సాక్షి, హైదరాబాద్: రాష్ట్రంలోని పట్టణ స్థానిక సంస్థల ఆదాయం లెక్క తేలింది. కొత్తగా కొన్ని మున్సిపాలిటీలు, కార్పొరేషన్లు ఏర్పాటైన నేపథ్యంలో రాష్ట్రంలోని పలు మున్సిపాలిటీలు, కార్పొరేషన్లలో అదనపు సిబ్బంది ని యామక ప్రక్రియలో భాగంగా ఆయా పట్టణ సంస్థల కాసుల లెక్కను కూడా పురపాలక శా ఖ అధికారులు ఓ కొలిక్కి తెచ్చారు. ఆ మేరకు గ్రేటర్ హైదరాబాద్ మినహా మిగిలిన అన్ని (140) పురపాలికల్లో కలిపి ప్రభుత్వ ఖజానాకు రూ.1,123.87 కోట్లకు పైగా ఆదా యం సమకూరుతోంది. ఇందులో ఆస్తి పన్ను కింద రూ.671.33 కోట్లు.. ఇతర ఆదాయం రూ. 452.53 కోట్లు ఉంది. అయితే ఆస్తి పన్ను హే తుబద్ధీకరణ, ఇతర పన్నుల విషయంలో మరింత పకడ్బందీగా వ్యవహరిస్తే ఈ ఆదా యం మరో 20 శాతమైనా పెరుగుతుందని మున్సిపల్ అధికారులు చెబుతున్నారు.
అగ్రభాగాన నార్సింగి.. అట్టడుగున అమరచింత
మున్సిపాలిటీల ఆదాయంలో నార్సింగి అగ్రభాగాన ఉంది. రాజధానిని ఆనుకొని ఉన్న ఈ పురపాలిక వార్షికాదాయం రూ.26.12 కోట్లు, ద్వితీయ స్థానంలో మణికొండ రూ.20.11 కోట్లు, జగిత్యాల రూ.15.28 కోట్లుండగా.. అట్టడుగున అమరచింత మున్సిపాలిటీ ఉంది. ఇంకా పల్లె వాసనలు పోనీ ఈ పురపాలిక వార్షికాదాయం కేవలం రూ.13.92 లక్షలు మాత్రమే. ఆ తర్వాత స్థానం వడ్డేపల్లి రూ.16.80 లక్షలు, అలంపూర్ రూ.29.40 లక్షలు, చండూరు రూ.31.55 లక్షలు, భూత్పూర్ రూ.34.11 లక్షలు ఉన్నాయి. ఈ మున్సిపాలిటీలు ఆర్థిక స్వావలంభన సాధించాలంటే పన్నులు పెంచుకోవడమో, ఆర్థిక వనరులు సమీకరించుకుంటే తప్ప అభివృద్ధి సాధ్యపడదు. లేదంటే ప్రభుత్వంపైనే ఆధారపడాల్సిన పరిస్థితి అనివార్యమవుతోంది.
అదనంగా 2,521 పోస్టులకు ప్రతిపాదన..
ఉద్యోగుల సంఖ్యను పెంచుకునేందుకు పురపాల క శాఖ ప్రతిపాదనలు తయారు చేసింది. ప్రస్తుతం రా ష్ట్రవ్యాప్తంగా ఉన్న 140 నగర, పురపాలక సంస్థ (జీహెచ్‌ఎంసీ మినహా)ల్లో 3 వేల మందికిపైగా ఉద్యోగులు ప ని చేస్తున్నారు. కొత్త పురపాలికలు పెరగడం, పరిధి వి స్తృతి కావడం, పనిభారం పెరగటంతో దానికి తగ్గట్టు గా సిబ్బంది అవసరమని మున్సిపల్ శాఖ అంచనా వే సింది. మున్సిపల్ కార్యకలాపాల నిర్వహణకు ప్రతి మున్సిపాలిటీకి 36 మంది అవసరం. ఇందులో మున్సిపల్ కమిషనర్, అసిస్టెంట్ ఇంజనీర్ గ్రేడ్–3, అసిస్టెంట్ ఇంజనీర్–3, టౌన్‌ప్లానిం గ్ అబ్జర్వర్ (టీపీబీఓ), జూనియర్ అకౌంటెంట్, హెల్త్ అసిస్టెంట్, బిల్ కలెక్టర్ పోస్టు లుంటాయి. వీటికి అదనంగా ఇతర సిబ్బంది ఉంటారు. అయితే, చాలా చోట్ల పోస్టులు ఖాళీగా ఉండటంతో సి బ్బందిపై తీవ్ర పనిభారం పడుతోంది. ఈ నేపథ్యంలో కొత్త పోస్టులు మంజూరు చేయాలని పురపాలకశాఖ ప్ర భుత్వానికి ప్రతిపాదనలు పంపింది. కొత్తగా 2,521 పోస్టులు మంజూరుకు అనుమతివ్వాలని కోరింది.
ఓరుగల్లు టాప్!
ఇక ఆదాయంలో ఓరుగల్లు టాప్‌లో నిలిచింది. హైదరాబాద్ నగర పాలక సంస్థ తర్వాతి స్థానం వరంగల్ మున్సిపల్ కార్పొరేషన్‌దే.. ఈ నగర పాలక సంస్థ వార్షికాదాయం రూ.121.65 కోట్లు. ఇందులో ఆస్తి పన్ను రూపంలో రూ.80.65 కోట్లు సమకూర్చుకుంటుండగా, రూ.40.99 కోట్లు ఇతర పద్దుల కింద సమీకరిస్తోంది. ఓరుగల్లు తర్వాత రాబడిలో ఇందూరు ద్వితీయ స్థానంలో ఉంది. ఈ నగర పాలక సంస్థ వార్షికాదాయం రూ.58.86 కోట్లు. ఇక మూడో స్థానంలో ఖమ్మం రూ.44.08 కోట్లు, నాలుగో స్థానంలో కరీంనగర్ రూ.41.57 కోట్లు ఉంది. ఇక అత్యల్ప రాబడి ఉన్న నగర పాలక సంస్థ జవహర్‌నగర్. దీని వార్షికాదాయం రూ.5.97 కోట్లే.. ఆ తర్వాత స్థానంలో మీర్‌పేట రూ.10.60 కోట్లతో కొనసాగుతోంది.
రాష్ట్రంలో రూ.కోటి కన్నా తక్కువ ఆదాయమున్న మున్సిపాలిటీలివే
Comments
Please login to add a commentAdd a comment