‘చంద్రబాబు వారందరికీ సమాధానం చెప్పండి’ | bhumana karunakar reddy questioned chandrababu naidu over mp sivaprasad issue | Sakshi
Sakshi News home page

‘చంద్రబాబు వారందరికీ సమాధానం చెప్పండి’

Published Tue, Apr 18 2017 1:58 PM | Last Updated on Fri, Aug 10 2018 7:07 PM

‘చంద్రబాబు వారందరికీ సమాధానం చెప్పండి’ - Sakshi

‘చంద్రబాబు వారందరికీ సమాధానం చెప్పండి’

హైదరాబాద్‌ : టీడీపీ ఎంపీ శివప్రసాద్‌ ప్రశ్నలకు ముఖ్యమత్రి చంద్రబాబు నాయుడు ఎందుకు సమాధానం చెప్పడం లేదని వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి భూమన కరుణాకర్‌ రెడ్డి ప్రశ్నించారు. ఆయన మంగళవారం పార్టీ కేంద్ర కార్యాలయంలో మీడియా సమావేశంలో మాట్లాడారు. ఓ దళితద ఎంపీ ప్రశ్నిస్తే సమాధానం చెప్పకుండా దళిత మంత్రులతో తిట్టించడం దారుణమన్నారు. చంద్రబాబుకు శివప్రసాద్‌ స్నేహితుడు, శ్రేయోభిలాషి అన్నారు.

దళితులకు జరుగుతున్న అన్యాయాన్ని స్నేహితుడు ప్రశ్నించడం తప్పా అని భూమన అన్నారు. శివప్రసాద్‌తో పాటు బోండా ఉమ, బుచ్చయ్య చౌదరి, చింతమనేని ప్రభాకర్‌, పయ్యావుల కేశవ్‌, గాలి ముద్దుకృష్ణమనాయుడు కూడా ప్రశ్నిస్తున్నారని,వారికి కూడా సమాధానం చెప్పాలని డిమాండ్‌ చేశారు.

నమ్మినవారిని నట్టేట ముంచడం చంద్రబాబు నైజం, ఇవ్వాల్సింది షోకాజ్‌ నోటీసులు కాదని,  వారు అడుగుతున్న ప్రశ్నలకు సమాధానం చెప్పాలన్నారు. చంద్రబాబు సర్కార్‌ పూర్తిగా అవినీతిలో కూరుకుపోయిందని, బాబు పాలనలో రాష్ట్రంలోని ఏ వర్గం సంతోషంగా లేరని భూమన ధ్వజమెత్తారు. ఈ రాష్ట్రంలో సంతోషంగా ఉన్నది ఒక్క లోకేశ్‌ బాబే అని ఆయన వ్యాఖ్యానించారు.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement