తెలుగు రాష్ట్రాలలో కేశినేని ట్రావెల్స్‌ తిప్పను | i will not run kesineni travels in telugu states, says nani | Sakshi
Sakshi News home page

తెలుగు రాష్ట్రాలలో కేశినేని ట్రావెల్స్‌ తిప్పను

Published Fri, Apr 14 2017 6:02 PM | Last Updated on Tue, Sep 5 2017 8:46 AM

తెలుగు రాష్ట్రాలలో కేశినేని ట్రావెల్స్‌ తిప్పను

తెలుగు రాష్ట్రాలలో కేశినేని ట్రావెల్స్‌ తిప్పను

విజయవాడ: రెండేళ్లుగా కేశినేని ట్రావెల్స్‌ నష్టాల్లో ఉందని, మరో పదేళ్లు నష్టాలు వచ్చినా నడపగలిగే శక్తి తనకు ఉందని ట్రావెల్స్‌ యజమాని, విజయవాడ టీడీపీ ఎంపీ కేశినేని నాని చెప్పారు. వ్యవస్థను మార్చలేకే తన ట్రావెల్స్‌ వ్యాపారాన్ని మానుకున్నానని తెలిపారు.

తెలుగు రాష్ట్రాలు ఆంధ్రప్రదేశ్‌, తెలంగాణలలో తన ట్రావెల్స్‌ బస్సులను తిప్పనని నాని చెప్పారు. ఇతర రాష్ట్రాలలో ట్రావెల్స్‌ నడపాలంటూ ఆహ్వానాలు వస్తున్నాయని తెలిపారు. పదవిని అడ్డుపెట్టుకుని తాను ఏనాడూ సంపాదనకు ప్రయత్నించలేదని నాని అన్నారు.

ఇటీవల రవాణ శాఖ కార్యాలయం వద్ద కమీషనర్ బాలసుబ్రహ్మణ్యం పట్ల నాని, టీడీపీ ఎమ్మెల్యే బోండా ఉమా మహేశ్వర రావు దౌర్జన్యంగా ప్రవర్తించిన సంగతి తెలిసిందే. ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు ఈ విషయంలో జోక్యం చేసుకుని నానితో క్షమాపణలు చెప్పించారు. ఆ తర్వాత కేశినేని ట్రావెల్స్‌ను మూసివేయాలని నాని నిర్ణయించారు.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement