
సాఫ్ట్‌వేర్ సేవల దేశీ దిగ్గజం టాటా కన్సల్టెన్సీ సర్వీసెస్(TCS) ఫిన్‌లాండ్ సంస్థ యూపీఎమ్ (UPM)తో ఐటీ ట్రాన్స్‌ఫార్మేషన్ సేవలందించేందుకు ఒప్పందం కుదుర్చుకుంది. రీసైక్లబుల్ ప్రొడక్టులను రూపొందించడంలో ప్రత్యేకత కలిగిన యూపీఎమ్ పునరుత్పాదక ఇంధన మెటీరియల్స్‌ను ముడిసరుకులుగా వినియోగిస్తోంది.
11 దేశాలలో కార్యకలాపాలు విస్తరించిన కంపెనీ 10.3 బిలియన్ యూరోల టర్నోవర్‌ను కలిగి ఉంది. యూపీఎమ్ వృద్ధికి డిజిటల్ ట్రాన్స్‌ఫార్మేషన్ సహకరించనున్నట్లు ఒప్పందం సందర్భంగా టీసీఎస్ పేర్కొంది. తద్వారా ఏఐ ఫస్ట్ ఆపరేటింగ్ మోడల్‌ను అందిపుచ్చుకోనున్నట్లు తెలియజేసింది. అయితే ఒప్పందం(కాంట్రాక్ట్) విలువను వెల్లడించలేదు.
ఇది చదివారా? ఐటీ కంపెనీల్లో శాలరీ హైక్.. ఈసారి అంచనాలు ఇవే..
యూపీఎమ్ ఎంటర్‌ప్రైజ్ ఐటీ వేల్యూ చైన్‌ను పటిష్టపరిచే బాటలో ఏఐ ఆధారిత అటానమస్ ఎంటర్‌ప్రైజ్ ప్లాట్‌ఫామ్ ఇగ్నియోను వినియోగించనున్నట్లు టీసీఎస్ వెల్లడించింది. అంతేకాకుండా యూపీఎమ్‌కు చెందిన 15,800 మంది ఉద్యోగులు, మెషీన్ల మధ్య మరింత భాగస్వామ్యానికి ఏఐ ద్వారా మద్దతివ్వనుంది.
టాటా కన్సల్టెన్సీ సర్వీసెస్ (TCS) క్యూ3 ఫలితాల్లో అదరగొట్టింది. ప్రస్తుత ఆర్థిక సంవత్సరంలో డిసెంబర్ 31తో ముగిసిన మూడో త్రైమాసికంలో రూ.12,380 కోట్ల నికర లాభాన్ని ప్రకటించింది. గత సంవత్సరం ఇదే త్రైమాసికంలో కంపెనీకి రూ.11058 కోట్ల నికర లాభం రాగా ఈసారి 12 శాతం మేర పెరిగడం గమనార్హం. అలాగే సెప్టెంబర్‌తో ముగిసిన రెండో త్రైమాసికంలో కంపెనీ రూ.11,909 కోట్ల నికర లాభం నమోదు చేసింది. టీసీఎస్ మొత్తం ఆదాయం 5.6 శాతం పెరిగి రూ.63,973 కోట్లకు చేరింది.
Comments
Please login to add a commentAdd a comment