హైదరాబాద్ నుంచి తిరుమల పుణ్యక్షేత్రానికి వెళ్తున్న కేశినేని వోల్వో బస్సులో సాంకేతిక లోపం తలెత్తి బస్సు మధ్యలోనే ఆగిపోయింది.
హైదరాబాద్ నుంచి తిరుమల పుణ్యక్షేత్రానికి వెళ్తున్న వోల్వో బస్సులో సాంకేతిక లోపం తలెత్తి బస్సు మధ్యలోనే ఆగిపోయింది. కేశినేని ట్రావెల్స్కు చెందిన ఈ బస్సు కర్నూలు - పాణ్యం మధ్యలో నిలిచిపోయింది. దీంతో ప్రయాణికులంతా తీవ్ర ఆందోళనకు గురయ్యారు. అయినా ట్రావెల్స్ సిబ్బంది మాత్రం అస్సలు ఈ విషయాన్ని పట్టించుకోలేదు.
హైదరాబాద్లో బయల్దేరిన తర్వాత కర్నూలు వరకు బాగానే వెళ్లినా, కర్నూలు - పాణ్యం మధ్యలో ఉన్నట్టుండి ఈ బస్సులో ఏదో సాంకేతిక లోపం తలెత్తింది. దీంతో బస్సు అక్కడే ఆగిపోయింది. కనీసం ప్రత్యామ్నాయం కూడా లేకపోవడం, అక్కడినుంచి గమ్యానికి ఎలా వెళ్లాలో తెలియకపోవడంతో ప్రయాణికులంతా తీవ్ర ఆందోళనకు గురయ్యారు.