హైదరాబాద్ : టీఆర్ఎస్ అధ్యక్షుడు, తెలంగాణ ముఖ్యమంత్రిగా బాధ్యతలు చేపట్టనున్న కేసీఆర్తో రాష్ట్ర ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి మహంతి శుక్రవారం భేటీ అయ్యారు. లేక్వ్యూ అతిథిగృహంలో ఈ సమావేశం జరుగుతోంది. ఈ సందర్భంగా రాష్ట్ర విభజన ప్రక్రియ, పంపకాలు, స్థానికతపై పవర్ పాయింట్ ప్రజెంటేషన్ ద్వారా కేసీఆర్కు వివరిస్తున్నట్లు సమాచారం.
కాగా ఉద్యోగుల విభజనపై కేసీఆర్ ప్రధానంగా సీఎస్తో చర్చించినట్లు తెలుస్తోంది. అలాగే ఉద్యోగుల విభజనలో ఎలాంటి అవకతవకలు లేకుండా చూడాలని ఆయన సూచనలు చేసినట్లు సమాచారం. మహంతితో పాటు డీజీపీ ప్రసాదరావు కూడా కేసీఆర్తో భేటీ అయ్యారు. అంతకు ముందు పలువురు తెలంగాణ ఐపీఎస్, ఇతర ఉన్నతాధికారులు కేసీఆర్ను కలిశారు. తాజా పరిణామాలు, విభజన అంశాలపై చర్చించారు.
లేక్వ్యూలో కేసీఆర్‌తో సీఎస్ మహంతి భేటీ
Published Fri, May 23 2014 2:38 PM | Last Updated on Wed, Aug 15 2018 9:20 PM
Advertisement
Advertisement