
ఆటవికంపై విచారణకు ఆదేశం: డీజీపీ
తిరుపతి: శేషాచల అడువుల్లో పోలీసుల ఆటవిక చర్యలపై.. సాక్షి ప్రసారం చేసిన కథనాలపై ప్రభుత్వం స్పందించింది. దీంతో డీజీపీ ప్రసాదరావు తక్షణమే ఈ ఘటనపై సమగ్ర విచారణ జరపాల్సిందిగా ఆదేశించారు. ఎర్రచందనం కూలీని దాడిచేసింది పోలీసులా..? లేదా అటవీశాఖ సిబ్బందా ? అనేది తెలిపాలని ఆయన ఆదేశించినట్టు తెలుస్తోంది. అంతేకాక దాడి జరిగిన సంఘటనా స్థలాన్ని గుర్తించాలని డీజీపీ స్పష్టీకరించారు.
కాగా, శేషాచల అడవుల్లో ఎర్రచందనం కూలీని చిదకబాదిన ఘటనపై హెచ్‌ఆర్‌సీ సుమోటోగా స్వీకరించాలని పౌరహక్కుల సంఘం నేతలు క్రాంతిచైతన్య,షామీర్‌భాషాలు డిమాండ్ చేశారు. మంగళవారం వారు సాక్షితో మాట్లాడారు. తక్షణమే విచారణకు ఆదేశించాల్సిందిగా హెచ్‌ఆర్‌సీని వారు కోరారు. లేని పక్షంలో తామే కోర్టును ఆశ్రయిస్తామని చెప్పారు.