కేశినేని నానికి సీఎం ఫోన్‌, ప్రెస్‌ మీట్‌ రద్దు | tdp mp kesineni nani pressmeet cancelled | Sakshi
Sakshi News home page

కేశినేని నానికి సీఎం ఫోన్‌, ప్రెస్‌ మీట్‌ రద్దు

Published Fri, Mar 31 2017 5:06 PM | Last Updated on Fri, Aug 10 2018 7:07 PM

కేశినేని నానికి సీఎం ఫోన్‌, ప్రెస్‌ మీట్‌ రద్దు - Sakshi

కేశినేని నానికి సీఎం ఫోన్‌, ప్రెస్‌ మీట్‌ రద్దు

విజయవాడ: బెజవాడలో కేశినేని ట్రావెల్స్‌ వద్ద శుక్రవారం హైడ్రామా నడిచింది. టీడీపీ ఎంపీ కేశినేని నాని మీడియా సమావేశాన్ని అర్థాంతరంగా రద్దు చేసుకున్నారు. మీడియా సమావేశానికి విలేకరులను పిలిచిన ఆయనకు ప్రెస్‌మీట్‌ ప్రారంభానికి ముందే ముఖ్యమంత్రి చంద్రబాబు నుంచి ఫోన్‌ కాల్‌ వచ్చింది. దీంతో కేశినేని నాని ప్రెస్‌ మీట్‌ను రద్దు చేసుకుని సీఎం నివాసానికి వెళ్లారు. కాగా  ఆర్టీఏ కార్యాలయంలో జరిగిన వ్యవహారంపై కేశినేని నాని కొంత అసంతృప్తిగా ఉన్నారు. 

దీంతో కేశినేని ట్రావెల్స్‌ను మూసివేసేందుకు నాని సిద్ధపడ్డారని ప్రచారం జరుగుతున్న విషయం తెలిసిందే. అదే విషయాన్ని మీడియాకు చెబుతారని ఊహాగానాలు వినిపించాయి. అయితే దీనిపై కేశినేని నాని ఏమీ చెప్పకుండానే వెళ్లిపోయారు. సీఎం దగ్గరకు వెళ్లినప్పటికీ తన నిర్ణయంలో ఎలాంటి మార్పు ఉండదని ఆయన చెప్పినట్లు సమాచారం.  ఇందుకు సంబంధించి పూర్తి వివరాలు తెలియాల్సి ఉంది.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement