హైదరాబాద్: తెలంగాణాలో బుధవారం జరిగే తొలి విడత పోలింగ్ బందోబస్తు ను పర్యవేక్షించడానికి కొందరు సీనియర్ ఐపిఎస్ అధికారులను కూడా నియమిస్తు డీజీపీ బి.ప్రసాదరరావు ఆదేశాలు జారీ చేశారు. ఇందులో హైదరాబాద్‌నగర కమిషనరేట్ పరిధిలో గోవింద్‌సింగ్, వేణుగోపాలకృష్ణ, వివి శ్రీనిశ్రీనివాసరావు, టి.యోగానంద్‌లు బందోబస్తును పర్యవేక్షిస్తారు.
కరీంనగర్ జిల్లాకు వినయ్జ్రంన్‌రే, మెదక్ జిల్లాకు సివివి ఎస్‌కె రాజు, సైబరాబాద్‌లో శ్రీకాంత్, మహబూబ్‌నగర్ లో కె.వంకటేశ్వరరావు, నల్లగొండ జిల్లాకు రవిచంద్ర, రంగారెడ్డి జిల్లాకు త్రివిక్రమ్ వర్మ, అదిలాబాద్ జిల్లాకు వెంకట్రామ్‌రెడ్డి, కరీంనగర్ జిల్లాకు రంజిత్‌కుమార్, వరంగల్,ఖమ్మం, అదిలాబాద్ జిల్లాలో యాంటి నక్సలైట్ టీమ్‌ల పర్యవేక్షణకు చంద్రశేఖర్‌రెడ్డిలు బందోబస్తులో భాగంగా పర్యవేక్షిస్తారని డీజీపీ కార్యాలయం తెలిపింది.
తెలంగాణాలో బందోబస్తుకు మరి కొందరు అధికారులు
Published Tue, Apr 29 2014 9:51 PM | Last Updated on Tue, Aug 14 2018 4:24 PM
Advertisement
Advertisement