
ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడుతో ఎంపీ మాగంటి బాబు(ఫైల్‌ఫొటో)
ఏలూరు (ఆర్‌ఆర్‌పేట): ‘‘చంద్రబాబునాయుడు గారు మోసం చేశారు. ఏ విధంగా మోసం చేశారో మీకు తెలుసు. ఇటువంటి పరిణామాలు ఎదురవుతాయి కాబట్టి ప్రజలంతా ఒకతాటిపైకి రావాలి’’ ఈ మాటలన్నది ఏ ప్రతిపక్ష పార్టీ నేతో కాదు. తెలుగుదేశం ఎంపీ మాగంటి బాబు. శనివారం ఉదయం తెలుగుదేశం పార్టీ ఆధ్వర్యంలో ఏలూరు పాత బస్టాండు సెంటర్‌లో ప్రత్యేక హోదా కోరుతూ ధర్నా నిర్వహించారు. కార్యక్రమంలో ప్రభుత్వ విప్ చింతమనేని ప్రభాకర్, ఏలూరు ఎమ్మెల్యే బడేటి బుజ్జి తదితరులు పాల్గొన్నారు. కేంద్ర ప్రభుత్వంపైనా, ప్రధాని మోదీపైనా, బీజేపీపైనా నాయకులు విమర్శలు గుప్పించారు. ఈ సందర్భంగా మాట్లాడిన మాగంటి బాబు.. చంద్రబాబు మోసం చేస్తున్నారని ఊగిపోయారు. మోదీని విమర్శిస్తున్నాను అనే ఉద్దేశంలో రెచ్చిపోయారు. దీంతో అక్కడున్న నాయకులతో పాటు ప్రజలు ముక్కున వేలేసుకున్నారు. ఏమైనా మాగంటి బాబు నిజాలే చెప్పారని అక్కడికి వచ్చిన వారు అనుకున్నారు. ఏలూరులో కూడా ఓ ‘పప్పు’ బ్యాచ్ తయారయిందని సెటైర్లు వేసుకోవడం కనిపించింది.
Comments
Please login to add a commentAdd a comment