కరెన్సీ కోసం వెళితే చితకబాదారు!
ఎస్కేయూ ఉద్యోగిపై పోలీసుల దాష్టీకం
అనంతపురం సెంట్రల్: పెద్దనోట్ల మార్పిడి కోసం వెళ్లిన ఓ వ్యక్తిని పోలీసులు చితకబాదారు. ఈ సంఘటన అనంతపురం నగరంలోని సారుునగర్‌లో ఉన్న ఎస్‌బీఐ మెరుున్ బ్రాంచ్ వద్ద ఆదివారం చోటు చేసుకుంది. వైఎస్సార్ జిల్లా కమలాపురం మండలానికి చెందిన మాధవరెడ్డి ఎస్కే యూనివర్సిటీలోని భారత వాతావరణ పరిశోధన కేంద్రంలో టెక్నికల్ అసిస్టెంట్‌గా పనిచేస్తున్నారు. ఆదివారం డబ్బు కోసం సారుునగర్ స్టేట్‌బ్యాంకుకు వెళ్లారు. క్యూలో కొన్ని గంటల సేపు వేచి ఉన్నారు.
ఇదే సమయంలో బందోబస్తు నిమిత్తం అక్కడికి వచ్చిన టూటౌన్ ఎస్‌ఐ జనార్దన్ ఆయన్ను పరుష పదజాలంతో దూషించారు. దీనికి కోపోద్రిక్తుడైన మాధవరెడ్డి ఎస్‌ఐపై చేరుు చేసుకున్నారు. దీంతో బందోబస్తులో ఉన్న పోలీసులు, త్రీటౌన్ సీఐ ఆయన్ను పట్టుకొని చితకబాదారు. వందలాది మంది ప్రజల సమక్షంలోనే గొడ్డును బాదినట్లు బాదుతూ, బూటు కాలుతో తన్నుకుంటూ స్టేషన్‌కు తీసుకెళ్లారు. స్టేషన్‌లోనూ కొట్టినట్లు తెలిసింది. తర్వాత ఆయన్ను ఎక్కడుంచారనేది పోలీసులు చెప్పడం లేదు. ఎస్‌ఐపై చేరుుచేసున్నారనే కారణంతో మాధవరెడ్డిపై కేసు నమోదు చేసినట్లు టూటౌన్ సీఐ తెలిపారు.