
దేశంలో అతిపెద్ద ఐటీ సంస్థ టాటా కన్సల్టెన్సీ సర్వీసెస్ (TCS)కు కొత్త హెచ్‌ఆర్ హెడ్ నియమితులయ్యారు. సుదీప్ కున్నుమాల్‌కు పదోన్నతి కల్పిస్తూ చీఫ్ హ్యూమన్ రిసోర్సెస్ ఆఫీసర్ (సీహెచ్‌ఆర్‌వో)గా టీసీఎస్ నియమించింది. ప్రస్తుత హెచ్‌ఆర్ అధిపతి మిలింద్ లక్కడ్ పదవీ విరమణ చేస్తున్నారు. మార్చి 14వ తేదీ నుంచి కున్నుమాల్ చీఫ్ హ్యూమన్ రిసోర్సెస్ ఆఫీసర్ గా బాధ్యతలు స్వీకరిస్తారని ఫైలింగ్‌లో టీసీఎస్ పేర్కొంది.
సుదీప్ కున్నుమాల్ ప్రస్తుతం టీసీఎస్‌లో బ్యాంకింగ్, ఫైనాన్షియల్ సర్వీసెస్ అండ్ ఇన్సూరెన్స్ (బీఎఫ్ఎస్ఐ) విభాగానికి హెచ్ఆర్ ఫంక్షన్ హెడ్‌గా ఉన్నారు. టాటా గ్రూప్ అనుబంధ సంస్థలో దాదాపు ఆరేళ్ల పాటు సీహెచ్ఆర్ఓ, ఎగ్జిక్యూటివ్ వైస్ ప్రెసిడెంట్‌గా ఉన్న ప్రస్తుత మిలింద్ లక్కడ్ పదవీ విరమణ తర్వాత సీహెచ్ఆర్ఓ హోదాకు పదోన్నతి పొందారు. 1987లో టీసీఎస్‌లో ట్రైనీగా చేరిన లక్కడ్ 2006లో మాన్యుఫ్యాక్చరింగ్ ప్రాక్టీస్ అధిపతి హోదాతో పాటు 38 ఏళ్ల పాటు పలు బాధ్యతలు నిర్వర్తించారు. 2019 నుంచి సీహెచ్‌ఆర్‌వోగా పనిచేస్తున్నారు.
సుదీప్ కున్నుమాల్ గురించి..
బ్యాంకింగ్, ఫైనాన్షియల్ సర్వీసెస్ అండ్ ఇన్సూరెన్స్ (బీఎఫ్ఎస్ఐ) వర్టికల్ కోసం హ్యూమన్ రిసోర్సెస్ ఫంక్షన్‌కు నేతృత్వం వహిస్తున్న సుదీప్ కున్నుమాల్ 2000 సంవత్సరం నుంచి ఐటీ రంగంలో పనిచేస్తున్నారు. మదురై కామరాజ్ యూనివర్సిటీ నుంచి హ్యూమన్ రిసోర్స్ మేనేజ్ మెంట్ లో మాస్టర్స్ పూర్తి చేశారు. వ్యూహాత్మక హెచ్‌ఆర్ చొరవలు, సరికొత్త నియామక పరిష్కారాలు, ప్రాసెస్ ఎక్సలెన్స్ ద్వారా సంస్థాగత వృద్ధిని పెంపొందించడంలో నిబద్ధతతో సుదీప్ కెరియర్ సాగిందని టీసీఎస్ పేర్కొంది. ఉత్తర అమెరికా, యూరప్‌తోపాటు ఆసియా పసిఫిక్ దేశాల్లో ఆయన వివిధ హెచ్‌ఆర్ లీడర్ షిప్ పొజిషన్లలో పనిచేశారు.
ఇదీ చదవండి: జీతాల తేడాలొద్దు.. ఉద్యోగులను మనుషుల్లా చూడండి : ఇన్ఫోసిస్ నారాయణమూర్తి
Comments
Please login to add a commentAdd a comment