రించి మరీ ప్రచారం చేస్తున్నారు. నేటి మైనర్లే.. రేపటి ఓటర్లు ఇప్పటి వరకూ ఏ పార్టీ అయినా 18 ఏళ్లు నిండి న వారిని మాత్రమే సభ్యులుగా చేర్చుకునేది. ఇప్పుడు టీడీపీ ఆ వయోపరిమితిని సడలించేసింది. ఒకప్పుడు ‘విద్యార్థులకు రాజకీయాలెందుకు?’ అన్న చంద్రబాబు నాయుడి నాయకత్వంలోని పార్టీయే ఇప్పుడు బాలలనూ నిస్సంకోచంగా సభ్యులుగా చేర్చుకుంటోంది. 14 ఏళ్లు నిండిన వారిని సభ్యులుగా చేర్చుకోవచ్చని, వారు రానున్న ఎన్నికల నాటికి 18 ఏళ్లు నిండి ఓటర్లుగా నమోదయ్యే అవకాశం ఉన్నందున సభ్యత్వాలు స్వీకరించాలని ముఖ్య నాయకులు కార్యకర్తలకు ఆదేశాలు జారీ చేస్తున్నారు. ఎన్నికల సమయంలో ఇచ్చిన హామీలను నెరవేర్చకపోవడం వల్ల ప్రజల్లో పెల్లుబుతుకున్న వ్యతిరేకతను తట్టుకునేందుకు తమ పార్టీ చిత్రవిచిత్రమైన చిట్కాలను ప్రయోగిస్తోందని, అవి ఎంతవరకూ ఫలిస్తాయో కాలమే తేలుస్తుందని కొందరు టీడీపీ నాయకులే వ్యాఖ్యానిస్తున్నారు. -
కేశినేని వోల్వో బస్సులో సాంకేతిక లోపం
హైదరాబాద్ నుంచి తిరుమల పుణ్యక్షేత్రానికి వెళ్తున్న వోల్వో బస్సులో సాంకేతిక లోపం తలెత్తి బస్సు మధ్యలోనే ఆగిపోయింది. కేశినేని ట్రావెల్స్‌కు చెందిన ఈ బస్సు కర్నూలు - పాణ్యం మధ్యలో నిలిచిపోయింది. దీంతో ప్రయాణికులంతా తీవ్ర ఆందోళనకు గురయ్యారు. అయినా ట్రావెల్స్ సిబ్బంది మాత్రం అస్సలు ఈ విషయాన్ని పట్టించుకోలేదు. హైదరాబాద్‌లో బయల్దేరిన తర్వాత కర్నూలు వరకు బాగానే వెళ్లినా, కర్నూలు - పాణ్యం మధ్యలో ఉన్నట్టుండి ఈ బస్సులో ఏదో సాంకేతిక లోపం తలెత్తింది. దీంతో బస్సు అక్కడే ఆగిపోయింది. కనీసం ప్రత్యామ్నాయం కూడా లేకపోవడం, అక్కడినుంచి గమ్యానికి ఎలా వెళ్లాలో తెలియకపోవడంతో ప్రయాణికులంతా తీవ్ర ఆందోళనకు గురయ్యారు. -
కేశినేని ట్రావెల్స్ లీలలు!
ప్రయాణికుడిపై దౌర్జన్యం ఆ బస్సు రూటే సెపరేటు ప్రయాణికులకు నరకం చూపిన వైనం విజయవాడ: రవాణాశాఖ అధికారులు ఎన్ని దాడులు నిర్వహిస్తున్నా ప్రైవేటు ట్రావెల్స్ నిర్వాహకులు మాత్రం తమ పంథాను మార్చుకోకుండా ప్ర యాణికులకు ప్రత్యక్ష నరకం చూపుతున్నారు. సంక్రాంతి సెలవులు కావడంతో స్వస్థలాలకు బయలుదేరాలనుకునే వారి నుంచి వేలాది రూ పాయలు గుంజుతూ వారిని పురుగులు చూసినట్లు చూస్తున్నారు. అదేమని ప్రశ్నించే వారిపై దాడులకు తెగబడుతున్నారు. ఇటువంటి చేదు అనుభవమే కేశినేని ట్రావెల్స్ నుంచి నగరానికి చెందిన వ్యాపారి బి.దివాకర్‌కు ఎదురైంది. గు రువారం రాత్రి బెంగళూరులో కేశినేని ట్రావెల్స్ బస్సులో బయలుదేరిన ఆయన డ్రైవర్ చేతిలో చావు దెబ్బలు తిని శుక్రవారం నగరానికి చేరుకున్నారు. కృష్ణలంక పోలీస్‌స్టేషన్‌లో ఫిర్యాదు చేసి, ప్రభుత్వాసుత్రిలో చికిత్స పొందారు. తన అనుభవాన్ని శుక్రవారం ‘సాక్షి’కి వివరించారు. కేశినేని ట్రావెల్స్తో తన అనుభవం ఆయన మాటల్లోనే....గురువారం రాత్రి 8.30 గంటలకు బెంగుళూరులో కళాసపాలెం వద్ద కేశినేని ట్రావెల్స్ బస్సు ఎక్కేందుకు టికెట్ కొనుక్కుని మరికొంతమంది ప్రయాణికులతో నిరీక్షించా. చివరకు రాత్రి 9.45 గంటల ప్రాంతంలో కేశినేని ట్రావెల్స్ ప్రతినిధులు వ చ్చి బస్సు అక్కడకు రాదని చెప్పారు. మరొక చోటకు తీసుకువెళ్లి బస్సు ఎక్కించారు. రాత్రి 10.45 గంటల ప్రాంతంలో బస్సును హైవే వర కు తీసుకువచ్చి ఆపేశారు. మమ్మల్ని కిందకు దింపేసి, అక్కడకు విజయవాడ వెళ్లే బస్సు వస్తుందని, దానిలో ఎక్కమని చెప్పి డ్రైవర్ వెళ్లిపోయాడు. గజగజా వణికే చలిలో వృద్ధులు,చిన్నారులతో కలిసి అర్ధరాత్రి 11.45 గంటల వరకు హైవేపై వేచి ఉన్నాం. చివరకు విజయవాడ వెళ్లే బస్సు వచ్చింది. అందరం అందులో ఎక్కాం. ప్రయాణికులు పది నిముషాలు ఆల స్యం అయితే బస్సును ఆపరు కానీ, 8.30కు బయలుదేరాల్సిన బస్సు 12 గంటల వరకు ఎందుకు బయలుదేరలేదంటూ డ్రైవర్‌ను ప్ర శ్నించా. ‘ఆలస్యం అయ్యింది.. నువ్వు వెళ్లి సీట్లో కూర్చో.. నీకు వివరణ ఇవ్వాల్సిన అవసరం లేదు’ అంటూ ఆగ్రహం వ్యక్తం చేశాడు. ‘రూ.1500 పెట్టి టికెట్ కొన్నాం.. ఎముకల కొరికే చలిలో ముసలివాళ్లను గంటకు పైగా నిలబెట్టా రు. కనీస మర్యాద కూడా ఇవ్వకుండా మాట్లాడటం సబబేనా’ అంటూ నేను ఎదురు ప్రశ్నించాను. నాతో పాటే మరికొంతమంది ప్రయాణికులు కూడా డ్రైవర్‌ను గట్టిగా ప్రశ్నిం చాడు. దీంతో డ్రైవర్ నాపై దాడి చేశాడు. బూ తులు తిడుతూ, నా ముఖంపై పిడిగుద్దులు గు ద్దసాగాడు. దీంతో ముఖానికి చేతులు అడ్డుపెట్టుకున్నా. కిందపడిపోవడంతో చేతికి గట్టి దె బ్బతగిలింది. పక్కనే ఇద్దరు కేశినేని సిబ్బంది ఉన్నా ఆపే ప్రయత్నం చేయలేదు. చివరకు భ యంభయంగానే నా సీటులో కూర్చున్నా. నేను ఈ రూట్లో చాలాసార్లు ప్రయాణం చేశా. బస్సు తిరుపతి మీదగా రావాల్సి ఉండగా.. రూట్ మార్చి అనంతపురం, కడప మీదగా గ్రా మాల్లోంచి తీసుకువచ్చారు. విజయవాడ-బెంగళూరు రూటు గురించి అవగాహన ఉన్న ప్ర యాణికులు బస్సు రూటు మారడం గురించి ప్రశ్నించారు. ఆర్టీఏ అధికారులు దాడులు చేస్తున్నారు. అందువల్ల మరో రూటులో తీసుకువెళ్లుతున్నామని డ్రైవర్ నిర్లక్ష్యంగా సమాధానం చెప్పాడు. ఆర్టీఏ దాడులు కారణంగా మరో రూ టులో తీసుకువస్తున్నాడా? లేక మేము గొడవ పడ్డామని దారి మళ్లించాడో అర్ధం కాక బస్సు లో ప్రయాణికులమంతా భయంతో కూర్చున్నాం. ఈరోజు సాయంత్రం కనకదుర్గవారధి వద్దకు వచ్చిన తరువాత ముందుకు వెళ్లి చూస్తే డ్రైవర్ లేడు. అదేమని మిగిలిన సిబ్బందిని ప్రశ్నిస్తే, మధ్యలో దిగిపోయాడని చెప్పారు. బస్సు దిగిన తరువాత కృష్ణలంక పోలీసుస్టేష న్లో ఫిర్యాదు చేశా. పోలీసులు కేసు నమోదు చేసి, చేతికి కట్టుకట్టించేందుకు ప్రభుత్వాస్పత్రికి పంపారు. నిన్న రాత్రి 8.30 గంటల నుంచి ఈరోజు రాత్రి 8.30 గంటల వరకు నాకు భోజనం కూడా లేదు. ఇంటికి వచ్చి భోజనం చేస్తున్నా. నాపై దాడి చేసిన డ్రైవర్‌పై కఠిన చర్యలు తీసుకోవాలని డిమాండ్ చేస్తున్నా.’