Hyderabad Municipal Corporation
-
పారిశుద్ధ్య నిర్వహణలో హైదరాబాద్ ఆదర్శంగా నిలుస్తోంది : కేటీఆర్
-
పుర రాబడి రూ.1,123 కోట్లు!
సాక్షి, హైదరాబాద్: రాష్ట్రంలోని పట్టణ స్థానిక సంస్థల ఆదాయం లెక్క తేలింది. కొత్తగా కొన్ని మున్సిపాలిటీలు, కార్పొరేషన్లు ఏర్పాటైన నేపథ్యంలో రాష్ట్రంలోని పలు మున్సిపాలిటీలు, కార్పొరేషన్లలో అదనపు సిబ్బంది ని యామక ప్రక్రియలో భాగంగా ఆయా పట్టణ సంస్థల కాసుల లెక్కను కూడా పురపాలక శా ఖ అధికారులు ఓ కొలిక్కి తెచ్చారు. ఆ మేరకు గ్రేటర్ హైదరాబాద్ మినహా మిగిలిన అన్ని (140) పురపాలికల్లో కలిపి ప్రభుత్వ ఖజానాకు రూ.1,123.87 కోట్లకు పైగా ఆదా యం సమకూరుతోంది. ఇందులో ఆస్తి పన్ను కింద రూ.671.33 కోట్లు.. ఇతర ఆదాయం రూ. 452.53 కోట్లు ఉంది. అయితే ఆస్తి పన్ను హే తుబద్ధీకరణ, ఇతర పన్నుల విషయంలో మరింత పకడ్బందీగా వ్యవహరిస్తే ఈ ఆదా యం మరో 20 శాతమైనా పెరుగుతుందని మున్సిపల్ అధికారులు చెబుతున్నారు. అగ్రభాగాన నార్సింగి.. అట్టడుగున అమరచింత మున్సిపాలిటీల ఆదాయంలో నార్సింగి అగ్రభాగాన ఉంది. రాజధానిని ఆనుకొని ఉన్న ఈ పురపాలిక వార్షికాదాయం రూ.26.12 కోట్లు, ద్వితీయ స్థానంలో మణికొండ రూ.20.11 కోట్లు, జగిత్యాల రూ.15.28 కోట్లుండగా.. అట్టడుగున అమరచింత మున్సిపాలిటీ ఉంది. ఇంకా పల్లె వాసనలు పోనీ ఈ పురపాలిక వార్షికాదాయం కేవలం రూ.13.92 లక్షలు మాత్రమే. ఆ తర్వాత స్థానం వడ్డేపల్లి రూ.16.80 లక్షలు, అలంపూర్ రూ.29.40 లక్షలు, చండూరు రూ.31.55 లక్షలు, భూత్పూర్ రూ.34.11 లక్షలు ఉన్నాయి. ఈ మున్సిపాలిటీలు ఆర్థిక స్వావలంభన సాధించాలంటే పన్నులు పెంచుకోవడమో, ఆర్థిక వనరులు సమీకరించుకుంటే తప్ప అభివృద్ధి సాధ్యపడదు. లేదంటే ప్రభుత్వంపైనే ఆధారపడాల్సిన పరిస్థితి అనివార్యమవుతోంది. అదనంగా 2,521 పోస్టులకు ప్రతిపాదన.. ఉద్యోగుల సంఖ్యను పెంచుకునేందుకు పురపాల క శాఖ ప్రతిపాదనలు తయారు చేసింది. ప్రస్తుతం రా ష్ట్రవ్యాప్తంగా ఉన్న 140 నగర, పురపాలక సంస్థ (జీహెచ్ఎంసీ మినహా)ల్లో 3 వేల మందికిపైగా ఉద్యోగులు ప ని చేస్తున్నారు. కొత్త పురపాలికలు పెరగడం, పరిధి వి స్తృతి కావడం, పనిభారం పెరగటంతో దానికి తగ్గట్టు గా సిబ్బంది అవసరమని మున్సిపల్ శాఖ అంచనా వే సింది. మున్సిపల్ కార్యకలాపాల నిర్వహణకు ప్రతి మున్సిపాలిటీకి 36 మంది అవసరం. ఇందులో మున్సిపల్ కమిషనర్, అసిస్టెంట్ ఇంజనీర్ గ్రేడ్–3, అసిస్టెంట్ ఇంజనీర్–3, టౌన్‌ప్లానిం గ్ అబ్జర్వర్ (టీపీబీఓ), జూనియర్ అకౌంటెంట్, హెల్త్ అసిస్టెంట్, బిల్ కలెక్టర్ పోస్టు లుంటాయి. వీటికి అదనంగా ఇతర సిబ్బంది ఉంటారు. అయితే, చాలా చోట్ల పోస్టులు ఖాళీగా ఉండటంతో సి బ్బందిపై తీవ్ర పనిభారం పడుతోంది. ఈ నేపథ్యంలో కొత్త పోస్టులు మంజూరు చేయాలని పురపాలకశాఖ ప్ర భుత్వానికి ప్రతిపాదనలు పంపింది. కొత్తగా 2,521 పోస్టులు మంజూరుకు అనుమతివ్వాలని కోరింది. ఓరుగల్లు టాప్! ఇక ఆదాయంలో ఓరుగల్లు టాప్‌లో నిలిచింది. హైదరాబాద్ నగర పాలక సంస్థ తర్వాతి స్థానం వరంగల్ మున్సిపల్ కార్పొరేషన్‌దే.. ఈ నగర పాలక సంస్థ వార్షికాదాయం రూ.121.65 కోట్లు. ఇందులో ఆస్తి పన్ను రూపంలో రూ.80.65 కోట్లు సమకూర్చుకుంటుండగా, రూ.40.99 కోట్లు ఇతర పద్దుల కింద సమీకరిస్తోంది. ఓరుగల్లు తర్వాత రాబడిలో ఇందూరు ద్వితీయ స్థానంలో ఉంది. ఈ నగర పాలక సంస్థ వార్షికాదాయం రూ.58.86 కోట్లు. ఇక మూడో స్థానంలో ఖమ్మం రూ.44.08 కోట్లు, నాలుగో స్థానంలో కరీంనగర్ రూ.41.57 కోట్లు ఉంది. ఇక అత్యల్ప రాబడి ఉన్న నగర పాలక సంస్థ జవహర్‌నగర్. దీని వార్షికాదాయం రూ.5.97 కోట్లే.. ఆ తర్వాత స్థానంలో మీర్‌పేట రూ.10.60 కోట్లతో కొనసాగుతోంది. రాష్ట్రంలో రూ.కోటి కన్నా తక్కువ ఆదాయమున్న మున్సిపాలిటీలివే -
రిమ్జిమ్ రిమ్జిమ్ హైదరాబాద్
ఇక జీహెచ్ఎంసీ ‘జిమ్స్’.. ఫిట్నెస్ మంత్రం జపిస్తున్న నగర కార్పొరేషన్ హైదరాబాద్: ప్రతి ఒక్కరికీ ఆరోగ్యం.. ఫిట్‌నెస్‌పై శ్రద్ధ ఉంటుంది. ఇందు కోసం చాలా మంది ప్రైవేట్ జిమ్‌లను ఆశ్రయిస్తున్నారు. అయితే ఆర్థిక స్థోమత లేని వారు.. అందుబాటులో జిమ్‌లు లేని వారు వీటికి దూరంగా ఉండిపోతున్నారు. ఇలాంటి వారి కోసమే గ్రేటర్ హైదరాబాద్ మున్సిపల్ కార్పొరేషన్(జీహెచ్ఎంసీ) అందరికీ ఉపయోగపడే అత్యాధునిక జిమ్‌లను అందుబాటులోకి తెస్తోంది. వ్యాయామం ద్వారా ఆరోగ్య పరిరక్షణతో పాటు శారీరక, మానసిక దృఢత్వం అందించేందుకు జిమ్‌లు ఉపయోగపడతాయని భావించి వీటిని ఏర్పాటు చేస్తోంది. ఇందులో భాగంగా బుధవారం గ్రేటర్‌లోని ఐఎస్ సదన్, రామంతాపూర్, ఉప్పల్, చిలుకానగర్, హబ్సిగూడతో సహ పది ప్రాంతాల్లో జిమ్‌లను మేయర్ బొంతు రామ్మోహన్ ప్రారంభించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. ఒక్కో జిమ్‌ను సగటున యాభై మంది ఉపయోగించుకోవచ్చని, మరో 125 జిమ్‌లు త్వరలో అందుబాటులోకి రానున్నాయని చెప్పారు. వీటి ద్వారా యువత, వయోధికులు, మహిళలకు ఎక్కువ ప్రయోజనం చేకూరుతుందన్నారు. అన్ని జిమ్ సెంటర్లలో ఉచిత వైఫై సదుపాయం కల్పించే అంశాన్ని పరిశీలిస్తున్నామన్నారు. వీటి వద్ద సీసీ కెమెరాలను స్థానిక కాలనీ, సంక్షేమ సంఘాలే ఏర్పాటు చేసుకోవాలని సూచించారు. జీహెచ్ఎంసీ ఆధ్వర్యంలోని 12 ప్రధాన క్రీడా మైదానాల్లో కూడా ఆధునిక జిమ్‌లను ఏర్పాటు చేస్తామన్నారు. ఆధునిక సామగ్రి.. గ్రేటర్లో మొత్తం 135 జిమ్‌ల ఏర్పాటుకు అవసరమైన సామగ్రిని జీహెచ్ఎంసీ ఇప్పటికే కొనుగోలు చేసింది. పేరెన్నికగ న్న కంపెనీల నుంచి ఆధునిక సామగ్రిని ఈ జిమ్‌ల కోసం కొనుగోలు చేశారు. ఒక్కో జిమ్‌లో 21 ఉపకరణాలు ఉంటాయి. వీటిల్లో ఆధునిక సైక్లింగ్, త్రెడ్మిల్, ప్లేట్‌స్టాండ్, ట్రైస్టర్, డంబెల్స్, ట్విస్టర్స్, ఫోర్‌స్టేషన్ మల్టీ జిమ్, ఇంక్లైన్, డిక్లైన్ బెంచ్ తదితర సామగ్రి ఉంటాయని జీహెచ్ఎంసీ క్రీడా విభాగం ఓఎస్డీ ప్రేమ్‌రాజ్ తెలిపారు. ఎక్కడెక్కడ.. ఎవరి ఆధ్వర్యంలో.. ఒక్కో జిమ్‌కు జీహెచ్ఎంసీ సగటున రూ.10 లక్షలు ఖర్చు చేస్తోంది. జిమ్‌లో అవసరమైన ఉపకరణాలు, క్రీడాపరికరాలు తదితరాలకు రూ.5 లక్షలు ఖర్చు చేస్తుండగా, కేంద్రా ల్లో సదుపాయాల కల్పనకు మరో రూ.5 లక్షలు వెచ్చిస్తోంది. వీటి నిర్వహణను స్థానిక కాలనీ సంక్షేమ సంఘాలు, రెసిడెన్షియల్ వెల్ఫేర్ అసోసియేషన్లకు అప్పగించనున్నారు. ఈ మేరకు స్థానిక కార్పొరేటర్, రెసిడెన్షియల్ వెల్ఫేర్ అసోసియేషన్, జీహెచ్ఎంసీ ఒప్పందం కుదుర్చుకుంటాయి. సంబంధిత డిప్యూటీ కమిషనర్, ఏఈలు నిర్వహణను పరిశీలిస్తారు. కేంద్ర నిర్వహణతోపాటు సామగ్రి రక్షణ బాధ్యత రెసిడెన్షియల్ వెల్ఫేర్ సొసైటీలదే. పేద, మధ్య తరగతి వారికి ఉపకరించే ఉద్దేశంతో ఏర్పాటు చేస్తున్న వీటిల్లో నెలకు సుమారు రూ. 100 వసూలు చేయవచ్చని తెలుస్తోంది. జిమ్ నిర్వహణకే ఫీజును వసూలు చేస్తారు. సంపన్న ప్రాంతాల్లో అధికంగా వసూలు చేసే యోచన ఉంది. -
‘డబుల్’పై రెవెన్యూ సర్వే!
మురికివాడల్లో స్థలాల గుర్తింపే లక్ష్యం బిజీగా మారిన అధికారులు త్వరలో సర్కారుకు సమగ్ర నివేదిక సిటీబ్యూరో: డబుల్ బెడ్రూమ్ ఇళ్ల పథకంపై దృష్టి సారించిన ప్రభుత్వం స్థలాల ఎంపికపై మురికివాడల్లో సర్వే నిర్వహిస్తున్నది.గ్రేటర్ హైదరాబాద్ మున్సిపల్ కార్పొరేషన్ పరిధిలో ఉన్న 1476 మురికివాడల్లో రెవెన్యూ శాఖ అధ్వర్యంలో తహాశీల్దార్లు, సిబ్బంది మూడు రోజులుగా సర్వే కార్యక్రమంలో నిమగ్నమయ్యారు. ముఖ్యమంత్రి కేసీఆర్ పేదలకు డబుల్ బెడ్ రూమ్ పథకాన్ని ప్రకటించటంతోపాటు నగరంలో ఒక మోడల్ కాలనీ కూడా నిర్మించారు. దీంతో డబుల్ బెడ్ రూమ్ ఇళ్ల పథకానికి ఆదరణ పెరిగింది. ఫలితంగా హైదరాబాద్, రంగారెడ్డి కలెక్టరేట్లతో సహా జీహెచ్ఎంసీ చుట్టూ ప్రజలు, మహిళలు డబుల్ బెడ్రూమ్ ఇళ్ల కోసం దరఖాస్తులు పెట్టుకొవటానికి పరుగులు తీస్తున్నారు. గ్రేటర్ లో మొదటి విడతలో 11,500 డబుల్ బెడ్ రూమ్ ఇళ్ల కోసం 46 బస్తీలను గుర్తించిన అధికార యంత్రాంగం...ప్రభుత్వ లక్ష్యానికి అనుగుణంగా నగరంలో లక్ష ఇళ్ల కోసం మరి కొన్ని బస్తీలను గుర్తించాల్సిన అవసరం నెలకొంది. ఈ నేపథ్యంలోనే మురికివాడల్లో స్థలాల గుర్తింపు తదితర అం శాలను పరిశీలించేందుకు సర్వే కార్యక్రమా న్ని రెవెన్యూ శాఖ నిర్వహిస్తున్నది. ఈ సర్వేలో భాగంగా మురికి వాడ ల్లో నివాసముంటున్న కుటుంబాల సంఖ్యతోపాటు స్థల వైశాల్యం, భూమి వివరాలు, సర్వే నంబర్లు సేకరిస్తున్నా రు. ఈ వాడల్లో గతంలో సమగ్ర కుటుంబ సర్వే నిర్వహించారా లేదానన్న విషయాలపై ఆరా తీస్తున్నారు. స్లమ్‌లో డబుల్ బెడ్ రూమ్ పథకంలో భాగంగా బహుళ అంతస్తుల భవన నిర్మాణానికి ఇక్కడి ప్రజలు సానుకూలంగా ఉన్నారా..? లేక భిన్నాభిప్రాయాలు వ్యక్తపరుస్తున్నారా...అన్న విషయాలను సర్వే సందర్భంగా సిబ్బం ది సేకరిస్తున్నట్లు తెలుస్తున్నది. మురికి వాడల్లో సర్వే ద్వారా సేకరించిన సమాచారాన్ని సమగ్ర నివేదిక రూపంలో రెండు రోజుల్లోగా రెవెన్యూ శాఖ జిల్లా అధికారయంత్రాంగానికి నివేదించనుంది. ఇదే నివేదికను మరో మారు జిల్లా స్థాయిలో పరిశీలించి ప్రభుత్వానికి అందజేయనున్నట్లు తెలుస్తున్నది. -
తేలిన లెక్క
లక్డీకాపూల్‌లోని కలెక్టరేట్ మొత్తం విస్తీర్ణం 6,575 చదరపు గజాలు. దాంట్లో భవన సముదాయాలు 4,895 చదరపు అడుగుల్లో విస్తరించి ఉన్నాయి. 40ఏళ్ల క్రితం గోషామహల్లో నిర్మించిన సరూర్‌నగర్ ఆర్డీఓ ఆఫీస్ 10,890 చదరపు అడుగుల్లో ఉంది. భవనం కాకుండా సుమారు 3వేల గజాల ఖాళీ స్థలం ఉంది. ఖైరతాబాద్‌లోని 2.425 ఎకరాల్లో జెడ్పీ ప్రాంగణం ఉండగా, ఇది ప్రధాన రహదారికి 200 మీటర్ల దూరంలో ఉంది. బుద్వేల్లోని డీఎంఅండ్‌హెచ్‌ఓ కార్యాలయం 1500 గజాల్లో ఉంది. కొలిక్కివచ్చిన సర్కారీ స్థిరాస్తుల వివరాలు శాఖాధిపతుల ద్వారా ప్రభుత్వానికి నివేదిక ఆగమేఘాల మీద కొలతలు,బిల్టప్ ఏరియా అంచనాలు సాక్షి, రంగారెడ్డి జిల్లా ప్రతినిధి : ప్రభుత్వ స్థిరాస్తుల లెక్క కొలిక్కి వచ్చింది. హైదరాబాద్ మహానగర పాలక సంస్థ (జీహెచ్ఎంసీ) పరిధిలోని సర్కారీ భవంతుల సమస్త సమాచారాన్ని బుధవారంలోపు నివేదించాలని ప్రభుత్వం ఆదేశించిన సంగతి తెలిసిందే. ఈ నేపథ్యంలో ఆగమేఘాల మీద ప్రభుత్వ భవనాలను కొలిచి సమగ్ర వివరాలను సేకరించిన యంత్రాంగం.. ఆయా శాఖాధిపతుల ద్వారా సమాచారాన్ని ప్రభుత్వానికి పంపింది. భవన విస్తీర్ణం, సర్వే నంబర్, లీజులు, ఆక్రమణలు, కోర్టు కేసులు, ప్రధాన మార్గానికి ఎంత దూరం? తదితర అంశాలపై రూపొందించిన నమూనాకు అనుగుణంగా వివరాలను పొందుపరిచింది. జంటనగరాల్లో విసిరేసినట్లుగా ఉన్న జిల్లా కార్యాలయాలన్నింటినీ ఒకే చోట ఉండేలా ఇంటిగ్రేటెడ్ కాంప్లెక్స్‌లను నిర్మించాలని ప్రభుత్వం భావిస్తోంది. దీంట్లో భాగంగానే సర్కారు ఆఫీసుల బిల్టప్ ఏరియా లెక్క తేల్చిన ట్లు తెలుస్తోంది. అంతేకాకుండా విలువైన ప్రదేశాల్లో కొలువుదీరిన కార్యాలయాల స్థలాలను విక్రయించడం ద్వారా ఖజానా నింపుకొనే యోచన కూడా చేస్తున్న ప్రభుత్వం.. సమస్త సమాచారాన్ని సేకరించినట్లు ప్రచారం జరుగుతోంది. -
జీహెచ్ఎంసీ క్రికెట్ విజేత సీసీఓబీ
సాక్షి, హైదరాబాద్: గ్రేటర్ హైదరాబాద్ మున్సిపల్ కార్పొరేషన్ (జీహెచ్ఎంసీ) సమ్మర్ క్యాంపులో భాగంగా నిర్వహించిన ఇంటర్ జోనల్ క్రికెట్ టోర్నమెంట్లో సీసీఓబీ విజేతగా నిలిచింది. విక్టరీ ప్లేగ్రౌండ్స్‌లో ఆదివారం జరిగిన అండర్-14 ఫైనల్లో సీసీఓబీ జట్టు పది వికెట్ల తేడాతో ఖిల్వత్ సీసీపై గెలుపొందింది. తొలుత బ్యాటింగ్ చేసిన ఖిల్వత్ క్రికెట్ క్లబ్ నిర్ణీత 6 ఓవర్లలో 7 వికెట్ల నష్టానికి 41 పరుగులు చేసింది. తర్వాత లక్ష్యఛేదనకు దిగిన సీసీఓబీ 4.4 ఓవర్లలోనే వికెట్లేమీ నష్టపోకుండా 42 పరుగులు చేసి గెలిచింది. అర్బాజ్ 30 పరుగులు చేసి నాటౌట్‌గా నిలిచాడు. అనంతరం జరిగిన బహుమతి ప్రదానోత్సవ కార్యక్రమానికి జీహెచ్ఎంసీ స్పోర్ట్స్ డెరైక్టర్ ఎస్.ఆర్. ప్రేమ్‌రాజ్ ముఖ్యఅతిథిగా విచ్చేసి బహుమతులు అందజేశారు. కోచ్ మక్బూల్ బేగ్, జగన్నాథ్ స్వామి, సయ్యద్ షహీన్, మీర్ దావూద్ అలీ తదితరులు పాల్గొన్నారు. -
తెరపైకి వికారాబాద్ పోలీస్ జిల్లా!
*‘జీహెచ్ఎంసీ పరిధి’కి పరిష్కారమిదే *శాంతిభద్రతలు ఉండేది సీఎం చేతిలోనే! *అవసరమైనప్పుడే గవర్నర్ జోక్యం సాక్షి, సిటీబ్యూరో: ‘జీహెచ్ఎంసీ పరిధిలో శాంతిభద్రతల అంశం గవర్నర్ చేతిలో ఉంటుంది’ఆంధ్రప్రదేశ్ పునర్నిర్మాణం-2013 బిల్లులో ఉన్న ఓ కీలకాంశమిది. ఇది అమలు కావాలంటే పదేళ్ల క్రితం మరుగున పడిపోయిన వికారాబాద్ పోలీసు జిల్లాను అమలులోకి తేవాల్సి ఉంటుందని నిపుణులు స్పష్టం చేస్తున్నారు. అలా కాకుంటే సైబరాబాద్ పరిస్థితి అగమ్య గోచరంగా మారుతుందని వ్యాఖ్యానిస్తున్నారు. రాజధాని నగరంలో 325 చదరపు కి.మీ. పరిధిలో విస్తరించి ఉన్న హైదరాబాద్, 3600 చ.కి.మీ. పరిధిలో విస్తరించి ఉన్న సైబరాబాద్... ఇలా రెండు పోలీసు కమిషనరేట్లు ఉన్నాయి. జీహెచ్ఎంసీ పరిధిలోని ప్రాంతాల్లో శాంతిభద్రతల పరిరక్షణను గవర్నర్‌కు అప్పగించిన నేపథ్యంలో హైదరాబాద్ మొత్తం గవర్నర్ చేతిలోకే వెళ్తుంది. ఇక్కడ సమస్యల్లా సైబరాబాద్ విషయంలోనే. దీనికి వికారాబాద్ జిల్లా పరిష్కారం కావచ్చని నిపుణులు వివరిస్తున్నారు. సగం వరకే ఇక్కడ... 2002లో సైబరాబాద్ పోలీసు కమిషనరేట్ ఏర్పడినప్పుడు గ్రేటర్ హైదరాబాద్ మున్సిపల్ కార్పొరేషన్ (జీహెచ్ఎంసీ) లేదు. ఈ నేపథ్యంలోనే అప్పటి హైదరాబాద్ మున్సిపల్ కార్పొరేషన్ (ఎంసీహెచ్)లోని ప్రాంతాలను హైదరాబాద్ కమిషనరేట్‌లో ఉంచిన అధికారులు... దీనికి బయట ఉన్న ప్రాంతాలతో పాటు రంగారెడ్డి జిల్లాలోని కొన్నింటిని కలిపి సైబరాబాద్‌గా మార్చారు. జీహెచ్ఎంసీ ఏర్పడటంతో వీటి స్వరూప స్వభావాలు మారిపోయాయి. చుట్టుపక్కల ఉన్న మున్సిపాలిటీలన్నీ విలీనం కావడంతో జీహెచ్ఎంసీ విస్తృతమైంది. ఫలితంగా సగం సైబరాబాద్ జీహెచ్ఎంసీలో కలిసిపోగా, మిగతా సగభాగం రంగారెడ్డి జిల్లా గ్రామ పంచాయతీల్లో ఉండిపోయింది. అది ఇప్పుడు అమల్లోకి... సైబరాబాద్ కమిషనరేట్‌ను ఏర్పాటు చేస్తున్న సందర్భంలోనే పోలీసు విభాగం ఓ కీలక నిర్ణయం తీసుకుంది. ఇటు సైబరాబాద్, అటు రంగారెడ్డి జిల్లాలకు ప్రాంతాలను విభజించిన తరవాత మధ్యలో ఉన్న కొన్నింటితో వికారాబాద్ జిల్లాను ఏర్పాటు చేశారు. ఇది రెవెన్యూ పరంగా రంగారెడ్డిలోనే ఉన్నప్పటికీ.. పోలీసు పరంగా ప్రత్యేక జిల్లా. ఇందులో తాండూరు, ఇబ్రహీంపట్నం, మంచాల్ తదితర ప్రాంతాల్ని చేర్చారు. అయితే ఇది అమల్లోకి రాకపోవడంతో ఈ ప్రాంతాల్లో కొన్ని రంగారెడ్డిలో, మరికొన్ని సైబరాబాద్‌లో కలిసిపోయాయి. ప్రస్తుత పరిస్థితిలో జీహెచ్ఎంసీ పరిధిలో శాంతిభద్రతలు గవర్నర్‌కు చేరితే... సైబ రాబాద్‌లో మిగిలిన ప్రాంతాలతోపాటు ఇతరాలతోనూ వికారాబాద్ జిల్లాను కార్యరూపంలోకి తెచ్చే అవకాశముంది. సవరణ అక్కర్లేకుండానే స్వీకరణ... విభజన అనంతరం జీహెచ్ఎంసీ పరిధిలోని శాంతిభద్రతల అంశాన్ని గవర్నర్ పూర్తిగా తన చేతిలోకి తీసుకోవాలంటే ఎలాంటి రాజ్యాంగ, చట్ట సవరణ అవసరం లేదన్నది మాజీ పోలీసు అధికారుల మాట. శాంతిభద్రతలు రాష్ట్ర జాబితాలోని అంశం. కేంద్రం ఉమ్మడి జాబితాలో ఉన్న వాటితో పాటు రాష్ట్ర జాబితాలో ఉన్న వాటినీ కావాలనుకుంటే ఆదే శాలతో కేంద్ర జాబితాలోకి మార్చుకునే అవకాశం ఉందని స్పష్టం చేస్తున్నారు. ఆంధ్రప్రదేశ్ పోలీసు మాన్యువల్‌లో కానీ, సిటీ, సైబరాబాద్ పోలీసు చట్టాల్లో కానీ ఎక్కడా ‘ముఖ్యమంత్రి’ ప్రస్తావన లేని నేపథ్యంలో వీటి సవరణకూ అవసరం రాదని స్పష్టం చేస్తున్నారు. అన్నింటిలోనూ గవర్నర్ జోక్యం ఉండదు శాంతిభద్రతల అంశం గవర్నర్‌కు అప్పగించి, కేంద్రం ఇద్దరు ప్రత్యేక అధికారుల్ని నియమించినప్పటికీ దైనందిన కార్యకలాపాలను ముఖ్యమంత్రి, డీజీపీనే పర్యవేక్షిస్తారనే వాదనా వినిపిస్తోంది. సిబ్బంది ఎంపిక, బదిలీలు, పదోన్నతులు తదితర అంశాలన్నీ ఇప్పటిలాగే సాగుతాయని అభిప్రాయపడుతున్నారు. వివాదాలకు ఆస్కారమున్న, కీలక నిర్ణయాల్లో మాత్రమే వారి సలహా-సూచనలతో పాటు ఆదేశాలను పాటిస్తారని అంటున్నారు. పునర్వ్యవస్థీకరణ బిల్లు పూర్తి రూపం సంతరించుకుని, విధివిధానాలు, నిబంధనలు అందులో పొందుపరిస్తే తప్ప ఏ విషయాన్నీ కచ్చితంగా ఇలానే జరుగుతుందని చెప్పలేమని స్పష్టం చేస్తున్నారు. ఇప్పటికీ సందేహాలుగా ఉన్న అనేక సమస్యలకి అవే సమాధానం చెప్తాయని వివరిస్తున్నారు. ఇదీ ప్రస్తుత పరిస్థితి... సైబరాబాద్ కమిషనరేట్ పరిధిలో ఉన్న 40 శాంతిభద్రతల ఠాణాల్లో 18 జీహెచ్ఎంసీ పరిధిలోకి రావు. అలాగే 12 ట్రాఫిక్ ఠాణాలలో 4 జీహెచ్ఎంసీ పరిధిలోకి రావు. సామాజిక అన్యాయం జరిగితేనే జోక్యం శాంతిభద్రతల్ని గవర్నర్‌కు అప్పగించినా ప్రతి అంశాన్నీ ఆయన పర్యవేక్షించరు. ఎథినిక్ మైనార్టీలుగా పిలిచే గ్రూపులకు అన్యాయం జరిగినప్పుడు మాత్రమే తన విస్తృతాధికారాలను వినియోగిస్తారు. ఆయా ఉదంతాలకు సంబంధించిన కేసుల్ని స్వయంగా పర్యవేక్షిస్తారు. గవర్నర్‌కు అప్పగించడం అనేది సామాజిక న్యాయం కోసమే. - పేర్వారం రాములు, మాజీ డీజీపీ