Narayan
-
అమరావతిపై మంత్రి నారాయణ సంచలన వ్యాఖ్యలు
సాక్షి, అమరావతి: రూ. 60 వేల కోట్లతో అమరావతిలో నిర్మాణాలు చేపడతామంటూ మంత్రి నారాయణ సంచలన వ్యాఖ్యలు చేశారు. ఒకే ప్రాంతంలో భారీ వ్యయం చేయాలని చంద్రబాబు నిర్ణయించారని నారాయణ తెలిపారు. విజయవాడలో క్రెడాయ్ ప్రతినిధులతో జరిగిన సమావేశంలో ఆయన మాట్లాడుతూ కేవలం సీడ్ క్యాపిటల్‌కే రూ.60 వేల కోట్లు పెట్టాలనే ఆలోచన ఉందన్నారు. అమరావతిలో పాత టెండర్లను క్లోజ్ చేస్తున్నామని 3 నెలల అధ్యయనం చేసి.. తర్వాత టెండర్లు పిలుస్తామని మంత్రి నారాయణ అన్నారు. ‘‘ఐఐటీ రిపోర్టులు వచ్చాక కమిటీ చర్చిస్తుంది. కమిటీలో చర్చించాక ముందుకు పోతాం. డిసెంబర్ నెలలో పనులు ప్రారంభిస్తాం’’ అని నారాయణ తెలిపారు. -
లైవ్‌లో హారికా నారాయణ్ స్వరాలు..
ప్రముఖ ప్లేబ్యాక్ సింగర్ హారికా నారాయణ్ తన స్వరాలతో సంగీత ప్రియులను హోరెత్తించనున్నారు. నగరంలోని ఓడియం ప్రిజమ్ వేదికగా ఈ నెల 6న నిర్వహించనున్న లైవ్ మ్యూజిక్ కన్సర్ట్‌లో హారికా విభిన్న పాటలతో అలరించనుంది. హారిక ఆర్ఆర్ఆర్ సినిమాతో సింగర్‌గా మరింత క్రేజ్ సంపాదించుకున్న విషయం విధితమే. నగరంలో మొదటిసారి లైవ్ ఈవెంట్లో పాడనుండడంతో సంతోషాన్ని వ్యక్తం చేశారు. ఈ లైవ్ కన్సర్ట్‌లో సంగీత ప్రియులకు ఆÔ్చర్యాన్ని కలిగించే అంశాలు ఉన్నట్లు తెలిపారు.శనివారం రాత్రి 8 గంటల నుంచి ఈ కార్యక్రమం కొనసాగనుంది. ఈ ఈవెంట్‌కు సంబంధించిన టిక్కెట్లు బుక్ మై షోలో అందుబాటులో ఉంటాయని నిర్వాహకులు పేర్కొన్నారు. -
తెలంగాణ రాష్ట్ర గీతం పాడిన సింగర్ హారిక నారాయణ్ (ఫోటోలు)
-
డాక్టరేట్ అందుకున్న శంతను నారాయణ్
సాక్షి, హైదరాబాద్/ఉస్మానియా యూనివర్సిటీ: అమెరికాకు చెందిన అడోబ్ కంపెనీ సీఈవో పద్మశ్రీ శంతను నారాయణ్ ఉస్మానియా విశ్వవిద్యాలయం 49వ గౌరవ డాక్టరేట్‌ను అందుకున్నారు. మంగళవారం క్యాంపస్‌లోని ఠాగూర్ ఆడిటోరియంలో జరిగిన 83వ స్నాతకోత్సవం కార్యక్రమానికి రాష్ట్ర గవర్నర్, ఓయూ చాన్స్‌లర్ తమిళిసై సౌందరరాజన్ అధ్యక్షత వహించగా పద్మశ్రీ శంతను నారాయణ్ ముఖ్యఅతిథిగా హాజరయ్యారు. పద్మశ్రీ శంతను నారాయణ్ సైన్స్ అండ్ టెక్నాలజీ రంగంలో చేసిన విశేష సేవలకు డాక్టరేట్‌కు ఎంపిక చేసినట్లు వీసీ ప్రొ.రవీందర్ పేర్కొన్నారు. ఇంతవరకు డాక్టరేట్లు అందుకున్న 49 మందిలో పద్మశ్రీ శంతను నారాయణ్ మూడో ఓయూ పూర్వవిద్యార్థి అవడం విశేషం. అనంతరం గవర్నర్ పీజీ విద్యార్థులకు బంగారు పతకాలను అందచేశారు. ఈ సందర్భంగా ఆమె మాట్లాడుతూ ఓయూలో అన్ని విభాగాలలో బంగారు పతకాలను ప్రవేశపెట్టాలని, అందుకు పూర్వవిద్యార్థులు సహకరించాలన్నారు. నేడు (31న) తన పెళ్లిరోజు అయినప్పటికీ మీ కోసం పాండిచ్చేరినుంచి వచ్చానని ఆమె చెప్పారు. సమయాన్ని వృధా చేయకుండా కష్టపడి పనిచేస్తే అనుకున్న లక్ష్యాలను చేరుకోవచ్చని పేర్కొన్నారు. బంగారు పతకాలలో మహిళల రికార్డు.. ఓయూలో అత్యధికంగా బంగారు పతకాలు సాధించి మహిళలు రికార్డు సృష్టించారు. ప్రకటించిన 46 మంది పీజీ విద్యార్థుల్లో 40 మంది మహిళలు కాగా కేవలం ఆరుగురు మాత్రమే పురుషులు ఉన్నారు. వివిధ విభాగాలలో 1,024 మంది పీహెచ్డీ డాక్టరేట్ డిగ్రీ పట్టాలు అందుకున్నారు. కార్యక్రమంలో రాష్ట్ర ఉన్నత విద్యా మండలి చైర్మన్ ప్రొ.లింబాద్రి, వీసీ ప్రొ.రవీందర్, రిజి్రస్టార్ ప్రొ.లక్ష్మీనారాయణ, ఎగ్జామినేషన్ కంట్రోలర్ ప్రొ.రాములు తదితరులు పాల్గొన్నారు. మా ఇంట్లో మూడో పీహెచ్డీ: శంతను నారాయణ్ స్నాతకోత్సవానికి ముఖ్యఅతిథిగా హాజరైన పద్మశ్రీ శంతను నారాయణ్ గవర్నర్ తమిళిసై, వీసీ ప్రొ.రవీందర్ చేతుల మీదుగా డాక్టరేట్‌ను అందుకున్నారు. అనంతరం ఆయన మాట్లాడుతూ, అమ్మా, నా భార్య పీహెచ్డీ డాక్టరేట్లు కాగా తనతో మూడోదన్నారు. ప్రపంచంలో ఆర్థిక అభివృద్ధి వేగంగా జరుగుతోందని, మారుతున్న పరిస్థితులకు అనుకూలంగా విద్యార్థులు అవకాశాలను ఎంచుకోవాలన్నారు. అనంతరం పీహెచ్డీ డాక్టరేట్ డిగ్రీలను సాధించిన 1,024 మంది విద్యార్థులకు పట్టాలను అందజేశారు. ఎమ్మెల్యే గువ్వల బాలరాజుకు డాక్టరేట్ అచ్చంపేట ఎమ్మెల్యే, ప్రభుత్వ విప్ గువ్వల బాలరాజు ఉస్మానియా విశ్వవిద్యాలయం నుంచి డాక్టరేట్ అందుకున్నారు. ‘భారతదేశంలో శాసనసభ్యుల శాసనాధికారాలు–వాటిపై న్యాయ సమీక్ష’ అనే అంశంపై న్యాయశాస్త్రంలో చేసిన పరిశోధనకు గాను బాలరాజుకు పీహెచ్డీ పట్టా లభించింది. అడోబ్ కంపెనీ సీఈవో శంతను నారాయణ్ చేతుల మీదుగా ఆయన డాక్టరేట్ అందుకున్నారు. డాక్టరేట్ల ఆనందం... ఓయూ నుంచి పీహెచ్డీ డాక్టరేట్లు అందుకున్న అభ్యర్థులు ఆనందం వ్యక్తం చేశారు. డాక్టరేట్ డిగ్రీలను అందుకున్న వారిలో ఉద్యోగాలు, వ్యాపారాలు, ఇతర పనులు చేసేవారే అధికంగా ఉన్నారు. పీహెచ్‌డీలో ప్రవేశం పొంది ఉద్యోగాలు రావడంతో 10, 15 సంవత్సరాల క్రితం చదవులను వదిలేసి ఇక డాక్టరేట్‌ను అందుకోలేమని అనుకున్న మాకు వీసీ వన్‌టైం ఛాయిస్‌తో పరిశోధనను పూర్తి చేసే అవకాశం కల్పించారని అనేక మంది విద్యార్థులు పేర్కొన్నారు. -
పేద రైతు కుటుంబం నుంచి కోట్ల రూపాయల సంపాదన ఎలా ?
-
అమ్మగా ఆలోచించి.. రూ. 50 కోట్లకు పైగా ఆదాయం..
ప్రస్తుతం మారిన జీవన శైలి, ఆహారపు అలవాట్ల కారణంగా కొత్త కొత్త జబ్బులు వస్తున్నాయి. ఈ నేపథ్యంలో ప్రపంచమంతా ఆరోగ్యకరమైన ఆహారపు అలవాట్లపై జనానికి స్పృహ పెరిగింది. పిల్లలు తినే ఆహారం గురించి తల్లిదండ్రులు ఎప్పుడూ ఆందోళన చెందుతుంటారు. దీనికి పరిష్కారం కోసం ఆలోచించిన ఓ స్విమ్మింగ్ చాంపియన్ ఓ కంపెనీ పెట్టి పిల్లలకు మంచి ఆహారం అందిస్తోంది... మంచి లాభాలూ ఆర్జిస్తోంది. ఇదీ చదవండి: Pepsi New Logo: పెప్సీ కొత్త లోగో అదుర్స్! 15 ఏళ్ల తర్వాత... కూతురు కోసం చేసిన ప్రయత్నం.. పుణెకు చెందిన మేఘనా నారాయణ్‌కు పిల్లల పోషణ, ఆరోగ్యం పట్ల మక్కువ ఎక్కువ. పిల్లల్లో పోషకాహార లోపాన్ని నివారించడంపైనే ఆమె ఆలోచనలు ఎప్పుడూ ఉండేవి. ఈ నేపథ్యంలో శౌరవి మాలిక్, ఉమంగ్ భట్టాచార్య అనే మరో ఇద్దరితో కలిసి 2015లో పిల్లల కోసం ఆర్గానిక్ ఫుడ్ ఉత్పత్తులను అందించే హోల్సమ్ ఫుడ్స్ (స్లర్ప్ ఫార్మ్ అండ్ మిల్లె) అనే కంపెనీని స్థాపించారు. తన పాపాయికి ఆరోగ్యకరమైన, రుచికరమైన ఆహారాన్ని అందించడానికి ఆమె చేసిన ప్రయత్నాలే ఆమెను ఈ వ్యాపారం ప్రారంభించేలా చేశాయి. స్లర్ప్ ఫామ్ ప్రారంభించే ముందు మేఘనా మెకన్సీ అండ్ కంపెనీలో పబ్లిక్ హెల్త్ ప్రాక్టీస్‌కు నాయకత్వం వహించారు. స్లర్ప్ ఫార్మ్ సంస్థలో ప్రముఖ బాలివుడ్ నటి అనుష్క శర్మ కూడా పెట్టుబడి పెట్టడం విశేషం. ఈ సంస్థ 2022 ఫిబ్రవరి నాటికి రూ. 57 కోట్లకు పైగా ఆదాయాన్ని ఆర్జించింది. ఇదీ చదవండి: Charges on UPI: యూపీఐ చెల్లింపులపై అదనపు చార్జీలు.. యూజర్లకు వర్తిస్తాయా? స్విమ్మింగ్‌లో చాంపియన్ మేఘనా నారాయణ్ అంతర్జాతీయ స్విమ్మింగ్ ఛాంపియన్. ఆమె 400 బంగారు పతకాలను గెలుచుకుంది. మేఘన ఎనిమిదేళ్ల పాటు భారత్‌కు ప్రాతినిధ్యం వహించారు. ఆసియా క్రీడలు సహా అనేక పోటీల్లో ఆమె పాల్గొని పతకాలు సాధించారు. ఒలింపిక్ క్రీడల్లో దేశానికి బంగారు పతకం సాధించాలనేది ఆమె కల. మేఘన విద్యాభ్యాసం మేఘన బెంగళూరు యూనివర్సిటీ నుంచి కంప్యూటర్ సైన్స్ అండ్ ఇంజనీరింగ్‌లో బీఈ పూర్తి చేశారు. ఆ తర్వాత 2002లో ఆక్స్‌ఫర్డ్‌లోని ఓరియల్ కాలేజీకి రోడ్స్ స్కాలర్‌గా కంప్యూటర్ సైన్స్‌లో మాస్టర్స్ చదవడానికి వెళ్లారు. 2007లో ఆమె హార్వర్డ్ బిజినెస్ స్కూల్ నుంచి ఎంబీఏ పట్టా అందుకున్నారు. ఇదీ చదవండి: పేటీఎం యూజర్లకు గుడ్‌న్యూస్.. పేటీఎం వ్యాలెట్ నుంచి ఏ మర్చంట్‌కైనా చెల్లింపులు -
ఎన్నికల ముందు బీజేపీకి షాక్..!
అహ్మదాబాద్: గుజరాత్ అసెంబ్లీ ఎన్నికలకు షెడ్యూల్ ప్రకటించిన నేపథ్యంలో రాష్ట్ర రాజకీయాలు వేడెక్కాయి. ఎన్నికల సమయం దగ్గరపడుతున్న క్రమంలో అధికార బీజేపీకి మాజీ మంత్రి జయనారాయణ్ వ్యాస్ షాకిచ్చారు. ఆ పార్టీ ప్రాథమిక సభ్యత్వానికి శనివారం రాజీనామా చేశారు. అయితే, ఆయన ఏపార్టీలో చేరతారనే విషయాన్ని వెల్లడించలేదు. కాంగ్రెస్‌లో చేరతారనే వాదనలు బలంగా వినిపిస్తున్నా.. మరోవైపు ఆప్ వైపు సైతం మొగ్గు చూపుతున్నట్లు తెలుస్తోంది. తన రాజీనామా లేఖను బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు సీఆర్ పాటిల్‌కు పంపించారు మాజీ మంత్రి. ‘నేను బీజేపీతో విసిగిపోయాను, అందుకే ఆ పార్టీకి రాజీనామా చేశాను. గుజరాత్ అసెంబ్లీ ఎన్నికల్లో సద్ధాపుర్ నియోజకవర్గం నుంచి పోటీ చేస్తాను. ఏ పార్టీలో చేరటమనేది ఇంకా నిర్ణయం తీసుకోలేదు. వ్యక్తిగత కారణాలతోనే బీజేపీని వీడుతున్నాను.’ అని వ్యాస్ పేర్కొన్నారు. 75ఏళ్ల వ్యాస్ ఇటీవల కాంగ్రెస్ మాజీ అధ్యక్షురాలు సోనియా గాంధీ, రాజస్థాన్ ముఖ్యమంత్రి అశోక్ గెహ్లత్, కాంగ్రెస్ గుజరాత్ ఎన్నికల పరిశీలకులతో వరుసగా సమావేశమయ్యారు. దీంతో ఆయన హస్తం పార్టీలో చేరే అవకాశముందని ప్రచారం జోరందుకుంది. ఈ క్రమంలోనే కాంగ్రెస్ పెద్దలతో వ్యాస్ మంతనాలు జరుపుతున్నట్లు హస్తం పార్టీ నేత ఒకరు పేర్కొనటం ఆ వాదనలకు బలం చేకూర్చుతోంది. 2007లో నరేంద్రమోదీ గుజరాత్ ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడు వ్యాస్ రాష్ట్ర ఆరోగ్య శాఖ సహాయ మంత్రిగా పనిచేశారు. ఆ తర్వాత 2012, 2017లో జరిగిన అసెంబ్లీ ఎన్నికల్లో వరుసగా ఓడిపోయారు. రాబోయే ఎన్నికల్లో కాషాయ పార్టీ ఆయనకు టికెట్ ఇవ్వకూడదని నిర్ణయించింది. ఈ నేపథ్యంలో మనస్తాపానికి గురైన వ్యాస్.. పార్టీకి రాజీనామా చేసినట్లు తెలుస్తోంది.మరోవైపు.. ఆయనను పార్టీలోకి తీసుకొచ్చేందుకు ఆమ్ ఆద్మీ పార్టీ సైతం మంతనాలు చేస్తున్నట్లు పార్టీ వర్గాలు పేర్కొన్నాయి. ఇదీ చదవండి: ‘మిస్టర్ కేజ్రీవాల్ మీ దృష్టిలో నేను దొంగనైతే.. మరి మీరేంటి?’ -
సార్.. సార్.. ప్లీజ్
‘సార్.. సార్.. ప్లీజ్ ఎన్నికల్లో మేం మీ గెలుపు కోసమే బాగా పనిచేశాం. మా డివిజన్లో మీకు మెజార్టీ వచ్చింది. మేం తెలుగుదేశంలో ఉన్నా మీరంటే మాకు ఎంతో అభిమానం. దయచేసి మమ్మల్ని మీ పార్టీలోకి తీసుకోండి. ఒకవేళ కుదరకపోతే మమ్మల్ని మీ మనుషులుగా భావించి జాగ్రత్తగా చూసుకోండి. మాకు కార్పొరేషన్లో రావాల్సిన బిల్లులు ఇప్పించండి సార్.’ ఇది తెలుగుదేశం పార్టీ కార్పొరేటర్లు అధికార పార్టీ ప్రజాప్రతినిధులకు నిత్యం చేస్తున్న విన్నపం. వారం రోజులుగా టీడీపీ కార్పొరేటర్లు నెల్లూరు సిటీ, రూరల్ ఎమ్మెల్యేలతో పాటు ఎంపీ కార్యాలయాల చుట్టూ ప్రదక్షిణలు చేయడంతో పాటు వారిని కలిసేందుకు విశ్వప్రయత్నాలు చేస్తుండడం నెల్లూరు నగర రాజకీయాల్లో తీవ్ర చర్చనీయాంశంగా మారింది. సాక్షి ప్రతినిధి, నెల్లూరు: గత నెల వరకు అధికార పార్టీ కార్పొరేటర్లుగా చలామణి అయిన ఎక్కువ మంది కార్పొరేటర్లు మాజీ మంత్రి నారాయణ సిఫార్సుతో వారి డివిజన్లలో సబ్ కాంట్రాక్టులు తీసుకుని భారీగా పనులు చేశారు. ప్రతి డివిజన్‌లోనూ సబ్ కాంట్రాక్టల ద్వారా సుమారు రూ.5 కోట్ల నుంచి రూ.10 కోట్ల పనులు చేసిన కార్పొరేటర్లు ఉన్నారు. ప్రభుత్వం మనదే కదా మనల్ని ఎవరు అడగరనే ధీమాతో 80 శాతానికి పైగా నాసిరకం పనులు నిర్వహించారు. అలాగే ఎన్నికల కోడ్ ముందు నెలలోనూ భారీగా వర్కులు తీసుకున్న కార్పొరేటర్లు కూడా ఉన్నారు. ఇప్పుడు వారందరి బిల్లులు నగర పాలక సంస్థ ఖజానా ఖాళీగా ఉండడం, ఇతర కారణాలతో నిలిచిపోయాయి. నగరంలో కార్పొరేటర్లు నిర్వహించిన పనులకు సంబంధించి రావాల్సిన బిల్లులు సుమారు రూ.50 కోట్ల వరకు ఉన్నాయి. ఈ క్రమంలో వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ రాష్ట్రంలో ఆఖండ మెజార్టీతో గెలిచి, వైఎస్ జగన్మోహన్రెడ్డి ముఖ్యమంత్రిగా బాధ్యతలు స్వీకరించారు. ఈ క్రమంలో జిల్లాలో పదికి పది అసెంబ్లీ స్థానాలు, రెండు పార్లమెంట్ స్థానాల్లో వైఎస్సార్సీపీ అభ్యర్థులు రికార్డు స్థాయి మెజార్టీతో ఘన విజయం సాధించారు. నెల్లూరు నగరం, నెల్లూరు రూరల్ నుంచి సిట్టింగ్ ఎమ్మెల్యేలుగా ఉన్న డాక్టర్ పోలుబోయిన అనిల్‌కుమార్ యాదవ్. కోటంరెడ్డి శ్రీధరరెడ్డి రెండో పర్యాయం గెలపొంది అధికార పార్టీ శాసనసభ్యులు అయ్యారు. అలాగే నెల్లూరు ఎంపీగా ఆదాల ప్రభాకర్‌రెడ్డి గెలుపొందారు. దీంతో తెలుగుదేశం పార్టీ కార్పొరేటర్లు కౌంటింగ్ ముగిసిన రోజు నుంచి ఎమ్మెల్యేలకు టచ్‌లోకి వెళ్లేందుకు బలంగా ప్రయత్నాలు ముమ్మరం చేశారు. గత 23వ తేదీ రాత్రి నుంచి తెలుగుదేశం పార్టీ కార్పొరేటర్ల కార్యాచరణ మొదలైంది. మొదటగా నేరుగా ఎమ్మెల్యేను కలవడానికి ప్రయత్నించి కొందరు విఫలం అయిన క్రమంలో రకరకాల సిఫార్సులతో రంగంలోకి దిగారు. సామాజిక కోణం మొదలుకుని పాత స్నేహలు అంటూ కొందరు మాట కలిపే యత్నాలు చేశారు. ఈ క్రమంలో ఇద్దరు ఎమ్మెల్యేలు, ఎంపీ అంటీముట్టనట్లు వ్యవహరిస్తున్న క్రమంలో ఎమ్మెల్యేలు, ఎంపీ ముఖ్యుల వద్దకు కార్పొరేటర్లు క్యూ కడుతున్నారు. ప్రధానంగా 80 శాతం మంది తెలుగుదేశం పార్టీ కార్పొరేటర్లకు పనులకు సంబంధించిన బిల్లుల రావాల్సింది. ఈ క్రమంలో పార్టీలో చేరికకు ఎమ్మెల్యేలు, ఎంపీ పూర్తిగా మాట్లాడని క్రమంలో కనీసం బిల్లులు ఇప్పించాలని కొందరు ప్రయత్నాలు చేస్తున్నారు. ఐదుగురు కార్పొరేటర్లు ఎమ్మెల్యేను కలిసే యత్నం ఇక నెల్లూరు నగరంలో ఐదుగురు కార్పొరేటర్లు ఎమ్మెల్యేను కలిసే యత్నం చేసి పార్టీ ఫ్లోర్ లీడర్ పి.రూప్‌కుమార్ యాదవ్‌ను కలిసే ప్రయత్నం చేస్తున్నారు. ఇక నెల్లూరు రూరల్‌లో అయితే ఇద్దరు కార్పొరేటర్లు మినహా మిగిలిన వారందరు ఎమ్మెల్యే కార్యాలయం వద్దకు వచ్చి వెళుతుండడం, ఎమ్మెల్యే పూర్తి స్థాయిలో స్పందించకపోవడంతో పార్టీ నేతలు బిరదవోలు శ్రీకాంత్‌రెడ్డి, తాటి వెంకటేశ్వర్లు, మురళీకృష్ణను కలిసేందుకు ప్రయత్నాలు ముమ్మరం చేస్తున్నారు. ఇక ఎంపీ కార్యాలయం వద్ద అయితే పార్టీ సీనియర్ నేత వైవీ రామిరెడ్డిని కలిసే ప్రయత్నాలు చేస్తున్నారు. మొత్తం మీద టీడీపీ కార్పొరేటర్లు అందరూ క్యూ కడుతున్న క్రమంలో ప్రజాప్రతినిధులు మౌనం వహిస్తుండటం వారిలో టెన్షన్ పెరుగుతోంది. ఈ పరిణామాలు అన్నీ చూస్తున్న తెలుగుదేశం పార్టీ నేతలే అవాక్కవుతున్నారు. -
50పైసల నుంచి రోజుకు 2లక్షల ఆదాయం వరకు!
‘చాలెంజ్’ సినిమాలో చిరంజీవిపది పైసలతో జీవితాన్ని స్టార్ట్ చేస్తాడు.‘శివాజీ’ సినిమాలో రజనీకాంత్ వన్ రుపీతో లైఫ్‌ని ప్రారంభిస్తాడు.సవాల్‌గా తీసుకుంటారు ఇద్దరూ.సక్సెస్ అవుతారు. సేమ్.. వాళ్ల లాగే పట్రీషా యాభై పైసలతో జీవితాన్ని సవాల్‌గా తీసుకుని సక్సెస్ సాధించింది. పద్నాలుగు రెస్టారెంట్లతో... రోజుకిప్పుడు రెండు లక్షలు సంపాదిస్తోంది! పట్రీషా నారాయణ్.. చెన్నైలోని ‘సందీపా’ చైన్ ఆఫ్ రెస్టారెంట్స్ యజమాని. ఉండటానికి విలాసవంతమైన అపార్ట్మెంట్, అంతే లగ్జూరియస్ కారు, రెండువందల పైచిలుకు ఉద్యోగులకు బాస్! ఇక 2010 ‘ఫిక్కీ ఉమన్ ఎంట్రప్రెన్యూర్’ అవార్డీ అన్నది పాత సంగతే. అయితే పట్రీషాకు ఇవన్నీ వారసత్వంతో రాలేదు. ఆమె జీవితం వడ్డించిన విస్తరీ కాదు. అంతా రెక్కల కష్టం. పట్రీషా పుట్టి పెరిగింది చెన్నైలో. తండ్రి పోస్టల్ డిపార్ట్మెంట్లో, తల్లి టెలిఫోన్స్ డిపార్ట్మెంట్లో పని చేసేవారు. పట్రీషాకు ఇద్దరు తోబుట్టువులు. ఆమే తొలి సంతానం. ఇంటర్ ఫస్టియర్‌లో ఉండగా తనకన్నా పదమూడేళ్లు పెద్దవాడైన నారాయణ్‌తో పరిచయమైంది. ప్రేమగా మారింది. రహస్యంగా పెళ్లీ జరిగింది. నిజానికి ఇంటర్ అయ్యాక తల్లిదండ్రులతో చెప్పి తమ పెళ్లికి వాళ్ల అంగీకారం తీసుకోవాలనుకుంది పట్రీషా. కాని నారాయణ్ వద్దన్నాడు. వెంటనే తనతో వచ్చేయమంటూ ఆమెను ఒత్తిడి చేశాడు. పట్రీషా ఎంత నచ్చ జెప్పినా వినకపోగా ‘‘నువ్వు రాకపోతే నేనే మీ ఇంటికి వచ్చి మీవాళ్లకు అంతా చెప్పేస్తాను’’ అంటూ బెదిరించాడు. భయపడ్డ పట్రీషా ఓ రోజు ఇంట్లో చెప్పేసింది తను పెళ్లి చేసుకుందని. మండిపడ్డ ఆమె తండ్రి పట్రీషాను ఇంట్లోంచి గెంటేశాడు. అన్నానగర్‌లో కాపురం పెట్టారు పట్రీషా, నారాయణ్. కలిసి ఉంటున్నకొద్దీ నారాయణ్‌లోని దుర్గుణాలు బయటపడసాగాయి. బద్దకం. పనిచేయడు. పైపెచ్చు మందు, సిగరెట్లు. నచ్చిన వ్యక్తి భర్తగా దొరికాడన్న సంతోషం లేకుండానే దాంపత్యం సాగుతోంది. ఇద్దరు పిల్లలూ పుట్టారు. నారాయణ్‌లో ఏ మాత్రం మంచి మార్పులేదు సరికదా.. మరింత దిగజారాడు. పట్రీషాను కొట్టడమూ మొదలు పెట్టాడు. వేరే దారి లేక అభిమానం చంపుకొని పుట్టింటికి వెళ్లింది. మొదట తండ్రి మండిపడ్డా.. కూతురి పరిస్థితి చూసి చలించిపోయాడు. ఇద్దరు పిల్లలతో ఉన్న బిడ్డను ఇంట్లోకి రానిచ్చాడు. నారాయణ్‌కు దూరంగా ఉండమని హెచ్చరించాడు. తలూపింది పట్రీషా. పికిల్స్ అండ్ జామ్స్ తల్లి, తండ్రి ప్రభుత్వోద్యోగస్తులు కావడంతో వారికి చేసి పెట్టడానికి చిన్నప్పుడే వంట నేర్చుకుంది పట్రీషా. కుకింగ్ అంటే ఆసక్తి కూడా. అందుకే ఖాళీగా కూర్చోకుండా పచ్చళ్లు, జామ్స్ తయారు చేసి బాటిళ్లలో పెట్టి తల్లితో ఆమె ఆఫీస్‌కి పంపించడం మొదలుపెట్టింది. అన్నీ అమ్ముడుపోవడమే కాక మూడు రోజులకే మళ్లీ డిమాండ్ కూడా వచ్చింది ఇంకా కావాలని. అలా పచ్చళ్లు, జామ్స్ తయారు చేసే వ్యాపకాన్ని వ్యాపారంగా మార్చుకుంది పట్రీషా. బీచ్‌లో టీ బండి పట్రీషా తండ్రి స్నేహితుడు ‘డిఫరెంట్లీ ఏబుల్డ్’ పీపుల్ కోసం ఓ సంస్థను నిర్వహిస్తున్నాడు. వాళ్లకు ఓ ఉపాధి చూపించాలని టీ, టిఫిన్ బళ్లను తెప్పించాడు. పట్రీషా స్థితి తెలుసుకొని తన దగ్గరున్న ఇద్దరికి ఉపాధి ఇప్పిస్తే ఓ బండి ఇస్తానని చెప్పాడు. ఒప్పుకుంది ఆమె. వెంటనే వాళ్లిద్దరికీ టీ, కాఫీ పెట్టడం, వాటిని సర్వ్ చేయడం నేర్పింది. బండి తీసుకొని మెరీనా బీచ్‌లో పెట్టుకుంది. మొదటి రోజు కేవలం ఒకే ఒక్క టీ అమ్మగలిగింది. ఆరోజు సంపాదన యాభై పైసలు. నిరాశతో ఇంటికెళ్లింది. వ్యాపారం చేయడం తన వల్ల కాదని తల్లికి చెప్పి ఏడ్చింది. ‘‘ఒక్క టీ అమ్ముడు పోవడాన్ని నువ్వు ఫెయిల్యూర్ అనుకుంటున్నావ్. అది నేను నీ సక్సెస్ అనుకుంటున్నా. జీరోతో రాకుండా యాభై పైసలు సంపాదించావు’’ అంటూ కూతురిలో ఉత్సాహాన్ని నింపింది. ఆ ఆశనే పెట్టుబడిగా పెట్టింది పట్రీషా. తెల్లవారికి సమోసా వంటి స్నాక్స్‌నూ బండీలో పెట్టింది టీ, కాఫీలతోపాటు. ఆశ్చర్యం ఆ రోజు ఆమె సంపాదన ఏడువందల రూపాయలు. ఇలా 1982 నుంచి 2003 వరకు సాగింది. తొలినాళ్లలో మధ్యాహ్నం మూడు నుంచి రాత్రి పదకొండు వరకూ ఉండేది. ఆ తర్వాత మెరీనాబీచ్‌లో వాకర్స్ కోసం ఉదయం అయిదు గంటలకే ఓపెన్ చేసి తొమ్మిదింటి వరకూ బిజీగా ఉండేది. రోజుకి ఏడువందల రూపాయల నుంచి 25 వేలు ఆర్జించే వరకు వెళ్లింది ఆదాయం. బంద్ రోజుల్లో కూడా. కోలుకోలేని విషాదం పట్రీషా వంట రుచి ఆ నోటా ఈ నోటా బ్యాంక్ ఆఫ్ మధుౖరై ఉద్యోగుల దాకా వెళ్లింది. బ్యాంక్‌లో క్యాంటీన్ నిర్వహించడానికి ఆమెకు ఆఫర్ అందింది. మూడు వందల మందికి వండి వడ్డించాలి. తర్వాత నేషనల్ పోర్ట్ మేనేజ్మెంట్ ట్రైనింగ్ స్కూల్లోని ఏడువందల మంది స్టూడెంట్స్ కోసం వంట చేసే అవకాశం వచ్చింది. చేసింది. మేనేజ్మెంట్కు నచ్చింది. ఉండటానికి క్వార్టర్ కూడా ఇచ్చారు. అక్కడ ఆమె మొదటి నెల అందుకున్న జీతం ఎనభై వేలు (1998లో). తర్వాత అది కొద్దికాలానికే లక్ష రూపాయలకు చేరింది. కొంతకాలానికే సంగీతా రెస్టారెంట్ గ్రూప్ ఒక యూనిట్లో పార్ట్నర్షిప్ ఆఫర్ చేసింది. అప్పటికే పిల్లలు పెద్దవాళ్లైపోయారు. కూతురు పెళ్లి చేసేసింది. కొడుకు ప్రవీణ్ రాజ్‌కుమార్ తల్లికి చేదోడువాదోడుగా ఉంటున్నాడు. సంగీతా రెస్టారెంట్లో పార్ట్నర్షిప్ ఆఫర్ కన్నా సొంతంగా రెస్టారెంట్ స్టార్ట్ చేద్దామనే ఆలోచనను తల్లి ముందు పెట్టాడు ప్రవీణ్. పట్రీషాకూ సబబే అనిపించింది. ఆ ఏర్పాట్లలో ఉండగా కుటుంబం కుప్పకూలే సంఘటన! కూతురు, అల్లుడు కారు యాక్సిడెంట్లో చనిపోయారు. పట్రీషా చాన్నాళ్ల దాకా మనిషి కాలేకపోయింది. రెస్టారెంట్ పనంతా ప్రవీణే చూసుకున్నాడు. ఎట్టకేలకు 2006లో ‘సందీపా’ రెస్టారెంట్‌ను ప్రారంభించారు. అప్పటికీ పట్రీషా ఇంకా షాక్‌లోనే ఉంది. అందుకే మొత్తం బాధ్యతలు తీసుకోకుండా.. కొడుకుకి సహాయంగా మాత్రమే ఉంది కొన్నాళ్ల దాకా. కూతురు, అల్లుడు చనిపోయినప్పుడు డెడ్‌బాడీస్ తీసుకురావడానికి ఒక్క అంబులెన్సూ ముందుకు రాలేదు. చనిపోయిన వార్త కన్నా అంబులెన్స్ బాధ్యతా రాహిత్యం ఆమెను ఎక్కువ కలచివేసింది. అందుకే రెస్టారెంట్ పెట్టిన కొన్నాళ్లకు ఓ అంబులెన్స్‌ను కొని రోడ్ యాక్సిడెంట్ బాధితులను ఆసుపత్రికి చేర్చే సేవనూ అందిస్తోంది పట్రీషా. ఈ ముప్పైఏళ్లలో..! ‘‘ఆత్మవిశ్వాసమే మనల్ని నడిపిస్తుంది. కష్టం లేకుండా ఫలితం రాదు. ఎదురు దెబ్బలే గమ్యానికి వారధి కడ్తాయి. గ్రహిస్తే గమ్యం చేరుకుని విజయం సాధిస్తాం’’ అంటుంది పట్రీషా. ఈ ముప్పైఏళ్లలో ఆమె నేర్చుకున్న సత్యం ఇదే. ఆమె ఫిలాసఫీ ఇదే. చెన్నైలో పట్రీషాకు ఇప్పుడు 14 అవుట్‌లెట్స్ ఉన్నాయి. ‘‘యాభై పైసల సంపాదన నుంచి రోజుకి రెండు లక్షల ఆదాయానికి చేరుకున్నాం. ఇది నా ఒక్కదాని కష్టం కాదు. నన్ను నమ్మి నాతోపాటు నడిచినవాళ్లందరి శ్రమ ఫలితం. కలెక్టివ్ విక్టరీ’’ అంటుంది పట్రీషా. – శరాది -
గంటా పర్మిషన్తో నారాయణ విద్యసంస్థల్లో పీజులు బాదుడే బాదుడు
-
దళితులకు దగ్గరి బంధువు కరుణానిధి
సాక్షి, న్యూఢిల్లీ : అన్నాదురై మరణంతో 1969లో ఎం. కరుణానిధికి తమిళనాడు ముఖ్యమంత్రి అయ్యే అవకాశం లభించింది. అప్పటి వరకు అన్నాదురై మంత్రి వర్గంలో హిందీ వ్యతిరేక, ఢిల్లీ వ్యతిరేక ఉద్యమాల స్ఫూర్తి కలిగిన వారు, విద్యావేత్తలు, వాక్ఛాతుర్యం కలిగిన వారు, యువకులు ఉండేవారు. ఆ తర్వాత 1969 నుంచి 1976 వరకు వరుసగా ముఖ్యమంత్రిగా ఉన్న కరుణానిధి తన మంత్రివర్గంలోకి, ముఖ్యంగా అధికార యంత్రాంగంలోకి ఈ రంగాలతోపాటు వెనకబడిన వర్గాలు, మరీ ఎక్కువ వెనకబడిన వర్గాల వారు, దళితులను తీసుకున్నారు. పాలనా వ్యవహారాల్లో కిందిస్థాయి పార్టీ కార్యకర్తలకు ప్రత్యక్ష భాగస్వామ్యం కల్పించారు. పంచాయతీ స్థాయి, జిల్లా స్థాయి పార్టీ నాయకులు, కార్యకర్తలు ఎప్పటికప్పుడు ప్రజల సమస్యలను తెలుసుకొని వాటిని సంబంధిత అధికారుల దృష్టికి తీసుకెళ్లాలి. వాటి పరిష్కారం కోసం కృషి చేయాలి. ప్రజా సమస్యల పరిష్కార సలహా కమిటీల్లో అధికారులతోపాటు పార్టీ నాయకులకు కూడా కరుణానిధి ప్రభుత్వం అవకాశం కల్పించింది. అధికారులుగానీ, పార్టీ నాయకులుగానీ అవినీతికి పాల్పడకుండా ఈ సలహా సంఘాలు పర్యవేక్షణ సంస్థలుగా పనిచేసేవి. 1969 నుంచి 1976 మధ్య తమిళనాడు పబ్లిక్ కమిషన్ సర్వీస్ నియామకాల తీరును పరిశీలించగా, అంతకుముందు ఎన్నడు లేని విధంగా వెనకబడిన వర్గాలు, బాగా వెనకబడిన వర్గాల వారు, దళితులు ఎక్కువ మంది ప్రభుత్వ ఉద్యోగాల్లోకి వచ్చారు. ముఖ్యంగా గ్రామీణ ప్రాంతాల వారికి ఉద్యోగాలు రావడం విశేషం. పోలీసులు, రెవెన్యూ అధికారుల్లో దళితులకు ఎక్కువ ఉద్యోగాలు లభించాయి. రాష్ట్రంలోని సామాజిక వర్గాలు, వాటి సంఖ్యా బలం, ఇప్పటికే ఉద్యోగాల్లో వారి ప్రాతినిధ్యం ఎంత ? అన్న అంశాలను పరిగణలోకి తీసుకొని ఏ వర్గం వారికి ఎన్ని ఉద్యోగాలో ముందుగా ఓ ప్రణాళికను రచించి దానికి అనుగుణంగా నియామక ప్రక్రియను పూర్తి చేయడం వల్ల వెనకబడిన వర్గాల వారికి, దళితులకు ప్రభుత్వ ఉద్యోగాల్లో ఎక్కువ అవకాశం లభించింది. రాష్ట్ర ప్రభుత్వ యంత్రాంగంలో అన్ని వర్గాల ప్రజలకు సరైన ప్రాతినిధ్యం కల్పించినప్పుడే సమాజంలో కూడా వారికి సరైన ప్రాతినిధ్యానికి బాటలు వేయవచ్చన్నది కరుణానిధి ఆచరించిన సిద్ధాంతం. దళితులకు, బీసీలకు సామాజిక హక్కులను సాకారం చేయాలంటూ 1925లో జరిగిన కాంచీపురం కాంగ్రెస్‌లో పెరియార్ రామస్వామి ఇచ్చిన పిలుపును స్ఫూర్తిగా తీసుకొనే వారి అభ్యున్నతికి కరుణానిధి ప్రాధాన్యత ఇచ్చినట్లు కనిపిస్తోంది. కరుణానిధి నాటి యంత్రాంగం గ్రామీణాభివృద్ధియే ప్రధాన లక్ష్యంగా పనిచేస్తూ పంచాయతీ స్థాయి, సమతి స్థాయి కార్యక్రమాలనే ఎక్కువగా అమలు చేసింది. బ్రిటీష్ కాలం నాటి నుంచి పరిపాలనారంగంలో కలెక్టర్లదే ప్రధాన పాత్ర. జిల్లా డీఎంకే నాయకులకు నేరుగా ఇటు జిల్లా కలెక్టర్లు, అటు పార్టీ అదిష్టాన నేతలతో నేరుగా మాట్లాడే అవకాశం ఉండేది. అందుకని రోజువారి పాలనా వ్యవహారాల్లో జిల్లా పార్టీ నాయకులు జోక్యం చేసుకునే వారు. గ్రామీణస్థాయి నుంచి వచ్చిన ఉద్యమం కారణంగా డిఎంకే బలపడడంతో దిగువ స్థాయిలో కూడా పార్టీకి ప్రాధాన్యత ఏర్పడింది. 1971లో జరిగిన ఎన్నికల్లో అత్యధిక మెజారిటీతో డీఎంకే ప్రభుత్వం మళ్లీ అధికారంలోకి వచ్చిన తర్వాత పార్టీ జిల్లా నాయకులు మరింతగా బలపడ్డారు. జిల్లా అభివృద్ధిలో కలెక్టర్‌తోపాటు జిల్లా డిఎంకే నాయకుడు ప్రత్యక్ష ప్రధాన పాత్రదారుడయ్యారు. ఇటు పార్టీది, అటు ప్రభుత్వ యంత్రాంగానిది ఒకటే లక్ష్యం. రాష్ట్రాభివృద్ధి. అందులోనూ అన్ని వర్గాల ప్రజలకు సమాన న్యాయం జరగడం. (గమనిక: ‘ది ద్రావిడియన్ ఇయర్స్’ పేరిట ఎస్. నారాయణ్ రాసిన పుస్తకంలోని కొన్ని అంశాలివి. నారాయణ్, కరుణానిధి ప్రభుత్వ యంత్రాంగంలో పనిచేయడమే కాకుండా ఆ తర్వాత వాజపేయి ప్రధానికి ఉన్నప్పుడు ఆయనకు ఆర్థిక సలహాదారుగా పనిచేశారు) -
తినే స్పూన్లను తయారుచేస్తా.. లోన్ ఇవ్వండి
-
స్పూన్‌తో తిందాం
‘తినే స్పూన్లను తయారుచేస్తాను. నాకు లోన్ ఇవ్వండి’ అని నారాయణ పీసపాటి బ్యాంకులను సంప్రదించినప్పుడు,బ్యాంకు మేనేజర్లు కూడాఆయన్ని తినేసేలా చూశారు. అయితే ఇక్రిశాట్లో సైంటిస్టుగా ఆయన పనితనం, అంతకుముందు బరోడాలో పన్నెండేళ్ల అనుభవం గురించి తెలిశాక ‘కుదరదు’ అని గట్టిగా చెప్పలేకపోయారు. కానీ.. ‘తినే స్పూన్లను కొనేదెవ్వరు? మీరు మా లోన్ తీర్చే మార్గం çసమీప భవిష్యత్తులో కనిపించడం లేదు’ అన్నారు. అలా.. ‘మీకు లోన్ ఇవ్వడం కుదరదు’ అనే అర్థాన్ని సున్నితంగా తెలియచేశారు. బ్యాంకు వాళ్లే కాదు నారాయణ్ భార్య ప్రజ్ఞా కేస్కర్ కూడా ‘ఏమిటిది ఫన్నీగా’ అని నవ్వేశారు. నిజానికి నారాయణ దశాబ్దాల పాటు చదివిన చదువుని, చూసిన సమాజాన్ని మేళవించి, మేధనంతా రంగరించి చేసిన పరిశోధన ఇది. అంతకంటే ఎక్కువగా తాను నమ్మిన సిద్ధాంతం. దానిని ఆచరణలో పెట్టడానికి ఎన్ని అడ్డంకులు వచ్చినా ప్రాజెక్టును వదిలేది లేదనుకున్నారు. ఆయన ఇక్రిశాట్ ఉద్యోగాన్ని వదిలింది కూడా ఈ ప్రాజెక్టు కోసమే, కొన్ని సంవత్సరాల పాటు పరిశోధించిన తర్వాత తనకు దొరికిన ఒక సొల్యూషన్ ఇది. సమాజానికి ఈ తినే స్పూన్లను అలవాటు చేయడం సైంటిస్టుగా తన బాధ్యత అనుకున్నారు. అందుకే చేతిలో ఉన్న డబ్బుతోపాటు ఉన్న ఇంటిని కూడా బ్యాంకులో తాకట్టు పెట్టి ‘బేకీస్ ఫుడ్స్ ప్రైవేట్ లిమిటెడ్’ పేరుతో 2010లో తినే స్పూన్లు, ఫోర్కులను తయారు చేసే యూనిట్‌ని స్థాపించారు. ఆ యూనిట్ నిర్వహణ బాధ్యత చూసుకుంటున్న ప్రజ్ఞా కేస్కర్ నారాయణ్ ఈ ఎనిమిదేళ్ల ప్రయాణాన్ని సాక్షితో పంచుకున్నారు. ప్లేటుంది.. స్పూన్ లేదు! ఇక్రిశాట్లో ఉన్నప్పటి నుంచి భూగర్భ జలాల పరిరక్షణ, నీటిని అనవసరంగా తోడేయడాన్ని నివారించడం, పర్యావరణ సమతుల్యతను కాపాడటం వంటి కోణాల్లో మా వారి పరిశోధనలు సాగాయి. ప్లాస్టిక్ స్పూన్ల వల్ల ఎంత గ్రీజ్ కడుపులోకి వెళ్తుందనే విషయాలను కూడా నిశితంగా పరిశోధించేవారు. వీటన్నింటినీ అరికట్టాలంటే ఎవరో ఒకరు ఒక ప్రయత్నమంటూ చేయాలి కదా. సమాజంలో ప్లాస్టిక్ వినియోగం పెరిగిందనేదొక్కటే మనకు కనిపిస్తోంది. ఇంకా లోతుల్లోకి తవ్వుతూ పోతే భయంకరమైన నిజాలు తెలిశాయి. ఒక ఫంక్షన్ జరిగితే భోజనాల తర్వాత ఆ ప్లేట్లు, స్పూన్లు చెత్త బుట్టల్లోకి చేరాలి కదా! ధర్మాకోల్ ప్లేట్లు మాత్రమే గార్బేజ్ బిన్లో కనిపిస్తాయి, ప్లాస్టిక్ స్పూన్లు చేరవు. ఒకరోజు మావారు ఐస్‌క్రీమ్ పార్లర్ ముందు రాత్రి ఎనిమిది నుంచి పదకొండు గంటల వరకు నిలబడి అక్కడేం జరుగుతోందో గమనించారు. పార్లర్ మూసేస్తూ పార్లర్ వాళ్లు డస్ట్‌బిన్‌ను బయట పెట్టి వెళ్లిపోయారు. ఆ బిన్లో కర్రపెట్టి కెలికి మరీ చూశారట నారాయణ! ఐస్‌క్రీమ్ కప్పులతోపాటు విరిగిన స్పూన్లు రెండు మూడు మాత్రమే ఉన్నాయి. కప్పులు ఉన్నన్ని స్పూన్లు ఉండాలి కదా, అలా లేవు. అంటే మిగతావి రీయూజ్ అవుతున్నాయన్నమాట! భోజనానికి ప్లేట్‌కి కనీసంగా ఐదు వందల రూపాయలు వసూలు చేసే హోటళ్ల నుంచి.. కప్పు ఐస్‌క్రీమ్‌కి రెండు వందలు వసూలు చేసే పార్లర్ల వరకు ప్లాస్టిక్ స్పూన్ల రీయూజ్ కి పాల్పడుతున్నాయి. వాటిని ఎలా వాడినా అనారోగ్యం తప్పదు. అంతకంటే ఘోరం ఏమిటంటే.. స్పూన్లు తయారు చేసే కంపెనీల్లో.. ప్యాకింగ్‌కి ముందు స్పూన్లను తుడిచే క్లాత్‌ను చూస్తే ‘ఇప్పటికి మన కడుపులోకి ఎంత గ్రీజ్ వెళ్లి ఉంటుందో’ ననే ఆలోచనతో కడుపు తిప్పినట్లవుతుంది. ఒక్కో స్పూన్‌కి ఉన్న గ్రీజ్‌ను తుడిచి, తుడిచి... రోజుకి వేలాది స్పూన్లను అదే క్లాత్‌తో తుడుస్తుంటారు. మావారు ఇవన్నీ నాకు చెబుతూ... జొన్న, గోధుమ, వరి పిండితో స్పూన్లు తయారు చేస్తే, భోజనం పూర్తయిన తర్వాత వాటిని కరకరా నమిలి తినేయవచ్చని, తినకుండా పారేసినా త్వరగా నేలలో కలిసిపోతుంది, పర్యావరణానికి హాని కలగదని వివరించారు. ఈ కాన్సెప్ట్‌ని ప్రమోట్ చేస్తే ప్లాస్టిక్‌తో గ్రీజును తినే దుస్థితి తప్పుతుంది, జొన్న పంటకు డిమాండ్ పెరుగుతుంది. జొన్నలు పండించే రైతులకు మంచి మార్కెట్ ఉంటే వాటినే ఎక్కువగా పండిస్తారని అని కూడా చెప్పారు. ఆయన వాదనతో నేను కన్విన్స్ అయ్యాను. కానీ ఉన్న పళంగా ఉద్యోగం మానేస్తే ఎలాగనే భయం కూడా ఉండింది. ఆయన అప్పటికే మానేసి పూర్తిగా ఇందులోనే మునిగిపోయారు. ఒకరి ఉద్యోగమైనా ఉంటే కొంత భరోసా ఉంటుందనిపించింది. నాలుగేళ్ల తర్వాత నేనూ మానేసి ఆయనతో పాటు యూనిట్ నిర్వహణ బాధ్యతను పంచుకున్నాను. స్పూన్లను మొదట మాన్యువల్‌గా చేశాం. సక్సెస్ అవుతుందనే నమ్మకం వచ్చిన తర్వాత మెషినరీతో చేస్తున్నాం. మూడు షిఫ్టులు పని చేస్తే రోజుకు పాతిక వేల స్పూన్లు చేయవచ్చు. పవర్ సప్లయ్‌లో ఇబ్బందులతో రెండు షిఫ్టులే చేస్తున్నాం. పిండి.. స్పూన్‌గా మారాలంటే.. పిండి కలిపి స్లైడర్ మీద పెడితే రొట్టెలా ప్రెస్ అయ్యి, స్లైడర్ మౌల్డ్‌లోకి వెళ్తుంది. మౌల్డ్‌లో స్పూన్ ఆకారంలో కట్ అయి, బేకింVŠ సెక్షన్లో బేక్ అవుతుంది. ఆ తర్వాత డీహైడ్రేట్ అవుతుంది. ఈ మొత్తం ప్రాసెస్‌కి ఇరవై నిమిషాలు పడుతుంది. పిండి కలపడం నుంచి మొదలు పెట్టి, బేకింగ్, డీహైడ్రేటింగ్, క్వాలిటీ చెకింగ్, ప్యాకింగ్ వరకు అన్ని దశలు పూర్తి కావడానికి రెండు గంటలు పడుతుంది. ఒకసారి రౌండ్‌కి వెయ్యి స్పూన్లు వస్తాయి. వెయ్యికి రెండు–మూడు ఓవర్ బేక్ అవుతుంటాయి. మధ్యలో కరెంట్ పోయిందంటే అంతా వృథా. కరెంట్ వచ్చాక మళ్లీ మెషీన్ వేడెక్కడానికే ఒకటిన్నర గంట పడుతుంది. ప్లెయిన్ స్పూన్లతోపాటు షుగర్, సాల్డ్, పెప్పర్, జీరా, వాము ఫ్లేవర్లలో చేస్తున్నాం. అదృష్టం ఏమిటంటే ఆర్డర్లు బాగా వస్తున్నాయి, మా మెషినరీ కెపాసిటీ ఇంత పెద్ద ఆర్డర్లను దృష్టిలో పెట్టుకుని రూపొందించింది కాదు. దాంతో సప్లయ్ లేటవుతోంది. ఫారిన్ ఆర్డర్స్ కూడా పెరుగుతున్నాయి. యూనిట్‌ని విస్తరించే ధైర్యం చేయలేకపోతున్నాం. మా ప్రోడక్ట్ మీద నమ్మకం కుదిరింది కాబట్టి ఇప్పుడు బ్యాంకులు లోన్ ఇస్తాయేమో కానీ, ఉన్న అప్పులు తీరకుండానే కొత్త అప్పు చేయడానికి మాకే భయంగా ఉంది. వ్యాపారం కోసం కాదు మేము ఈ తినే స్పూన్ల కాన్సెప్ట్‌ను మొదలు పెట్టింది... అనారోగ్యకరమైన అలవాట్లను మాన్పించి ఆరోగ్యకరమైన అలవాటు చేద్దామని మాత్రమే. మా ప్రయత్నంలో పాత్బ్రేకర్స్గా ఓ గుర్తింపును తెచ్చుకోగలిగాం. అయితే వ్యాపారంగా మార్చుకోవడం మాకు తెలియని పని. స్పూన్ తయారీ కంటే ప్యాకింగ్, ట్రాన్స్‌పోర్టుకే ఎక్కువ ఖర్చవుతోంది. ఆ ఖర్చులన్నీ స్పూన్ మీదనే మోపడం అనేది వ్యాపార సూత్రం, వ్యాపారం నిలబడాలంటే అలాగే చేయాలి కూడా. అలాగని ధర పెంచుతూ పోతే మా ఉద్దేశం నెరవేరదు. ప్లాస్టిక్ స్పూన్‌కి ప్రత్యామ్నాయంగా జొన్న పిండి స్పూన్లను వాడుకలోకి తేవడంలో విజయవంతం అయ్యాం. కానీ వీటి ధర పెరిగితే ఎవరూ వీటి వైపు చూడరు, కడుపులోకి గ్రీజ్ పోతే క్యాన్సర్ వస్తుందని తెలిసినా తక్కువ ధరలో దొరికే ప్లాస్టిక్ స్పూన్లకే మొగ్గుచూపుతారు. సమాజం అలా వెళ్లకుండా ఆరోగ్యకరమైన అలవాట్లకు దగ్గర చేయడమే మా లక్ష్యం. అంతర్లీనంగా రైతుల ప్రయోజనం కూడా ఇమిడి ఉంది. మాది వ్యాపారం కాదు, ఒక సోషల్ కాజ్ మాత్రమే. మా అమ్మాయి కెనడాలో మేథమెటీషియన్. తనకు ఈ రంగం మీద ఆసక్తి లేదు. ఇక మా ఇద్దరికీ ఇదే ప్రపంచం’’. పిండి స్పూన్ పాడవదు మచిలీపట్నంలో పుట్టి కోల్‌కతాలో పెరిగి బరోడాలో ఉద్యోగం చేసి హైదరాబాద్‌లో స్థిరపడ్డాను. జొన్నపిండి స్పూన్ల కాన్సెప్ట్‌ని డిజైన్ చేసుకున్నాకే పనిలోకి దిగాను. కానీ మెషినరీ కోసం ప్రయత్నించినప్పుడు కొత్త సంగతి తెలిసింది. ఇంత వరకు అలాంటి మెషీన్ అవసరం రాకపోవడంతో ఎవరూ డిజైన్ చేయలేదని! దాంతో మెషినరీ డిజైన్ కూడా మేమే చేయాల్సి వచ్చింది. జామ్‌బాగ్, మసాబ్ట్యాంకులు తిరిగి మౌల్డ్ మేకర్స్ దగ్గర కూర్చుని, చేత్తో చేసిన స్పూన్లను చూపించి నా ఐడియా వాళ్లకు అర్థమయ్యేలా వివరించాను. బ్యాంకు వాళ్లు చూసినట్లే వీళ్లూ వింతగా చూశారు. ఐదారు ప్రయత్నాలతో ఒకతడు ముందుకొచ్చాడు. ఎల్బి నగర్లో ఉన్న మా యూనిట్ ఇప్పుడు పూర్తిస్థాయి మెషినరీతో నడుస్తోంది. సమాజం మర్చిపోయిన జొన్నలు ఇతర చిరుధాన్యాలను తిరిగి తీసుకురావాలనేది నా ప్రధాన ఉద్దేశం. ఈ స్పూన్లను నూటికి నూరుశాతం సహజమైన ఉత్పత్తులతో తయారు చేస్తున్నాం, కాబట్టి వాటి కారణంగా ఏ విధమైన అనారోగ్యాలూ రావు. ఏ మాత్రం తేమ లేకుండా డీహైడ్రేట్ అవుతుంది కాబట్టి ఇవి పాడుకావు. – నారాయణ పీసపాటి, సైంటిస్ట్, బేకీస్ ఫుడ్స్ ప్రైవేట్ లిమిటెడ్ స్థాపకులు – వాకా మంజులారెడ్డి -
సీఎం పర్యటన సజావుగా సాగాలి
ఒంగోలు సబర్బన్: రాష్ట్ర ముఖ్యమంత్రి నారా చంద్రబాబునాయుడు శనివారం ప్రకాశం జిల్లా ఒంగోలులో పర్యటించనున్న సందర్భంగా శాంతిభద్రతలు, ప్రొటోకాల్ ప్రకారం ఏర్పాట్లు సజావుగా చేయాలని కలెక్టర్ వి.వినయ్‌చంద్ జిల్లా అధికారులను ఆదేశించారు. స్థానిక కలెక్టర్ క్యాంప్ కార్యాలయంలో శుక్రవారం జిల్లాస్థాయి అధికారులతో సీఎం పర్యటనపై ఆయన సమీక్షించారు. జాయింట్ కలెక్టర్ ఎస్.నాగలక్ష్మి, జేసీ–2 డి.మార్కండేయులు, డీఆర్ఓ వెంకటసుబ్బయ్యతో కలిసి అధికారులకు పలు సలహాలు, సూచనలు చేశారు. శనివారం మధ్యాహ్నం 2 గంటలకు ముఖ్యమంత్రి తన నివాసం నుంచి హెలిక్యాప్టర్‌లో బయలుదేరి 2.40 గంటలకు ఒంగోలులోని ఏబీఎం కళాశాలలో ఏర్పాటు చేసిన హెలిప్యాడ్‌కు చేరుకుంటారని వివరించారు. ఏబీఎం నుంచి 2.50 గంటలకు బస్సులో బయలుదేరి 3 గంటలకు మినీ స్టేడియంలోని ధర్మపోరాట దీక్ష సభాస్థలికి చేరుకుంటారన్నారు. అనంతరం సాయంత్రం 5.30 గంటలకు తిరిగి ముఖ్యమంత్రి వెళ్లిపోతారన్నారు. అందులో భాగంగా ఏబీఎం కళాశాలలో హెలిప్యాడ్ నిర్మాణం, ప్రముఖులు వేచి ఉండే విధంగా షామియానాలు, సీటింగ్, మంచినీరు, రిఫ్రెష్మెంట్లు, ముఖ్యమంత్రి కోసం తాత్కాలిక బయోటాయిలెట్, బారికేడింగ్, ఫైర్ టెండర్ ఏర్పాట్లు సజావుగా చేయాలని కలెక్టర్ ఆదేశించారు. కాన్వాయ్‌లో వైద్య నిపుణులు, రక్తనమూనాలు, వైద్య పరికరాలు, మందులు కలిగిన అంబులెన్స్‌ను అందుబాటులో ఉంచాలన్నారు. ముఖ్యమంత్రి కాన్వాయ్‌లోని ప్రతి వాహనంలో మంచినీరు, రిఫ్రెష్మెంట్లు ఏర్పాటు చేయాలని ఆదేశించారు. రిమ్స్ వైద్యశాలను పరిశుభ్రంగా ఉంచుకోవాలని సూచించారు. కాన్వాయ్ ప్రయాణించే మార్గంలో ఎక్కడా చెత్తాచెదారం లేకుండా చూడాలని నగరపాలక సంస్థ అధికారులను ఆదేశించారు. ముఖ్యమంత్రి తిరుగు ప్రయాణంలో సాయంత్రం వీధిదీపాలు, ముఖ్యంగా ఎల్ఈడీ బల్బులు సరిగా వెలుగుతున్నాయా..లేదా..? అన్నది పరిశీలించాలని సూచించారు. సమావేశంలో ఒంగోలు ఆర్డీఓ శ్రీనివాసరావు, డీఎంఅండ్‌హెచ్‌ఓ డాక్టర్ రాజ్యలక్ష్మి, ఎస్డీసీ నరిసింహులు, డీఆర్డీఏ, డ్వామా పీడీలు మురళి, వెంకటేశ్వర్లు, శింగయ్య, డీటీడబ్ల్యూ రాజ్యలక్ష్మి, డీటీసీ సీహెచ్‌వీకే సుబ్బారావు, రిమ్స్ డైరెక్టర్ మస్తాన్ సాహెబ్, స్టెప్ సీఈఓ రవి, ఎస్ఎస్ఏ పీఓ వెంకటేశ్వరరావు, మున్సిపల్ కమిషనర్ వెంకటకృష్ణ, పలు శాఖల అధికారులు పాల్గొన్నారు. ఏర్పాట్లు పూర్తి : మంత్రులు నారాయణ, శిద్దా సీఎం చంద్రబాబు పర్యటనకు అన్ని ఏర్పాట్లు పూర్తయినట్లు రాష్ట్ర మంత్రులు పొంగూరు నారాయణ, శిద్దా రాఘవరావు పేర్కొన్నారు. శుక్రవారం రాత్రి మినీ స్టేడియంలోని దీక్షా స్థలి వద్దకు వచ్చిన మంత్రులు.. ముఖ్యమంత్రి పర్యటనకు సంబంధించిన వివరాలను వెల్లడించారు. రాష్ట్రానికి కేంద్రం చేసిన అన్యాయంపై ముఖ్యమంత్రి చేస్తున్న దీక్షకు అన్ని సౌకర్యాలు కల్పించామన్నారు. జిల్లా నలుమూలల నుంచి వచ్చే ప్రజలు, టీడీపీ నాయకులు, కార్యకర్తలకు ఎలాంటి ఇబ్బందులు లేకుండా ఏర్పాట్లు చేశామన్నారు. వారి వెంట ఒంగోలు ఎమ్మెల్యే దామచర్ల జనార్దన్, కొమ్మూరి రవిచంద్ర, బాలాజీ తదితరులు ఉన్నారు. -
పచ్చదండు.. కొత్త పుండు
సాక్షి ప్రతినిధి, నెల్లూరు: తెలుగుదేశం పార్టీలో పదవుల లొల్లి తీవ్రరూపం దాల్చింది. నామినేటెడ్ పదవులను భర్తీ చేస్తామని ప్రభుత్వం ప్రకటించిన నేపథ్యంలో సరి కొత్త వివాదం మొదలైంది. ఇప్పటికే నివురుగప్పిన నిప్పులా అంతర్గతంగా సాగుతున్న వివాదాలు ఒక్కసారిగా భగ్గుమంటున్నాయి. పార్టీలో సీనియర్, జూనియర్ నేతల మధ్య విభేదాలు మొదలయ్యాయి. ఇతర పార్టీల నుంచి వచ్చిన వారికి అగ్రతాంబూలం ఇస్తున్న పార్టీ పెద్దలు.. దశాబ్దాలుగా పార్టీని నమ్ముకున్న వారికి మొండిచేయి చూపడంపై నిరసన వ్యక్తమవుతోంది. ఈ పరిణామాలన్నీ మంత్రులు నారాయణ వర్సెస్ సోమిరెడ్డిగా మారాయి. కాంగ్రెస్, ఇతర పార్టీల నుంచి వచ్చిన వారికి పార్టీతోపాటు నామినేటెడ్ పదవుల్లో కీలక ప్రాధాన్యత దక్కేలా మంత్రి నారాయణ చక్రం తిప్పుతుండటంపై సీనియర్లు ఫిర్యాదుల పరంపర మొదలుపెట్టారు. అసంతృప్తి జ్వాల ఇటీవల పార్టీ సీనియర్ నాయకులు కొందరు తమకు న్యాయం చేయాలని అధిష్టానాన్ని కోరడంతోపాటు జిల్లాలో కీలక మంత్రిగా ఉన్న పొంగూరు నారాయణపై ఫిర్యాదు చేశారు. పార్టీ ఫిరాయింపుదారులను మంత్రి నారాయణ పెద్దఎత్తున ప్రోత్సహిస్తూ చిన్నస్థాయి నామినేటెడ్ పదవులు మొదలుకొని పార్టీ పదవుల వరకు అన్నీ వారికే దక్కేలా చేస్తున్నారన్న విమర్శలు టీడీపీ శ్రేణుల నుంచి వెల్లువెత్తుతున్నాయి. ఈ వ్యవహారంపై సీనియర్లు కొందరు పార్టీ వేదికలపైనే అసంతృప్తి వ్యక్తం చేస్తున్నారు. మాజీ మంత్రులు బల్లి దుర్గాప్రసాద్, తాళ్లపాక రమేష్ రెడ్డి నేతల తీరుపై పూర్తి అసంతృప్తితో పార్టీకి దూరంగా ఉంటున్నారు. నామినేటెడ్ పదవి ఏదైనా కేటాయించాలని, కనీసం పార్టీ పదవైనా ఇవ్వాలని పలుమార్లు కోరినా అధిష్టానం పట్టించుకోకపోవడంతో ఇద్దరూ పార్టీ వ్యవహారాలకు దూరంగా ఉంటున్నారు. మరో సీనియర్ నేత మండవ రామయ్య, కొంతకాలం క్రితం వరకు ఆత్మకూరు ఇన్చార్జ్గా ఉన్న కన్నబాబు, నగరం నుంచి పార్టీలో కీలక బీసీ నేతగా, కార్పొరేషన్ ఫ్లోర్ లీడర్‌గా ఉన్న డాక్టర్ జెడ్.శివప్రసాద్, పార్టీ ఎస్సీ నేత ఎన్.శైలేంద్రబాబు నామినేటెడ్ పదవులు ఆశించి.. అమాత్యుల ద్వారా నామినేటెడ్ పదవుల కోసం ప్రయత్నాలు చేశారు. మంత్రులు న్యాయం చేస్తామని చెప్పడం మినహా పట్టించుకున్న దాఖలాలు లేవు. ముఖ్యంగా జెడ్పీ చైర్మన్ పదవికి వేనాటి రామచంద్రారెడ్డి, నగర మేయర్ పదవికి పోటీపడిన డాక్టర్ జెడ్.శివప్రసాద్ రూ.కోట్లు ఖర్చుచేసినా ఓటమి పాలయ్యారు. నామి నేటెడ్ పదవులు ఇవ్వడం ద్వారా ఇద్దరికీ న్యాయం చేస్తామని సీఎం చంద్రబాబు, లోకేష్ హామీ ఇచ్చారు. అనంతరం వారిని పట్టించుకున్న పాపాన పోలేదు. తాజాగా పార్టీ రాష్ట్ర కమిటీ, జిల్లా కమిటీ, అనుబంధ కమిటీల పదవులన్నీ భర్తీ అయ్యాయి. నామినేటెడ్‌కు సంబం ధించి కీలక పదవులన్నీ పూర్తయ్యాయి. మరికొన్ని నామినేటెడ్ పోస్టులు ఖరారై వారం రోజుల్లో ప్రకటించే అవకాశం ఉంది. వాటిలోనైనా తమకు చోటు కల్పించాలని నేతలు డిమాండ్ చేస్తుండగా.. వారి గోడు పట్టించుకునే పరిస్థితి అధిష్టానం వద్ద కనిపించడం లేదు. ఫిరాయింపులపై మండిపాటు ఇదిలావుంటే.. సీనియర్ నేతలంతా నారాయణ తీరుపై ఆగ్రహంతో ఉన్నారు. పెద్దఎత్తున పార్టీ ఫిరాయింపుదారులను ప్రోత్సహిస్తూ సీనియర్ నాయకులకు అన్యాయం చేస్తున్నారంటూ దుమ్మెత్తి పోస్తున్నారు. దీంతో మంత్రి నారాయణ నగరానికి చెందిన ఓ చారిటబుల్ ట్రస్ట్ నిర్వాహకురాలు, మెప్మా పర్యవేక్షణ కమిటీ సభ్యురాలితోపాటు ఎమ్మెల్సీ పదవికి పోటీచేసి ఓడిన నేతను సీఎం వద్దకు తీసుకెళ్లి నామినేటెడ్ పదవి కేటాయించాలని కోరినట్లు సమాచారం. సీఎం స్పందించకపోగా.. అసహనం వ్యక్తం చేసి ఇప్పటికే చాలా మందికి ఇచ్చానని చెప్పినట్లు ప్రచారం సాగుతోంది. గతంలో కాంగ్రెస్ పార్టీలో ఉన్న చాట్ల నరసింహారావు, మంత్రి నారాయణ ద్వారా టీడీపీలో చేరి ప్రభుత్వ ఆసుపత్రి అభివృద్ధి కమిటీ చైర్మన్ పదవి పొందారు. కాంగ్రెస్ నుంచి టీడీపీలోకి వచ్చిన ముప్పాళ్ల విజేత జిల్లా తెలుగు మహిళా అధ్యక్షురాలిగా నియమితులయ్యారు. ఆమె నియామకంతో సీనియర్ మహిళా నేతలంతా పార్టీ కార్యకలాపాలకు దూరంగా ఉంటూ మంత్రుల వద్ద ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. కాంగ్రెస్ నుంచి వచ్చిన కార్పొరేటర్ ఆనం రంగమయూర్‌రెడ్డికి జిల్లా తెలుగు యువత అధ్యక్ష పదవిని ఖరారు చేశారు. ఇదికూడా సీనియర్లకు మింగుడు పడటం లేదు. ఇలాంటి పరిస్థితుల్లో సీనియర్, జూనియర్ల వివాదం ముదిరి పాకానపడింది. -
‘ముద్రగడ పాదయాత్రకు మా మద్దతు’
పశ్చిమగోదావరి: కాపు ఉద్యమ నేత ముద్రగడ పాదయాత్రకు మేం మద్దతు ఇస్తున్నామని సీపీఐ జాతీయ కార్యదర్శి నారాయణ అన్నారు. ఎన్నికల మ్యానిఫెస్టోలో పెట్టిన హామీని అమలు చేయమని ముద్రగడ అడుగుతుంటే ప్రభుత్వానికి భయమేందుకని ఆయన అన్నారు. విలేకరుల సమావేశంలో మాట్లాడుతూ.. కేంద్ర ప్రభుత్వానికి చిత్తశుద్ధి ఉంటే పెట్రోల్ డీజిల్‌లను జీఎస్టీ పరిధిలోకి తీసుకురావాలని ఆయన పేర్కొన్నారు. ఇసుక, ల్యాండ్ మాఫియా గ్యాంగ్‌లను తెలుగు రాష్ట్రాల ప్రభుత్వాలు అడ్డుకోలేకపోతున్నాయన్నారు. కాపు రిజర్వేషన్ల కోసం ముద్రగడ పద్మనాభం చలో అమరావతి పాదయాత్రకు బయలుదేరితే పోలీసులు అడ్డుకున్నారు. నేటితో ముద్రగడ గృహ నిర్భంధం ముగిసిపోయింది. మరోసారి పాదయాత్రకు రెడీ అయినా ముద్రగడను ఇంటి వద్దనే పోలీసులు అడ్డుకున్న విషయం తెలిసిందే. ఇది నిరవధిక పాదయాత్ర... వాయిదా వేసేది లేదు. ఎట్టి పరిస్థితుల్లోనైనా పాదయాత్ర చేసి తీరుతానని ముద్రగడ స్పష్టం చేశారు. మరోవైపు ముద్రగడ నివాసం వద్ద పోలీసు బలగాలు భారీగా మోహరించాయి. -
నేడు హెచ్‌సీఏ ఎన్నికలు
హైదరాబాద్: హైదరాబాద్ క్రికెట్ అసోసియేషన్ (హెచ్‌సీఏ) ఎన్నికలకు రంగం సిద్ధమైంది. దిగువ కోర్టు ఇచ్చిన ఉత్తర్వులను సమర్థిస్తూ హైకోర్టు ఎన్నికల ప్రక్రియను కొనసాగించాలని ఆదేశించింది. దాంతో నేడు (మంగళవారం) ఉప్పల్ స్టేడియంలో ఎన్నికలు నిర్వహిస్తారు. అధ్యక్ష పదవికి జి.వివేకానంద్, విద్యుత్ జైసింహ పోటీ పడుతుండగా, కార్యదర్శిగా శేష్ నారాయణ్ ఏకగ్రీవంగా ఎన్నిక కానున్నారు. మరోవైపు తన నామినేషన్ తిరస్కరణపై హైకోర్టుకు వెళ్లిన వంకా ప్రతాప్‌కు అనుకూలంగా తీర్పు వచ్చింది. ఆయన సంయుక్త కార్యదర్శి పదవికి ఇచ్చిన నామినేషన్‌ను స్వీకరించాలని కోర్టు ఆదేశించింది. మొత్తం ఎన్నికల ప్రక్రియను ప్రశ్నిస్తూ నరేశ్ శర్మ కోర్టును ఆశ్రయించగా... దీనిపై రెండు రోజుల్లో వివరణ ఇవ్వాలంటూ రిటర్నింగ్ అధికారిని కూడా హైకోర్టు ఆదేశించింది. మరోవైపు లోధా సిఫారసుల అమలుకు సంబంధించి మరింత స్పష్టత కోరుతూ హైదరాబాద్, తమిళనాడు, గోవా, మధ్యప్రదేశ్ క్రికెట్ సంఘాలు సుప్రీంకోర్టులో పిటిషన్ దాఖలు చేశాయి. -
ఓట్లు కొని చండీయాగాన్ని అవమానించారు
► కేసీఆర్‌పై నారాయణ ధ్వజం సాక్షి, హైదరాబాద్: స్థానిక సంస్థల ఎమ్మెల్సీ ఎన్నికల్లో హోల్‌సేల్‌గా ఓట్లను కొని సీఎం కేసీఆర్ చండీయాగాన్ని, ప్రజాస్వామ్యాన్ని, రాజకీయాలను అవమానించారని సీపీఐ సీనియర్ నేత కె.నారాయణ ధ్వజమెత్తారు. ఒకవైపు మహత్తర చండీయాగం చేస్తూ నిజాయితీగా ఉండకుండా, మరోవైపు ఎమ్మెల్సీ ఎన్నికల్లో టీఆర్ఎస్కు తగిన బలం లేకపోయినా స్థానిక ప్రజాప్రతినిధులను లోబరుచుకుని సీట్లను గెలుచుకున్నారని మండిపడ్డారు. శనివారం మఖ్దూంభవన్‌లో రాష్ట్ర పార్టీ కార్యదర్శి చాడ వెంకటరెడ్డితో కలసి మీడియాతో మాట్లాడారు. టీఆర్ఎస్కు పరిమితంగా 4 సీట్లే ఉన్నా ఖమ్మం జిల్లా ఎమ్మెల్సీ సీటును గెలుచుకోవడం ఇందుకు తార్కాణమన్నారు. ఇది చండీయాగ ప్రభావం అనుకోవాలా అని ప్రశ్నించారు. ప్రజాస్వామ్యానికి మాత్రం ఇది తీరని అవమానమని వ్యాఖ్యానించారు. కొత్త ఏడాది సందర్భంగా పార్టీ ఫ్యామిలీ గెట్ టు గెదర్‌లో పిల్లలు, పెద్దలతో కలసి తాను డాన్స్ చేయడాన్ని నారాయణ సమర్థించుకున్నారు. ఆటపాటలు, సాంస్కృతిక కార్యక్రమాలు సందేశాత్మకంగా, ఆరోగ్యవంతంగా ఉండాలి తప్ప బూతుగా ఉండకూడదన్నారు. దూరదర్శన్‌లో ఎన్నికల ప్రచారానికి అన్నిపార్టీల నాయకులను అనుమతి ఇస్తున్నట్లుగానే అన్ని ప్రైవేట్ టీవీ చానళ్లు, రేడియోల్లోనూ అనుమతించాలన్నారు. పార్టీ ఫిరాయింపులను ప్రభుత్వం ప్రోత్సహిస్తోందని చాడ వెంకటరెడ్డి ఆరోపించారు. సాక్షాత్తు సచివాలయంలోనే ఇతర పార్టీల నాయకులకు మంత్రి కేటీఆర్ టీఆర్ఎస్లో చేర్చుకున్నారని, దీనిపై ఈసీ మందలిచ్చి వదిలిపెట్టడం సరికాదని, చర్య తీసుకోవాలన్నారు. -
అమరావతి చిహ్నం కోసం కసరత్తు
అమరావతి చిహ్నం కోసం మంత్రి నారాయణ ప్రొఫెసర్లతో భేటీ అయ్యారు. ఇక్కడి సీఆర్డీఏ కార్యాలయంలో రాష్ట్రానికి చెందిన నాలుగు యూనివర్సిటీల ప్రొఫెసర్లు పాల్గొన్నారు. నూతన రాజధాని అమరావతి చిహ్నం, రాజధాని చరిత్ర ప్రతిబింభించే అంశాలపై చర్చించారు. ఈ సమావేశంలో 30 మంది ప్రొఫెసర్లు పాల్గొన్నాట్లు సమాచారం. -
ఇద్దరిని మింగిన మ్యాన్‌హోల్
శుభ్రం చేస్తుండగా ఘటన అత్తాపూర్, న్యూస్‌లైన్: మ్యాన్‌హోల్ ఇద్దరు కార్మికులను మింగేసింది. మ్యాన్‌హోల్‌ను శుభ్రం చేసే క్రమంలో ఒకరు అందులో పడిపోగా.. అతడిని కాపాడే క్రమంలో మరో మరోవ్యక్తి మృత్యువాతపడ్డారు. ఈ విషాదకర ఘటన రాజేంద్రనగర్ పోలీస్‌స్టేషన్ పరిధిలో శనివారం ఉదయం జరిగింది. వివరాలు... ఉప్పర్‌పల్లిలోని ఇంపీరియల్ రెసిడెన్సీఅపార్ట్మెంట్ ముందు భాగంలో ఉన్న మ్యాన్‌హోళ్లు నిండిపోవడంతో మురుగునీరు రోడ్డుపై పారుతోంది. దీంతో అపార్ట్మెంట్ సూపర్వైజర్ వాహెద్ మ్యాన్‌హోళ్లను శుభ్రం చేయించడానికి కనకదుర్గ కాలనీకి చెందిన నారాయణ(40), కిషన్‌బాగ్ కు చెందిన భీములు(26)ను సంప్రదించాడు. రూ.400లు ఇస్తానని చెప్పి ఇద్దరినీ శనివారం ఉదయం 10 గంటలకు తీసుకొచ్చాడు. ముందుగా అపార్ట్మెంట్ ముందు రోడ్డుపై ఉన్న ఒక మ్యాన్‌హోల్ మూత తీశారు. అది పూర్తిగా మురునీటితో నిండిపోవడంతో అపార్ట్మెంట్ ప్రధాన ద్వారం ముందున్న మరో మ్యాన్‌హోల్‌ను శుభ్రం చేసేందుకు వెళ్లారు. అది కూడా మురుగునీటితో నిండిపోవడంతో భీములు లోపలికి దిగి శుభ్రం చేస్తున్నాడు. ఈక్రమంలో ఒక్కసారిగా జారి పడిపోయాడు. ఊపిరాడక పెద్దగా కేకలు వేస్తుండంతో అతడిని రక్షించేందుకు నారాయణ లోపలికి దిగి భీములును పైకి లాగేందుకు యత్నించాడు. పట్టుతప్పి ఇద్దరూ మ్యాన్‌హోల్‌లో పడి మునిగిపోయారు. స్థానికుల సమాచారం మేరకు ఘటనా స్థలానికి చేరుకున్న పోలీసులు, అగ్నిమాపక సిబ్బంది సహాయంతో మృతదేహాలను వెలికితీసే పనులు ప్రారంభించారు. మ్యాన్‌హోల్ 18 అడుగుల లోతు ఉండటంతో జేసీబీ సహాయంతో మ్యాన్‌హోల్ పక్కనే మరో గొయ్యి తీయించి మృతదేహాలను బయటకు తీశారు. కాగా, కార్మికులిద్దరూ మ్యాన్‌హోల్‌లో పడిపోగానే సూపర్వైజర్ వాహెద్ ఘటనా స్థలం నుంచి పారిపోయాడు. ఘటనా స్థలానికి చేరుకున్న ఇద్దరి కుటుంబసభ్యులు మృతదేహాలపై పడి గుండెలు పగిలేలా రోదించారు. కూలీల కళ్లముందే... ఘటన జరిగిన మ్యాన్‌హోల్ పక్కన ఓ ఇంటి నిర్మాణం జరుగుతోంది. మొదట మ్యాన్‌హోల్‌లో దిగిన భీములు కేకలు వేయడం ఆ ఇంటి వద్ద ఉన్న కూలీలు గమనించారు. అంతలోనే నారాయణ.. భీములను కాపాడేందుకు మ్యాన్హోల్లోకి దిగాడు. కూలీలు చూస్తుండగా ఇద్దరు మ్యాన్‌హోల్‌లో మునిగి మృతి చెందారు. తమ కళ్లముందే ఇద్దరూ నీట మునిగి చనిపోయారని ఆ కూలీలు కన్నీరు పెట్టుకున్నారు. నాయకుల పరామర్శ.... టీడీపీ గ్రేటర్ ఫ్లోర్‌లీడర్ సింగిరెడ్డి శ్రీనివాస్‌రెడ్డి, మైలార్‌దేవ్‌పల్లి, రాజేంద్రనగర్ కార్పొరేటర్లు ప్రేమ్‌దాస్‌గౌడ్, సత్యనారాయణలతో పాటు అమీర్‌పేట్ కార్పొరేటర్ ఘటనా స్థలానికి చేరుకున్నారు. మృతుల కుటుంబసభ్యులను పరామర్శించి, తాము అండగా ఉంటామని హామీ ఇచ్చారు. పత్తాలేని ఇంటి యజమాని.... ఘటన జరిగిన వెంటనే అపార్ట్మెంట్ యజమాని మసూద్ పోలీసులకు సమాచారం ఇచ్చాడు. అయితే, అతను సాయంత్రం 6 గంటల వరకు కూడా ఘటనా స్థలానికి రాలేదు. అతను వచ్చే వరకు మృతదేహాలను తీసుకెళ్లబోమని కుటుంబసభ్యులు ఆందోళన నిర్వహించారు. రూ.2 లక్షల నష్టపరిహారం... రాజేంద్రనగర్: పోలీసుల జోక్యంతో అపార్ట్మెంట్ యజమాని మసూద్ శనివారం రాత్రి 8.30కి ఘటనా స్థలానికి వచ్చాడు. మృతుల కుటుంబసభ్యులకు రూ. 2 లక్షల చొప్పున నష్టపరిహారం ఇచ్చేందుకు ఒప్పుకున్నాడు. దీంతో పోలీసులు పోస్టుమార్టం కోసం మృతదేహాలను ఉస్మానియా ఆసుపత్రికి తరలించారు.