టీ–20 క్రికెట్ టోర్నీ ప్రారంభం
టీ–20 క్రికెట్ టోర్నీ ప్రారంభం
Published Tue, Feb 14 2017 1:08 AM | Last Updated on Tue, Sep 5 2017 3:37 AM
ఎస్కేయూ (అనంతపురం) : శ్రీకృష్ణదేవరాయ విశ్వవిద్యాలయం స్టేడియంలో సోమవారం వర్సిటీ క్యాంపస్ కళాశాలల టీ–20 క్రికెట్ టోర్నీ ప్రారంభమైంది. ఈ సందర్భంగా టోర్నీని ప్రారంభించిన వర్సిటీ ఉపకులపతి ఆచార్య కె.రాజగోపాల్ మాట్లాడుతూ.. త్వరలో ఇండోర్ స్టేడియం నిర్మించనున్నట్లు తెలిపారు. అంతకుముందు ఎంపీఈడీ విభాగం విద్యార్థుల గౌరవ వందనాన్ని స్వీకరించి.. జాతీయ జెండాను ఆయన ఆవిష్కరించారు. కార్యక్రమంలో సైన్సు కళాశాల ప్రిన్సిపాల్ ఆచార్య వి.రంగస్వామి, ఎంపీఈడీ విభాగం ఇన్ఛార్జ్ డాక్టర్ ఎంవీ శ్రీనివాసన్, డాక్టర్ కిరణ్ చక్రవర్తి, శివ తదితరులు పాల్గొన్నారు.
సాహస కృత్యాలు అలవోకగా
టీ–20 క్రికెట్ టోర్నీ ప్రారంభోత్సవంలో అబ్బురపరిచే విన్యాసాలతో ఎంపీఈడీ విద్యార్థులు ఆకట్టుకున్నారు. ఎంపీఈడీ రెండో సంవత్సరం విద్యార్థి ఏ.సందీప్‌కుమార్ (అలియాస్ జింప్స¯ŒS) చేసిన సాహస కృత్యాలకు అభినందనలు వెల్లువెత్తాయి. పిరమిడ్స్, లెజ్జిమ్స్, స్టంట్స్‌లతో ఆకట్టుకొన్నారు. వీటిని వీక్షించిన ఉపకులపతి ఆచార్య కే.రాజగోపాల్ వేదిక దిగి వచ్చి సందీప్‌ను ఆలింగనం చేసుకుని అభినందించారు.
ఎంపీఈడీ బోణి
తొలి మ్యాచ్ పరిశోధన, ఎంపీఈడీ విభాగం విద్యార్థుల మధ్య ప్రారంభమైంది. ముందుగా టాస్ గెలిచిన పరిశోధన విద్యార్థుల జట్టు బ్యాటింగ్‌ను ఎంచుకుని, 82 పరుగులకు ఆలౌట్ అయింది. అనంరతం బరిలో దిగిన ఎంపీఈడీ విద్యార్థులు కేవలం పది ఓవర్లలోనే లక్ష్యాన్ని ఛేదించి శుభారంభం చేశారు. జట్టులో వినయ్‌కుమార్ 34 పరుగులు చేశారు. అలాగే మరో బ్యాట్స్‌మన్ చిరంజీవి ఏడు బంతుల్లో 17 పరుగులు సాధించారు. బౌలింగ్‌లోనూ చిరంజీవి రాణిస్తూ నాలుగు ఓవర్లలో 15 పరుగులు ఇచ్చి మూడు వికెట్లు తీశారు. దీంతో అతనికి మ్యాన్ ఆఫ్‌ది మ్యాచ్‌ను ప్రకటించారు. మధ్యాహ్నం ఎంబీఏ విభాగం, బోధనేతర ఉద్యోగుల మధ్య జరిగింది. తొలుత బ్యాటింగ్ చేసిన ఎంబీఏ నిర్ణీత 20 ఓవర్లలో 208 భారీ పరుగుల లక్ష్యాన్ని నిర్ధేశించింది. 209 పరుగుల లక్ష్యంతో బరిలోకి తిగిన బోధనేతర ఉద్యోగులు 13 ఓవర్లకు గాను 79 పరుగులకే ఆలౌటయ్యారు. మ్యాన్ ఆఫ్ ది మ్యాచ్‌గా నవీన్ (ఎంబీఏ) (31 బంతులకు 60 పరుగులు)ను ప్రకటించారు.
Advertisement
Advertisement