pressmeet cancelled
-
జీవో నెంబర్ 1లో ఏముందో తెలుసుకుని ప్రతిపక్షాలు మాట్లాడాలి
-
అందుకే మౌనంగా ఉన్నా
నానా పటేకర్ తనను లైంగికంగా వేధించాడంటూ తనుశ్రీ దత్తా చేసిన ఆరోపణల గురించి దాదాపు వారం రోజులుగా వాడి వేడి చర్చ జరుగుతోంది. కానీ నానా పటేకర్ మాత్రం ఆ విషయంపై నోరు మెదపలేదు. తన సినిమా షూటింగ్స్‌తో ఆయన బిజీగా ఉన్నారు. అయితే తాజాగా తనుశ్రీ విషయంపై స్పందిస్తానంటూ సోమవారం విలేకరుల సమావేశాన్ని నిర్వహిస్తున్నామని బాలీవుడ్ మీడియాకు చెప్పి, చివరి నిమిషంలో ఆ ప్రెస్‌మీట్‌ని క్యాన్సిల్ చేశారు నానా. కానీ అక్కడికి వెళ్లిన మీడియాతో తన ఇంటి ముందు కొన్ని నిమిషాలు మాట్లాడారు. ఇన్ని రోజులు ఈ విషయంపై ఎందుకు మౌనంగా ఉన్నారు అని అడగ్గా – ‘‘మా లాయర్ నన్ను తనుశ్రీ విషయమై ఏమీ మాట్లాడొద్దన్నారు. అందుకనే ఈ విషయం గురించి బయటకు మాట్లాడలేదు. నేను పదేళ్ల క్రితం చెప్పిందే ఇప్పుడూ చెబుతున్నాను. ఎందుకంటే పదేళ్లయింది కదా అని నిజం మారిపోదు కదా’’ అని పేర్కొన్నారు. -
కేశినేని నానికి సీఎం ఫోన్, ప్రెస్ మీట్ రద్దు
-
కేశినేని నానికి సీఎం ఫోన్, ప్రెస్ మీట్ రద్దు
విజయవాడ: బెజవాడలో కేశినేని ట్రావెల్స్ వద్ద శుక్రవారం హైడ్రామా నడిచింది. టీడీపీ ఎంపీ కేశినేని నాని మీడియా సమావేశాన్ని అర్థాంతరంగా రద్దు చేసుకున్నారు. మీడియా సమావేశానికి విలేకరులను పిలిచిన ఆయనకు ప్రెస్‌మీట్ ప్రారంభానికి ముందే ముఖ్యమంత్రి చంద్రబాబు నుంచి ఫోన్ కాల్ వచ్చింది. దీంతో కేశినేని నాని ప్రెస్ మీట్‌ను రద్దు చేసుకుని సీఎం నివాసానికి వెళ్లారు. కాగా ఆర్టీఏ కార్యాలయంలో జరిగిన వ్యవహారంపై కేశినేని నాని కొంత అసంతృప్తిగా ఉన్నారు. దీంతో కేశినేని ట్రావెల్స్‌ను మూసివేసేందుకు నాని సిద్ధపడ్డారని ప్రచారం జరుగుతున్న విషయం తెలిసిందే. అదే విషయాన్ని మీడియాకు చెబుతారని ఊహాగానాలు వినిపించాయి. అయితే దీనిపై కేశినేని నాని ఏమీ చెప్పకుండానే వెళ్లిపోయారు. సీఎం దగ్గరకు వెళ్లినప్పటికీ తన నిర్ణయంలో ఎలాంటి మార్పు ఉండదని ఆయన చెప్పినట్లు సమాచారం. ఇందుకు సంబంధించి పూర్తి వివరాలు తెలియాల్సి ఉంది.