నేడు హెచ్‌సీఏ ఎన్నికలు | Hyderabad Cricket Association election | Sakshi
Sakshi News home page

నేడు హెచ్‌సీఏ ఎన్నికలు

Published Mon, Jan 16 2017 11:56 PM | Last Updated on Tue, Aug 14 2018 5:56 PM

Hyderabad Cricket Association election

హైదరాబాద్‌:  హైదరాబాద్‌ క్రికెట్‌ అసోసియేషన్‌ (హెచ్‌సీఏ) ఎన్నికలకు రంగం సిద్ధమైంది. దిగువ కోర్టు ఇచ్చిన ఉత్తర్వులను సమర్థిస్తూ హైకోర్టు ఎన్నికల ప్రక్రియను కొనసాగించాలని ఆదేశించింది. దాంతో నేడు (మంగళవారం) ఉప్పల్‌ స్టేడియంలో ఎన్నికలు నిర్వహిస్తారు. అధ్యక్ష పదవికి జి.వివేకానంద్, విద్యుత్‌ జైసింహ పోటీ పడుతుండగా, కార్యదర్శిగా శేష్‌ నారాయణ్‌ ఏకగ్రీవంగా ఎన్నిక కానున్నారు. మరోవైపు తన నామినేషన్‌ తిరస్కరణపై హైకోర్టుకు వెళ్లిన వంకా ప్రతాప్‌కు అనుకూలంగా తీర్పు వచ్చింది.

ఆయన సంయుక్త కార్యదర్శి పదవికి ఇచ్చిన నామినేషన్‌ను స్వీకరించాలని కోర్టు ఆదేశించింది. మొత్తం ఎన్నికల ప్రక్రియను ప్రశ్నిస్తూ నరేశ్‌ శర్మ కోర్టును ఆశ్రయించగా... దీనిపై రెండు రోజుల్లో వివరణ ఇవ్వాలంటూ రిటర్నింగ్‌ అధికారిని కూడా హైకోర్టు ఆదేశించింది.
మరోవైపు లోధా సిఫారసుల అమలుకు సంబంధించి మరింత స్పష్టత కోరుతూ హైదరాబాద్, తమిళనాడు, గోవా, మధ్యప్రదేశ్‌ క్రికెట్‌ సంఘాలు సుప్రీంకోర్టులో పిటిషన్‌ దాఖలు చేశాయి. 

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement