
దేశంలో అతిపెద్ద ఐటీ సంస్థ టాటా కన్సల్టెన్సీ సర్వీసెస్ (TCS) వీసా మోసం (Visa fraud) ఆరోపణలను ఎదుర్కొంటున్నట్లు సమాచారం. అమెరికా కార్మిక చట్టాలను పక్కదారి పట్టించేందుకు కంపెనీ ప్రత్యేక వర్క్ వీసాలను దుర్వినియోగం చేసిందని విజిల్‌బ్లోయర్లు ఆరోపిస్తున్నారు. ఫ్రంట్‌లైన్ కార్మికులను అమెరికాకు తీసుకురావడానికి వారిని మేనేజర్లుగా ముద్ర వేసి ఎల్-1ఏ మేనేజర్ వీసాలను దుర్వినియోగం చేసిందని వ్యాజ్యాలతోపాటు బ్లూమ్‌బెర్గ్ న్యూస్ ఇన్వెస్టిగేషన్‌లోనూ ఆరోపించారు.
2017లో డోనాల్డ్ ట్రంప్ పరిపాలన ఎంప్లాయిమెంట్ వీసాలపై దృష్టి సారించినప్పుడు, కంపెనీ ఎగ్జిక్యూటివ్‌లు అంతర్గత సంస్థాగత చార్ట్‌లను తప్పుగా రూపొందించాలని తనకు సూచించారని డెన్వర్‌లో టీసీఎస్‌కు ఐటీ మేనేజర్‌గా పనిచేసిన అనిల్ కిని ఆరోపించారని బ్లూమ్‌బెర్గ్ నివేదించింది. ఫెడరల్ పరిశీలనను తప్పించుకోవడానికి ఫ్రంట్‌లైన్ ఉద్యోగులను మేనేజర్‌లుగా తప్పుగా చూపించడమే దీని ఉద్దేశమని బ్లూమ్‌బెర్గ్ నివేదించింది.
అనిల్ కిని, మరో ఇద్దరు మాజీ టీసీఎస్ ఉద్యోగులతో కలిసి ఫెడరల్ ఫాల్స్ క్లెయిమ్స్ యాక్ట్ కింద దావాలు దాఖలు చేశారని, కంపెనీ ఎల్-1ఏ వీసా వ్యవస్థను దుర్వనియోగం చేస్తోందని ఆరోపించారని నివేదిక పేర్కొంది. మేనేజర్ స్థాయి అధికారుల బదిలీల కోసం ఉద్దేశించిన ఈ వీసాలు, కఠినమైన వేతనం, విద్యా అవసరాలు కలిగిన హెచ్-1బీ నైపుణ్యం కలిగిన కార్మిక వీసాల కంటే తక్కువ నియంత్రణలు కలిగి ఉంటాయి. అనిల్ కిని దావాను ఈ సంవత్సరం ప్రారంభంలో కొట్టివేసినప్పటికీ ఆయన ఈ నిర్ణయాన్ని అప్పీల్ చేశాడని నివేదిక వివరించింది.
ఇదీ చదవండి: టీసీఎస్ కొత్త డీల్.. ఫిన్‌లాండ్ కంపెనీతో..
2019 అక్టోబర్, 2023 సెప్టెంబర్ మధ్య యూఎస్ సిటిజన్‌షిప్ అండ్ ఇమ్మిగ్రేషన్ సర్వీసెస్ (USCIS) 90,000 కంటే ఎక్కువ ఎల్-1ఏ వీసాలను ఆమోదించింది. వీటిని ప్రధానంగా ఐటీ అవుట్‌సోర్సింగ్ సంస్థలు యూఎస్ కంపెనీలకు సమాచార సాంకేతిక పనులను నిర్వహించడానికి ఉపయోగించాయి. వీటిలో 6,500 కంటే ఎక్కువ ఎల్-1ఏ వీసాలతో టీసీఎస్ అగ్రస్థానంలో ఉంది. తరువాతి ఏడు అతిపెద్ద గ్రహీతలు కలిపి పొందిన ఎల్-1ఏ వీసాల కంటే టీసీఎస్ ఒక్కటే పొందిన ఎల్-1ఏ వీసాల సంఖ్య అధికం.
ఖండించిన టీసీఎస్
తమపై వచ్చిన ఆరోపణలను టీసీఎస్ తీవ్రంగా ఖండించింది. "కొనసాగుతున్న వ్యాజ్యాలపై టీసీఎస్ వ్యాఖ్యానించదు. అయితే కొంతమంది మాజీ ఉద్యోగుల ఈ తప్పుడు ఆరోపణలను మేము తీవ్రంగా ఖండిస్తున్నాము. వీటిని గతంలో అనేక కోర్టులు, ట్రిబ్యునళ్లు తోసిపుచ్చాయి. టీసీఎస్ అన్ని యూఎస్ చట్టాలకు కట్టుబడి ఉంటుంది" అని కంపెనీ ప్రతినిధి ఒకరు చెప్పినట్లు వార్తా సంస్థ పేర్కొం
Comments
Please login to add a commentAdd a comment