
'కేశినేని' బస్సు బోల్తా:20 మందికి తీవ్రగాయాలు
గుత్తి:కేశినేని ట్రావెల్స్ కు చెందిన ఓ బస్సు సోమవారం తెల్లవారుజామున గుత్తి ఎన్ హెచ్ 44పై బోల్తా పడింది. హైదరాబాద్ నుంచి బెంగళూరు కు వెళ్తున్న సమయంలో బస్సు అదుపు తప్పి బోల్తా పడింది. ఈ ఘటనలో 20 మందికి తీవ్ర గాయాలు అయ్యాయి. వీరిలో ఐదుగురి పరిస్థితి విషమంగా ఉన్నట్లు తెలుస్తోంది.
బస్సు ప్రమాదంలో గాయపడిన వారిని స్థానిక ప్రభుత్వాస్పత్రికి తరలించి చికిత్స అందిస్తున్నారు. ఈ ప్రమాదానికి అతి వేగమే ప్రధాన కారణంగా తెలుస్తోంది. దీనికి సంబంధించి కేసు నమోదు చేసుకున్న పోలీసులు దర్యాప్తు చేపట్టారు. అసలు ప్రమాదానికి గల కారణాలను రాబట్టే పనిలో పడ్డారు. బస్సులో ప్రయాణిస్తున్న వారిలో అధికశాతం మంది హైదరాబాద్ కు చెందిన వారే.