- 2016 - 17 విద్యాసంవత్సరం నోటిఫికేషన్ విడుదలపై మీనమేషాలు
- గాడితప్పిన అకడమిక్ క్యాలెండర్
ఎస్కేయూ : శ్రీకృష్ణదేవరాయ విశ్వవిద్యాలయం దూరవిద్య విభాగం యూజీ, పీజీ కోర్సుల పరీక్షలు, ఫలితాల ప్రకటన సమయానుగుణంగా లేకపోవడంతో విద్యార్థులు ఆందోళన చెందతున్నారు. పీజీ కోర్సు కాలవ్యవధి రెండేళ్లయినప్పటికీ సకాలంలో పరీక్షలు నిర్వహించకపోవడంతో కోర్సు పూర్తి కావడానికి మూడేళ్లు పడుతోంది.
34వేల మంది విద్యార్థులకు తప్పని నిరీక్షణ
2015 - 16 విద్యాసంవత్సరానికి సంబంధించి యూజీ, పీజీ మొదటి సంవత్సరం పరీక్షలు ఇప్పటిదాకా నిర్వహించలేదు. 2016 ఆగస్టులోగా పరీక్షలు పూర్తి కావాల్సి ఉన్పప్పటికీ కాలయాపన చేస్తున్నారనే విమర్శలు సర్వత్రా వ్యక్తమవుతున్నాయి. బీఏ, బీకాం, బీఎస్సీ, ఎంఏ, ఎంకామ్, ఎమ్మెస్సీ కోర్సుల్లో 34వేల మంది విద్యార్థులు మొదటి సంవత్సరం చదువుతున్నారు. వారికి ఇప్పటికీ ఫస్టియర్ పరీక్షలే పెట్టలేదు. కనీసం ఎప్పుడుంటాయనే విషయంపైనా ఎస్కేయూ అధికారులు స్పష్టమైన ప్రకటన చేయకలేదు. దీంతో విద్యార్థుల్లో ఆందోళన నెలకొంది.
నూతన నోటిఫికేషన్ ఎప్పుడో..!
ఎస్కేయూకు సింహభాగం ఆదాయం దూరవిద్య విభాగం ద్వారానే వస్తోంది. ఏటా రూ.10 కోట్ల నుంచి రూ.12 కోట్ల వరకు ఆదాయం సమకూరుతోంది. కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు అందించే నిధుల మీద ఆధారపడకుండా స్వతహాగా ఆదాయం చేకూర్చుకునే మార్గాలలో దూరవిద్య ప్రధానమైనది. పొరుగు వర్సిటీలు దీనిని కీలకమైన విభాగంగా పరిగణించి ఆర్థిక సంస్కరణలకు శ్రీకారం చుట్టారు. ఫలితంగా గణనీయమైన ఆదాయం వస్తోంది. గత నాలుగు విద్యాసంవత్సరాల్లోనూ వర్సిటీకి నిధుల పరంగా దూరవిద్య ప్రధానపాత్ర పోషించింది. కానీ అకడమిక్ క్యాలెండర్ క్రమంగా గాఢి తప్పడంతో విద్యార్థులకూ, వర్సిటీకి నష్టం వాటిల్లుతోందనే అభిప్రాయాలు వ్యక్తమవుతున్నాయి. 2016 - 17 విద్యాసంవత్సరానికి సంబంధించిన నోటిఫికేషన్ ఇంతవరకు విడుదల కాలేదు.
ఉన్నత విద్య దూరం
Published Fri, Apr 7 2017 11:47 PM | Last Updated on Tue, Sep 5 2017 8:11 AM
Advertisement
Advertisement