
సాక్షి, అమరావతి: రూ. 60 వేల కోట్లతో అమరావతిలో నిర్మాణాలు చేపడతామంటూ మంత్రి నారాయణ సంచలన వ్యాఖ్యలు చేశారు. ఒకే ప్రాంతంలో భారీ వ్యయం చేయాలని చంద్రబాబు నిర్ణయించారని నారాయణ తెలిపారు. విజయవాడలో క్రెడాయ్ ప్రతినిధులతో జరిగిన సమావేశంలో ఆయన మాట్లాడుతూ కేవలం సీడ్ క్యాపిటల్‌కే రూ.60 వేల కోట్లు పెట్టాలనే ఆలోచన ఉందన్నారు.
అమరావతిలో పాత టెండర్లను క్లోజ్ చేస్తున్నామని 3 నెలల అధ్యయనం చేసి.. తర్వాత టెండర్లు పిలుస్తామని మంత్రి నారాయణ అన్నారు. ‘‘ఐఐటీ రిపోర్టులు వచ్చాక కమిటీ చర్చిస్తుంది. కమిటీలో చర్చించాక ముందుకు పోతాం. డిసెంబర్ నెలలో పనులు ప్రారంభిస్తాం’’ అని నారాయణ తెలిపారు.
Comments
Please login to add a commentAdd a comment