బాధితుడు దివాకర్
ప్రయాణికుడిపై దౌర్జన్యం
ఆ బస్సు రూటే సెపరేటు
ప్రయాణికులకు నరకం చూపిన వైనం
విజయవాడ: రవాణాశాఖ అధికారులు ఎన్ని దాడులు నిర్వహిస్తున్నా ప్రైవేటు ట్రావెల్స్ నిర్వాహకులు మాత్రం తమ పంథాను మార్చుకోకుండా ప్ర యాణికులకు ప్రత్యక్ష నరకం చూపుతున్నారు. సంక్రాంతి సెలవులు కావడంతో స్వస్థలాలకు బయలుదేరాలనుకునే వారి నుంచి వేలాది రూ పాయలు గుంజుతూ వారిని పురుగులు చూసినట్లు చూస్తున్నారు. అదేమని ప్రశ్నించే వారిపై దాడులకు తెగబడుతున్నారు.
ఇటువంటి చేదు అనుభవమే కేశినేని ట్రావెల్స్ నుంచి నగరానికి చెందిన వ్యాపారి బి.దివాకర్‌కు ఎదురైంది. గు రువారం రాత్రి బెంగళూరులో కేశినేని ట్రావెల్స్ బస్సులో బయలుదేరిన ఆయన డ్రైవర్ చేతిలో చావు దెబ్బలు తిని శుక్రవారం నగరానికి చేరుకున్నారు. కృష్ణలంక పోలీస్‌స్టేషన్‌లో ఫిర్యాదు చేసి, ప్రభుత్వాసుత్రిలో చికిత్స పొందారు. తన అనుభవాన్ని శుక్రవారం ‘సాక్షి’కి వివరించారు.
కేశినేని ట్రావెల్స్‌తో తన అనుభవం ఆయన మాటల్లోనే....గురువారం రాత్రి 8.30 గంటలకు బెంగుళూరులో కళాసపాలెం వద్ద కేశినేని ట్రావెల్స్ బస్సు ఎక్కేందుకు టికెట్ కొనుక్కుని మరికొంతమంది ప్రయాణికులతో నిరీక్షించా. చివరకు రాత్రి 9.45 గంటల ప్రాంతంలో కేశినేని ట్రావెల్స్ ప్రతినిధులు వ చ్చి బస్సు అక్కడకు రాదని చెప్పారు. మరొక చోటకు తీసుకువెళ్లి బస్సు ఎక్కించారు. రాత్రి 10.45 గంటల ప్రాంతంలో బస్సును హైవే వర కు తీసుకువచ్చి ఆపేశారు. మమ్మల్ని కిందకు దింపేసి, అక్కడకు విజయవాడ వెళ్లే బస్సు వస్తుందని, దానిలో ఎక్కమని చెప్పి డ్రైవర్ వెళ్లిపోయాడు.
గజగజా వణికే చలిలో వృద్ధులు,చిన్నారులతో కలిసి అర్ధరాత్రి 11.45 గంటల వరకు హైవేపై వేచి ఉన్నాం. చివరకు విజయవాడ వెళ్లే బస్సు వచ్చింది. అందరం అందులో ఎక్కాం. ప్రయాణికులు పది నిముషాలు ఆల స్యం అయితే బస్సును ఆపరు కానీ, 8.30కు బయలుదేరాల్సిన బస్సు 12 గంటల వరకు ఎందుకు బయలుదేరలేదంటూ డ్రైవర్‌ను ప్ర శ్నించా. ‘ఆలస్యం అయ్యింది.. నువ్వు వెళ్లి సీట్లో కూర్చో.. నీకు వివరణ ఇవ్వాల్సిన అవసరం లేదు’ అంటూ ఆగ్రహం వ్యక్తం చేశాడు. ‘రూ.1500 పెట్టి టికెట్ కొన్నాం.. ఎముకల కొరికే చలిలో ముసలివాళ్లను గంటకు పైగా నిలబెట్టా రు. కనీస మర్యాద కూడా ఇవ్వకుండా మాట్లాడటం సబబేనా’ అంటూ నేను ఎదురు ప్రశ్నించాను. నాతో పాటే మరికొంతమంది ప్రయాణికులు కూడా డ్రైవర్‌ను గట్టిగా ప్రశ్నిం చాడు.
దీంతో డ్రైవర్ నాపై దాడి చేశాడు. బూ తులు తిడుతూ, నా ముఖంపై పిడిగుద్దులు గు ద్దసాగాడు. దీంతో ముఖానికి చేతులు అడ్డుపెట్టుకున్నా. కిందపడిపోవడంతో చేతికి గట్టి దె బ్బతగిలింది. పక్కనే ఇద్దరు కేశినేని సిబ్బంది ఉన్నా ఆపే ప్రయత్నం చేయలేదు. చివరకు భ యంభయంగానే నా సీటులో కూర్చున్నా. నేను ఈ రూట్‌లో చాలాసార్లు ప్రయాణం చేశా. బస్సు తిరుపతి మీదగా రావాల్సి ఉండగా.. రూట్ మార్చి అనంతపురం, కడప మీదగా గ్రా మాల్లోంచి తీసుకువచ్చారు. విజయవాడ-బెంగళూరు రూటు గురించి అవగాహన ఉన్న ప్ర యాణికులు బస్సు రూటు మారడం గురించి ప్రశ్నించారు.
ఆర్టీఏ అధికారులు దాడులు చేస్తున్నారు. అందువల్ల మరో రూటులో తీసుకువెళ్లుతున్నామని డ్రైవర్ నిర్లక్ష్యంగా సమాధానం చెప్పాడు. ఆర్టీఏ దాడులు కారణంగా మరో రూ టులో తీసుకువస్తున్నాడా? లేక మేము గొడవ పడ్డామని దారి మళ్లించాడో అర్ధం కాక బస్సు లో ప్రయాణికులమంతా భయంతో కూర్చున్నాం. ఈరోజు సాయంత్రం కనకదుర్గవారధి వద్దకు వచ్చిన తరువాత ముందుకు వెళ్లి చూస్తే డ్రైవర్ లేడు.
అదేమని మిగిలిన సిబ్బందిని ప్రశ్నిస్తే, మధ్యలో దిగిపోయాడని చెప్పారు. బస్సు దిగిన తరువాత కృష్ణలంక పోలీసుస్టేష న్‌లో ఫిర్యాదు చేశా. పోలీసులు కేసు నమోదు చేసి, చేతికి కట్టుకట్టించేందుకు ప్రభుత్వాస్పత్రికి పంపారు. నిన్న రాత్రి 8.30 గంటల నుంచి ఈరోజు రాత్రి 8.30 గంటల వరకు నాకు భోజనం కూడా లేదు. ఇంటికి వచ్చి భోజనం చేస్తున్నా. నాపై దాడి చేసిన డ్రైవర్‌పై కఠిన చర్యలు తీసుకోవాలని డిమాండ్ చేస్తున్నా.’