పోలీసుల కాల్పుల్లో ఎర్రచందనం కూలీ మృతి
రాళ్లతో కూలీల దాడి.. ఆర్ఎస్ఐ, కానిస్టేబుల్‌కు గాయాలు
భాకరాపేట, న్యూస్‌లైన్: చిత్తూరు జిల్లా భాకరాపేట అటవీ ప్రాంతంలోని బొవ్మూజీ కొండ వద్ద బుధవారం స్పెషల్ టాస్క్ఫోర్క్ పోలీసులు జరిపిన కాల్పుల్లో ఎర్రచందనం కూలీ మృతి చెందాడు. కూంబింగ్ నిర్వహిస్తున్న ప్రత్యేక దళాలపై కూలీలు రాళ్లతో దాడిచేయగా ఆర్ఎస్ఐ వురో కానిస్టేబుల్ గాయపడ్డారు. కూలీలను నిరోధించేందుకు పోలీసులు కాల్పులు జరిపారు. ఎర్రావారిపాళెం వుండలం బొమ్మాజీ కొండపై ఉన్న 70 మంది ఎర్రచందనం కూలీలు కూంబింగ్ నిర్వహిస్తున్న దళాలను చూసిన వెంటనే రాళ్ల వర్షం కురిపించారు.
దీంతో పోలీసులు ఆత్మరక్షణ కోసం కాల్పులు జరపడంతో కూలీల్లో ఓ వ్యక్తి (35) మృతి చెందాడు. మిగిలిన వారంతా పరారయ్యారు. గాయుపడ్డ ఆర్ఎస్ఐ మురళిని తిరుపతి రుయా ఆస్పత్రికి తరలించారు. మృతి చెందిన వ్యక్తి తమిళనాడు వాసిగా భావిస్తున్నారు. సంఘటన ప్రదేశాన్ని జిల్లా ఎస్పీ రావుకృష్ణ సందర్శించారు. కూంబింగ్‌లో ఉన్న పోలీసులపై కూలీలు ఎదురుదాడి చేయుడం వల్లే కాల్పులు జరపాల్సి వచ్చిందని అన్నారు.