ఎంపీ పొన్నంపై కరీంనగర్లో కేసు: డీజీపీ | Case registered against ponnam prabhakar, says DGP prasada rao | Sakshi
Sakshi News home page

ఎంపీ పొన్నంపై కరీంనగర్లో కేసు: డీజీపీ

Published Fri, Jan 3 2014 5:24 PM | Last Updated on Sat, Sep 2 2017 2:15 AM

ఎంపీ పొన్నంపై కరీంనగర్లో కేసు: డీజీపీ

ఎంపీ పొన్నంపై కరీంనగర్లో కేసు: డీజీపీ

విజయవాడ: ముఖ్యమంత్రి కిరణ్కుమార్ రెడ్డిపై వివాదస్పద వ్యాఖ్యలు చేసిన కాంగ్రెస్ ఎంపీ పొన్నం ప్రభాకర్ పై కరీంనగర్‌లో కేసు నమోదయిందని డీజీపీ ప్రసాదరావు తెలిపారు. దీనిపై చట్టపరంగా ముందుకెళామని చెప్పారు. సీఎం కిరణ్ను తెలంగాణలో అడుగుపెట్టనీయబోమని, ఒకవేళ కిరణ్ కుమార్ రెడ్డి హెలికాప్టర్లో వస్తే గాల్లోనే తుపాకీ పెట్టి ఆ హెలికాప్టర్ పేల్చేస్తామని పొన్నం నిన్న వ్యాఖ్యానించారు.
 
కాగా, మావోయిస్టు ప్రభావిత, తీర ప్రాంతాలు, అటవీ ప్రాంతాలపై ప్రత్యేక దృష్టి సారించామని డీజీపీ ప్రసాదరావు వెల్లడించారు. అటవీశాఖ అధికారులకు ఈనెల 6 నుంచి ఆయుధాలతో ప్రత్యేక శిక్షణ ఇవ్వనున్నట్టు తెలిపారు. ఎర్రచందనం స్మగ్గర్లు తరచుగా అటవీ అధికారులపై దాడులకు పాల్పడుతుండడంతో ఈ నిర్ణయం తీసుకున్నారు.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement