ఎస్కేయూను అగ్రగామిగా నిలిపేందుకు కృషి | the effort to maintain sku is the number one university | Sakshi
Sakshi News home page

ఎస్కేయూను అగ్రగామిగా నిలిపేందుకు కృషి

Published Fri, Mar 31 2017 5:37 PM | Last Updated on Tue, Sep 5 2017 7:35 AM

the effort to maintain sku is the number one university

►వీసీ ఆచార్య  కె. రాజగోపాల్‌
 
ఎస్కేయూ : శ్రీకృష్ణదేవరాయ విశ్వవిద్యాలయాన్ని రాష్ట్రంలో అగ్రగామిగా నిలిపేందుకు కృషి చేస్తున్నట్లు వీసీ ఆచార్య కె.రాజగోపాల్‌ పేర్కొన్నారు. ఎస్కేయూ వీసీ కాన్ఫరెన్స్‌  హాలులో అకడమిక్‌ సెనెట్‌ కమిటీ సభ్యుల సమావేశం గురువారం నిర్వహించారు. వీసీ అధ్యక్షతన జరిగిన సమావేశంలో పలు కీలక నిర్ణయాలకు కమిటీ సభ్యులు ఆమోదం తెలిపారు. గత పాలక మండలి సమావేశాల్లో తీసుకున్న నిర్ణయాలకు అకడమిక్‌ సెనెట్‌ సమ్మతించింది.రూ.57.7 కోట్లు యూనివర్సిటీ గ్రాంట్స్‌ కమిషన్‌ నిధులు, రూ.20 కోట్లు రూసా నిధులు ఉండటంతో మరిన్ని అభివృద్ధి పనులు చేపట్టడానికి అవకాశం ఏర్పడిందని వీసీ పేర్కొన్నారు.

ఇండోర్‌ స్టేడియం నిర్మాణం, వర్సిటీ ప్రహరీ మరమ్మతు, నూతన పరీక్షల విభాగం నిర్మాణం తదితర అభివృద్ధిపనుల చేపట్టనున్నామన్నారు. కార్యక్రమంలో ఎస్కేయూ రెక్టార్‌ ఆచార్య హెచ్‌.లజపతి రాయ్, రిజిస్ట్రార్‌ ఆచార్య కె.సుధాకర్‌ బాబు, పాలకమండలి సభ్యులు రామయ్య, విజయారావు, నాగ జ్యోతిర్మయి, డాక్టర్‌ ఎండ్లూరి ప్రభాకర్, డాక్టర్‌ ముచ్చుకోట బాబు, క్యాంపస్‌ కళాశాల ప్రిన్సిపాల్‌ ఆచార్య సీఎన్‌ కృష్ణానాయక్,  ఎస్వీ యూనివర్సిటీ మాజీ వీసీ ఆచార్య కొలకలూరి ఇనాక్, పీవీ రమణా రెడ్డి, అకడమిక్‌ సెనెట్‌ సభ్యులు, తదితరులు పాల్గొన్నారు. 
 

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement