
నానా పటేకర్
నానా పటేకర్ తనను లైంగికంగా వేధించాడంటూ తనుశ్రీ దత్తా చేసిన ఆరోపణల గురించి దాదాపు వారం రోజులుగా వాడి వేడి చర్చ జరుగుతోంది. కానీ నానా పటేకర్ మాత్రం ఆ విషయంపై నోరు మెదపలేదు. తన సినిమా షూటింగ్స్‌తో ఆయన బిజీగా ఉన్నారు. అయితే తాజాగా తనుశ్రీ విషయంపై స్పందిస్తానంటూ సోమవారం విలేకరుల సమావేశాన్ని నిర్వహిస్తున్నామని బాలీవుడ్ మీడియాకు చెప్పి, చివరి నిమిషంలో ఆ ప్రెస్‌మీట్‌ని క్యాన్సిల్ చేశారు నానా. కానీ అక్కడికి వెళ్లిన మీడియాతో తన ఇంటి ముందు కొన్ని నిమిషాలు మాట్లాడారు. ఇన్ని రోజులు ఈ విషయంపై ఎందుకు మౌనంగా ఉన్నారు అని అడగ్గా – ‘‘మా లాయర్ నన్ను తనుశ్రీ విషయమై ఏమీ మాట్లాడొద్దన్నారు. అందుకనే ఈ విషయం గురించి బయటకు మాట్లాడలేదు. నేను పదేళ్ల క్రితం చెప్పిందే ఇప్పుడూ చెబుతున్నాను. ఎందుకంటే పదేళ్లయింది కదా అని నిజం మారిపోదు కదా’’ అని పేర్కొన్నారు.
Comments
Please login to add a commentAdd a comment