అనంతపురం: శ్రీకృష్ణదేవరాయ యూనివర్సిటీ ఇంజనీరింగ్ కళాశాల ప్రిన్సిపల్ నాగభూషణ రాజుపై విచారణ చేపట్టాలని శుక్రవారం విద్యార్థి సంఘాలు డిమాండ్ చేశాయి. విద్యార్థులకు చెందిన ఫీజు రీయింబర్స్ బకాయిలు ఇటీవల ప్రభుత్వం విడుదల చేసినా స్టూడెంట్స్ కు చెల్లించకుండా సొంత అవసరాల నిమిత్తం వాడుకున్న ప్రిన్సిపల్‌పై చర్యలు తీసుకోవాలని యూనివర్సిటీ పాలక భవనం ఎదుట ఆందోళన చేపట్టారు. ప్రిన్సిపల్ రూ.కోటి 38 లక్షల అవినీతికి పాల్పడ్డారని విద్యార్ధి సంఘాల నాయకులు తెలిపారు. ఈ ఆందోళనలో ఏబీవీపీతో పాటు వైఎస్సార్‌సీపీ విద్యార్థి విభాగం, ఐటీ విభాగం నాయకులు పాల్గొన్నారు.