కేశినేని ట్రావెల్స్ మూసివేత | kesineni nani shuts down his travels business | Sakshi
Sakshi News home page

కేశినేని ట్రావెల్స్ మూసివేత

Apr 8 2017 9:26 AM | Updated on Sep 5 2017 8:17 AM

కేశినేని ట్రావెల్స్ మూసివేత

కేశినేని ట్రావెల్స్ మూసివేత

టీడీపీ ఎంపీ కేశినేని నానికి చెందిన కేశినేని ట్రావెల్స్‌ను మూసివేశారు.

విజయవాడ: టీడీపీ ఎంపీ కేశినేని నానికి చెందిన కేశినేని ట్రావెల్స్‌ను మూసివేశారు. గత వారం నుంచి అడ్వాన్స్‌డ్ రిజర్వేషన్లను నిలిపివేయగా, శుక్రవారం అర్ధరాత్రి నుంచి దేశ వ్యాప్తంగా బస్ సర్వీసులను ఆపివేశారు. సిబ్బందికి జీతాలు ఇవ్వకపోవడంతో పలుచోట్ల ఆందోళనకు దిగారు.

ఇటీవల రవాణ శాఖ కార్యాలయం వద్ద కమీషనర్ బాలసుబ్రహ్మణ్యం పట్ల నాని, టీడీపీ ఎమ్మెల్యే బోండా ఉమా మహేశ్వర రావు దౌర్జన్యంగా ప్రవర్తించిన సంగతి తెలిసిందే. ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు ఈ విషయంలో జోక్యం చేసుకుని నానితో క్షమాపణలు చెప్పించారు. చంద్రబాబు తనతో బలవంతంగా క్షమాపణలు చెప్పించడంతో అసంతృప్తిగా ఉన్న నాని అలకబూనారు. కేశినేని ట్రావెల్స్‌ను మూసివేయాలని నిర్ణయించిన నాని.. కార్గో వ్యాపారం వైపు దృష్టిసారించారు.
 

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement